S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

06/12/2016 - 01:05

లలిత బంధువులింట రాత్రి జరిగే పెళ్లికి రామచంద్రపురం వచ్చింది. వివాహం అయ్యేసరికి తెల్లవారింది. తర్వాత కాలకృత్యాలు ముగించుకుని స్నానం చేసింది. కాఫీ ఫలహారాలు సేవించాక పెళ్లివారి వద్ద శెలవు తీసుకుని ఆటోలో తెలిసిన వారంటికి వెళ్లి అక్కడ ఒక గంట గడిపింది. తర్వాత ఆ ఇంటి కోడలికి చెప్పి నడిచి పాత బస్టాండ్‌కు వచ్చి బయలుదేరబోతున్న కాకినాడ బస్సెక్కింది.

06/12/2016 - 01:03

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి. మచ్చుకొక పద్యం.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన

06/12/2016 - 01:02

పుస్తకం కవి / రచయిత చిరునామా అని ఓ ప్రముఖ కవి కితాబు. నిజమే మరి తన రచనలు ఒక చోట నిక్షిప్తం చేసుకుని ముద్రించుకున్న పుస్తకం కవిని తెలిపే చిరునామా. అయితే దానికి ఓ నలుగురు కవులో, రచయితలో రుజువుపరిచే సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజానికి బాధ్యుడు కవి. సామాజిక స్పృహకు స్ఫూర్తికారకుడు కవి.

06/05/2016 - 07:03

మనం ఆశిస్తామే కానీ కోరుకున్న వాటిని ఇతరులకు వాటిని అందివ్వం... ఎందుకని ప్రశ్నించుకుంటే, కోరుకున్నవి ఎందుకు తీరటం లేదో ఎవరికి తీర్చడం లేదో అర్థమవుతుంది. వినిమయానికి మనమిచ్చే ప్రాధాన్యమే సద్వినియోగానికి ఇవ్వలేని కారణం. రోజువారీ వ్యవహారాలతో ప్రారంభించిన మన దినచర్య ముగిసేటప్పటికి ఏ అర్థరాత్రో అపరాత్రో అవుతుంది. ఎక్కడ మొదలుపెడతామో అక్కడికే వెళ్లి మరీ ముగిస్తున్నాం.

05/29/2016 - 23:40

‘‘డిఇఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన ఫైళ్లు తీసుకుని రమ్మన్నారు’’ అన్న అటెండర్ వర్తమానంతో కొంత కాలం క్రితమే ఆ ప్రైవేటు కానె్వంట్‌లో గుమస్తాగా చేరిన గుర్నాథం అనబడే నేను వినయంగా ప్రిన్సిపాల్ రూంలోకి ప్రవేశించాను.
నేను రూములోకి ప్రవేశించే సరికి మా ప్రిన్సిపాల్‌గారు ఫోనులో ఎవరితోనో మాట్లాడుతున్నారు.

05/22/2016 - 22:28

‘ఎంతసేపే ఆ కంప్యూటర్‌తో కబుర్లు? కాసేపు చేతిలో పనందుకోవడం ఏమైనా వుందా లేదా?’ హాల్లో నుండి తల్లి అరుపులు విని గబగబ స్విచ్ ఆఫ్‌చేసి ‘ఏంటమ్మా?’ అంటూ తల్లి దగ్గరకొచ్చింది అపర్ణ. ‘ఇదిగో ఆడపిల్ల అన్నాక కాస్త ఆ పని, ఈ పని అందుకోవాలి. చదువొక్కటేనా? ఇట్లా రా! ఈ బీరకాయలు కాస్త తరిగియ్యి. నాన్నగార్కి ఆఫీసు వేళ అవుతోంది. ఒక్కదాన్ని ఎన్ని పనులు చేయగలను చెప్పు?’

05/15/2016 - 05:27

కిరణ్ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో శ్రీమతి పరిమళకి ఫోన్ చేశాడు.
అయితే ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి ఉండడంతో ఏం చెయ్యాలో తోచలేదు. పక్కింటి వాళ్లకి తాళం చెవి ఇచ్చిందేమో అని వెళ్లాడు.
అతన్ని చూడగానే ‘‘కిరణ్ వచ్చావా? నువ్వు వస్తే తాళం ఇవ్వమని మీ ఆవిడ ఇచ్చి వెళ్లింది’’ అని పక్కింటి లక్ష్మమ్మ చెప్పింది.

05/08/2016 - 05:10

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.

05/01/2016 - 04:57

‘నాకు నీ వాలకం నచ్చటం లేదు’ కోపంగా అన్నాడు శ్రీరాజ్.
‘ఏం నేనేం తప్పు జేశాను’ ఏడుపు ముఖంలో అంది ఉషా సింగ్.
‘నీవు ఫోన్ మాట్లాడేటపుడు స్పీకర్‌లో పెట్టమన్నానా?!’ రౌద్రంగా ఉంది అతని ముఖం.

04/24/2016 - 06:20

అనంతపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక వెలుగు వెలిగిన నగరం!

Pages