S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/28/2018 - 02:41

నంద్యాల, డిసెంబర్ 27: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్ శేషఫణి ఏసీబీ అధికారులకు చిక్కారు. శేషఫణిపై గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో గురువారం ఐదు బృందాలు ఏకకాలంలో శేషఫణి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి.

12/28/2018 - 02:18

కుప్పం, డిసెంబర్ 27: చెన్నై-బెంగళూరు రైల్వేమార్గంలో కుప్పం శివారు కర్నాటక రాష్ట్రం బంగారుపేట తాలుకా వరదపుర రైల్వేగేటు సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు గ్యాంగ్‌మెన్లు మృతి చెందారు.

12/28/2018 - 02:47

నాగపూర్: కోర్టు ఆవరణలో సెషన్స్ జడ్జిపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాడి చేసిన సంఘటనను బొంబాయి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి సంఘటనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదకరమని హైకోర్టు నాగపూర్ బెంచి వెకేషన్ కోర్టు జడ్జి ఆర్‌కె దేశ్‌పాండే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

12/28/2018 - 02:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ ఈ నెల 31వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోనున్నారు. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదును విధించింది. లొం గిపోయేందుకు డెడ్‌లైన్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించిన విషయం విదితమే. ఈ కేసులో అప్పీల్ చేయాలని స్జన్కుమార్ న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు.

12/28/2018 - 02:01

సిమ్లా, డిసెంబర్ 27: ధర్మశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు విద్యార్థులు వెళుతున్న బస్సు బోల్తా పడిన ఘటనలో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం కాంగ్రా జిల్లాలో జరిగింది. విద్యార్థులు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో చదువుతున్నారు. ధర్మశాలలోని పోలీసు మైదానంలో మోదీ సభకు వెళ్లేందుకు ఈ విద్యార్థులు బస్సులో వెళుతుండగా, ఈ దుర్ఘటన జరిగింది.

12/28/2018 - 01:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశంలో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఏసీస్ ఉగ్రవాద అనుమానితులను 12 రోజుల పోలీసుకస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది మంది ఉగ్రవాద అనుమానితులను ఎన్‌ఐఏ పోలీసులు బుధవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిని ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు.

12/28/2018 - 01:33

వనస్థలిపురం, డిసెంబర్ 27: వనస్థలిపపురం పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్‌లు రెండవ రోజు కూడా రెచ్చిపోయారు. బుధవారం రోజున జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లు మరవక ముందే గురువారం రోజుకుడా వనస్థలిపురంతో పాటు ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని చైతన్యపురి, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లలో స్నాచర్స్‌లు మరోసారి విజృంభించారు. రెండు రోజులుగా వరస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

12/28/2018 - 01:33

శంషాబాద్, డిసెంబర్ 27: అంతర్జాతీయ విమానాశ్రయంలో 310గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రయాణికురాలను ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో గుర్తించి అమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణ కోసం మహిళను ఇమిగ్రేషన్ అధికారులు.. కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

12/27/2018 - 22:14

రాజంపేట, డిసెంబర్ 27: కడపజిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు అటవ ప్రాంతంలో అందిన సమాచారంతో గురువారం అటవీ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురై అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడగా అటవీ శాఖకు చెందిన ప్రొటెక్షన్ వాచర్స్ ఇరువురు గాయపడ్డారు. వీరిలో ఒకరిని పట్టుకుని, అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 94 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ శ్రీనివాసులు తెలిపారు.

12/27/2018 - 03:20

నాదెండ్ల/దాచేపల్లి, డిసెంబర్ 26: గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. నాదెండ్ల మండలంలో సాతులూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా, దాచేపల్లి మండలంలో కంటైనర్ లారీని కారు డీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Pages