S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం నేషనల్‌వైడ్ హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే హాలీడేస్‌ని ముగించుకున్న ప్రభాస్ త్వరలోనే సాహో షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
యూత్ స్టార్ నితిన్, మేఘా ఆకాశ్ జంటగా హనురాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ పతాకంపై రామ్‌ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం లై (లవ్ ఇంటిలిజెంట్ ఎనిమిటీ). ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఆదివారం అమెరికాలో విడుదల చేశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని బాంబార్ట్ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. మణిశర్మ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు.
ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఏ టైటిల్ పెడతారనే ఆసక్తి ఎక్కువైంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. తాజాగా తెలుగు పరిశ్రమలో కొత్త టైటిళ్ల పరంపర మొదలైంది.
శ్రీకాంత్ కథానాయకుడుగా నాజియా కథానాయికగా విజి చెర్రీస్ విజన్స్ పతాకంపై విజయ్ రూపొందించిన చిత్రం రా..రా. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెలలోనే విడుదలకు సిద్ధవౌతోంది.
నవీన్‌చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్‌ది ఈస్ట్ ఫిలిమ్ కార్పొరేషన్ పతాకాలపై ధరమ్, రక్ష దర్శకత్వంలో కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బల సంయుక్తంగా రూపొందించిన చిత్రం చందమామ రావే. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ..
తెలుగులో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ సమంత వ్యవహారం జోరుమీదుంది. ఇప్పటికే రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రంగస్థలం-1985 చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత అక్టోబర్‌లో వివాహానికి సిద్ధమైంది. యువ నటుడు నాగచైతన్యతో ఇదివరకే నిశ్చితార్ధం జరుపుకున్న ఈమె అక్టోబర్‌లో పెళ్లిచేసుకోడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సినిమా రంగంలో తారలుగా వెలుగొందాలని చాలామంది కలలుగంటారు. కానీ అందరి కలలు సాకారం కావు. కొందరేమో ధ్రువతారలుగా వెలిగిపోతే మరికొందరు చీకట్లో మిగిలిపోతారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోయిన్ల కెరీర్‌గ్రాఫ్ చిన్నదే. హీరోలైతే 60-70 వచ్చాక కూడా స్టార్ హీరోలుగా సత్తా చాటుకుంటూ అటు ఫ్యాన్స్‌ను, ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. కానీ హీరోయిన్‌కు అలాంటి చాన్స్ లేదు. గ్లామర్ ఉన్నంతవరకే ఆమె హవా కొనసాగేది.
గ్లామర్ భామ హన్సిక కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదుంది. ఈమధ్యే మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అక్కడ కూడా మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం హన్సిక మూడు చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఓ చిత్రం కోసం ఆమె పేరు పరిశీలనలోకి వచ్చినపుడు నిర్మాతలు బాబోయ్ ఆమె అయితే వద్దని తేల్చేశారట. ఆ వివరాల్లోకి వెళితే, బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ఆ తరహా చిత్రాలకు క్రేజ్ పెరిగింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో గుండెకాయలాంటి దాసరి దూరమవ్వడం సినిమా పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన ఉంటే కార్మికులతోపాటు నటీనటులకు, దర్శక నిర్మాతలకు ఓ భరోసాగా నిలిచేవారు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో జరిగింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న 101 చిత్రం ‘పైసా వసూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత ఆయన నటించే 102వ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10 నుంచి షూటింగ్ మొదలుపెట్టారు.