S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2017 - 20:42

ఏంటి.. మిల్కీ భామ తమన్నా పెళ్లి చేసుకుంటుందా? అంటూ షాక్ అవుతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ముందు ఈ విషయం వినండి.. ఆ తరువాత మీరే నిజమే అంటారు. అసలు విషయం ఏమిటంటే, గ్లామర్ భామగా సౌత్‌లో క్రేజ్ తెచ్చుకున్న తమన్నా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.. ఆమె పెళ్లికోసం కాదండోయ్.. వాళ్ల అన్నయ్య ఆనంద్ భాటియా కోసం? ఆనంద్‌కు ఈమధ్యే పెళ్లి కుదిరింది. దాంతో పెళ్లికోసం బిజీగా మారిపోయింది తమన్నా.

07/02/2017 - 21:25

సహజంగా అమ్మాయిలు తమకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతారు. మరికొందరు ఊహల్లో మునిగి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. కానీ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్ తనకు అచ్చం పవన్‌కల్యాణ్ లాంటి భర్త కావాలంటూ స్టేట్‌మంట్ ఇచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక ‘విచిత్రం’ సినిమాతో హీరోయిన్‌గా మెరిసిన పూనమ్ కౌర్ ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది.

07/02/2017 - 21:25

నాగచైతన్య, శ్రీకాంత్ కథానాయకులుగా వారాహి చలనచిత్ర పతాకంపై ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టీజర్, ఆడియోలను త్వరలో విడుదల చేయనున్నట్టుగా నిర్మాతలు చెబుతున్నారు. శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండడం విశేషం.

07/02/2017 - 21:24

ఆశిష్ రాజ్, సిమ్రాన్ జంటగా వికెఎ ఫిలింస్ పతాకంపై ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో కెఆర్ విజయ్‌కరణ్, కెఆర్ కౌశల్‌కరణ్, కెఆర్ అనిల్‌కరణ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇగో’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో జరిగింది. తొలి సన్నివేశంపై సంగీత దర్శకుడు సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, శ్రీనివాస్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

07/02/2017 - 21:24

‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కత్రినా కైఫ్‌ను అంత త్వరగా మరిచిపోలేం. బాలీవుడ్‌లో హిట్‌మీద హిట్‌లు ఇస్తూ టాప్‌స్టార్‌గా ఎదిగిన కత్రినా ఆ తర్వాత దక్షిణాదివైపు కనె్నత్తి చూడలేదు. తాజాగా ఆమె నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో కత్రినా కైఫ్ బిజీగా పాల్గొంటోంది.

07/02/2017 - 21:23

‘వైశాఖం చిత్రంలో ప్రతి పాటా వైవిధ్యంగా ఉంటుంది. దర్శకురాలు జయకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలకు కొరియోగ్రఫీ చేయడం మరిచిపోలేని అనుభవం’ అని డాన్స్ మాస్టర్ శేఖర్ విజె తెలిపారు. ఆర్‌జె సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ట్రైలర్లకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.

07/02/2017 - 21:23

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ దర్శకుల రేస్‌లో ఉన్న త్రివిక్రమ్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఎన్టీఆర్‌తో చేయనున్నాడు. నిజానికి వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ కమిట్ ఉండడంతో ఆలస్యమైంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా పూర్తి కావస్తుండడంతో తన తరవాత చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు.

07/02/2017 - 21:23

జగపతిబాబు కధానాయకుడిగా మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నారు. కారెక్టర్ ఆర్టిస్టుగా విలన్‌గా నటిస్తున్న ఆయన తిరిగి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పటేల్ సార్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. వారాహి చలనచిత్రం పతాకంపై వాసు పరిమి దర్శకత్వంలో రజని కొర్రపాటి రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ కానె్సప్ట్ టీజర్‌కు 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

07/02/2017 - 21:23

నయనతార ప్రధాన పాత్రలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘పుదియ నియమం’ ఈ చిత్రాన్ని తెలుగులో వాసుకిగా అనువదిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటనకు నయనతారకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు రావడం విశేషం. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్ర్తి కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

07/02/2017 - 21:22

నాగచైతన్య, శ్రీకాంత్ కథానాయకులుగా వారాహి చలనచిత్ర పతాకంపై ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘యుద్ధం శరణం’ అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టీజర్, ఆడియోలను త్వరలో విడుదల చేయనున్నట్టుగా నిర్మాతలు చెబుతున్నారు. శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండడం విశేషం.

Pages