S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/13/2016 - 21:52

తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ఓ మోస్తరు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల భామ లక్ష్మీరాయ్‌కి ‘కాంచన’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఆ సినిమా తరువాత చాలా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఎరోటిక్ మూవీగా సంచలనం సృష్టించిన ‘జూలి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జూలి-2’ రూపొందుతోంది.

02/13/2016 - 21:50

తెలుగు పరిశ్రమలో కమెడియన్‌గా పాపులరై హీరోగా మారి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటులు వున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి సునీల్ కూడా చేరిపోయాడు. కమెడియన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సునీల్, ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా తరువాత వచ్చిన ‘మర్యాద రామన్న’ చిత్రం అతనికి మంచి కమర్షియల్ హిట్‌ని అందించింది.

02/13/2016 - 21:48

నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై పరం వి.పొట్లూరి, కవిన్ అనె్న నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

02/13/2016 - 21:47

జయం రవి, లక్ష్మీమీనన్ జంటగా శక్తిసౌందర్‌రాజన్ దర్శకత్వంలో సినీకార్న్ బ్యానర్ పతాకంపై ముఖేష్ ఆర్.మెహతా నిర్మించిన ‘మిరుధన్’ అనే తమిళ చిత్రాన్ని ‘యమపాశం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత బాలకృష్ణ. ఇమాన్ సంగీతం అందించిన ఈ పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో నాని సీడీని ఆవిష్కరించారు.

02/13/2016 - 21:46

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాణి జంటగా సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో ఆదర్శ చిత్రాలయ పతాకంపై ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మించిన చిత్రం మలుపు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలకు సిద్ధమైన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ, మా పెద్దబ్బాయి సత్య టాలెంట్‌మీదున్న నమ్మకంతో ఈ సినిమాను నిర్మించానన్నారు.

02/13/2016 - 21:45

వయసు పెరుగుతున్నా ఇప్పటికీ హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న రమ్యకృష్ణకు ‘బాహుబలి’ సినిమాతో సంచలన విజయం దక్కింది. శివగామిగా ఆ పాత్రలో నటించి ఆకట్టుకున్న రమ్యకు ఇప్పుడు దక్షిణాదిలో అవకాశాల జోరు ఎక్కువైంది. ఇప్పటికే నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా హిట్ కూడా తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణకు ఇప్పుడు అవకాశాల జోరు పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలిసింది.

02/12/2016 - 21:03

నూతన తారలతో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

02/12/2016 - 21:01

యూత్‌లో మంచి ఫాలోయింగ్ వున్న నటుడు అల్లు అర్జున్. సినిమా సినిమాకూ తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇటీవలే సౌత్ ఇండియాలోని క్రేజీ హీరోగా ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమాలో మరో విశేషం వుంది.

02/12/2016 - 21:00

ప్రముఖ నటుడు వెంకటేష్ ఇటీవలే నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు ఆయన దృష్టి రీమేక్ సినిమాలపై పడింది. దృశ్యం సినిమా కూడా మలయాళ హిట్ ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్న వెంకటేష్, మరో రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

02/12/2016 - 21:00

‘నేనో పెద్ద అందగత్తెనని, నటనలో అన్ని అవార్డులు తీసుకోవడానికి వచ్చానని, సరైన పాత్రలు అంటే, నటించడానికి స్కోప్ వున్న పాత్రలు రావడంలేదని నేను అసలు అననే అనను’ అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్.

Pages