S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/13/2017 - 18:55

పూజా రామచంద్రన్, మనోజ్ నందన్, ధన్‌రాజ్ ముఖ్యపాత్రల్లో శ్రీకిశోర్ దర్శకత్వంలో ఆర్.వి.రాజు, ఆక్రోశ్ నిర్మిస్తున్న ‘దేవిశ్రీప్రసాద్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మా త మల్కాపురం శివకుమార్ సీడీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మధుర శ్రీ్ధర్, శివబాలాజీ, తా.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

10/13/2017 - 18:54

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. సూపర్‌స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకంగా 400కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

10/13/2017 - 18:53

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవలే మహేష్ సరసన ‘స్పైడర్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మరోసారి ఆమె మళ్లీ మహేష్‌తో నటించేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్న రకుల్, మరోవైపు తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా మహేష్‌తో జోడీకట్టిన ఈమె టాలెంట్‌కు మెచ్చిన మహేష్ మరోసారి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడట.

10/12/2017 - 20:02

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘స్పైడర్’ సినిమా తరువాత నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం ఇటీవలే ఓ షెడ్యూల్ జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హాలీడేస్‌లో వున్న మహేష్‌బాబు విదేశాలనుండి ఇండియాకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి జరిగే మరో షెడ్యూల్‌లో మహేష్ పాల్గొంటాడట.

10/12/2017 - 20:00

నాగార్జునతో కలిసి సమంత నటిస్తున్న ‘రాజుగారి గది-2’ నేడు విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈమధ్యే చైతన్యతో పెళ్లి పీటలెక్కిన సమంత పాల్గొన్న మొదటి మీడియా సమావేశం కావడంతో అందరి దృష్టి ఆమెపైనే ఉంది. పైగా ఈ చిత్రంలో ఆత్మగా ఆమె కన్పిస్తుందట. నాగార్జునతో కలసి సమంత కొత్త ఉత్సాహంతో ఈ మీడియా సమావేశంలో కొత్త ఉత్సహంతో పాల్గొంది.

10/12/2017 - 19:59

ప్రశాంత్ నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా గోధా క్రియేషన్స్ పతాకంపై వానమామలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీకరం శుభకరం నారాయణీయం’ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రాల వేణుగోపాలా చారి క్లాప్‌నివ్వగా శ్రీమతి మధు కెమెరా స్విచ్చాన్ చేశారు.

10/12/2017 - 19:58

నయనతార ప్రధాన పాత్రలో గోపి నైజర్ దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మాతగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తమిళంలో రూపొందిన ఆరమ్ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కలెక్టర్‌గా నటిస్తోంది.

10/12/2017 - 19:56

సందీప్‌కిషన్, మెహరీన్ జంటగా ప్రముఖ తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ- సుశీంద్రన్ దర్శకత్వంలో ‘నాపేరు శివ’ తరహాలో సాగే సినిమా ఇది. మధ్యతరగతి వారి ఫీలింగ్స్‌ను చక్కగా ఎలివేట్ చేస్తారు.

10/12/2017 - 19:55

రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ ముఖ్యపాత్రల్లో రేవన్ యాదూ దర్శకత్వంలో ఇ.ఎం.వి. స్టూడియో పతాకంపై వడ్డేపల్లి సత్యనారాయణ సమర్పణలో తెరకెక్కిన ‘హౌరాబ్రిడ్జి’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు రేవన్ యాదూ మాట్లాడుతూ- గోడ, బ్రిడ్జి ఒకే మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ గోడ విడదీస్తే బ్రిడ్జి కలుపుతుంది.

10/12/2017 - 19:53

చేతన్, డింపుల్ హయాతి జంటగా ఒక రొమాంటిక్ క్రైం కథ, గంగపుత్రులు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘గల్ఫ్’. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ఇందులో హీరోగా నటిస్తున్న చేతన్ మీడియాతో చెప్పిన విశేషాలు.. గల్ఫ్ బాధితుల నేపథ్యంలో తెరకెక్కిన సందేశాత్మక చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్ బాధితుల సంఖ్య ఎక్కువే.

Pages