S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

08/13/2017 - 00:53

‘ఏడాదికోసారి ఈ తద్దినం అంటూ ఢిల్లీ నుంచి

గుంటూరుకు నన్ను పిలవటమేంటి? మన

కన్నతల్లి కూడా కాదు. నాన్న మేనల్లుడి చేత

ఆ కార్యక్రమం జరిపించవచ్చు కదా!’ విసుగ్గా

అన్నాడు రవి.
తమ్ముడి వంక ఆశ్చర్యంగా చూశాడు

రఘురాం.
‘అమ్మ చనిపోయేనాటికి నీకు ఏడు, నాకు

పదేళ్లు. నానమ్మ నాన్నకి మళ్లీ పెళ్లి

చేద్దామనుకుంటుంటే వచ్చిన అమ్మాయి

08/13/2017 - 00:52

తెలుగు కథ వర్తమానంలో కొత్త పుంతలు

తొక్కింది. గతంలో ఎప్పుడో వచ్చే సాదాసీదా

కవుల్ని, వస్తువుల్నుంచి విడివడింది.

సమకాలీన నవ్యత, నాణ్యత, పఠనీయత

సంతరించుకున్న రచనలు వస్తున్నాయి. అవి

1980వ దశకం నుంచే ప్రారంభమయ్యాయి.

అలాగని మూలాల్లోకి వెళ్లి గురజాడ, శ్రీపాద,

చింతా, బలివాడల బాటలు వీడలేదు. పదిలం

గా వాటి మూలాలు, మాండలికాల నేపథ్యాలు,

08/13/2017 - 00:51

గుర్తుతెచ్చుకో నేస్తం
ఆనాటి తెల్లరంగు జెండా
అహింసా మార్గమైంది
సత్యవాక్కై నిలచింది
తెల్లవారిని బెదిరించింది
మూడు రంగుల సోయగమై
పరాయి వారి కళ్లు చెదిరేలా
రాట్నం తిప్పింది
ముచ్చెమటల్లో ముంచెత్తింది
అశోకుని ధర్మచక్రం అద్దుకొని
శత్రువుల భరతం పట్టింది
గగనవీధిలో గర్వంగా
రెపరెపలాడింది
ఈనాటి రంగురంగుల జెండాలు

08/07/2017 - 00:26

వరంగల్ జిల్లాలో ఓ ఊరు. రెండు వేల గడప. సుమారు 10 వేల జనాభా. 8 వేల ఓటర్లు. ఆ ఊళ్లో చక్కని వరి పొలాలు. సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి. పాఖల చెరువు నీరు పారకం. కమ్మ, రెడ్డి, కాపు, తెలగ, గౌడ, పద్మశాలీలు ఎక్కువగా ఉన్నారు. మరో పది కుటుంబాలు ముస్లింలు. ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో శివారు పల్లెలో దళితులు యాభై కుటుంబాల వారున్నారు. ఆ ఊరి పటేలు రమణారెడ్డి. ఆయనకు వంద ఎకరాల భూమి ఉంది. ఊరి బయట పెద్ద కొట్టం.

08/07/2017 - 00:24

‘ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వుందిరా’ అన్నాడు పరాశర్.
‘నీదగ్గరున్న మూడు గ్యాస్ సిలెండర్లలో ఒక్కటి ఒక్కవారం అడ్డం వేసుకుంటా ఇమ్మంటే పక్కవాడికి కూడా ఇవ్వవు. ఆడపిల్లకు ఆస్తి హక్కు అంటూ బావమరిది మీద దావా వేసి అరకోటి ఆస్తి నొక్కేశావు. అయినా బ్రాహ్మడు ఎన్నికల్లో నిలబడి నెగ్గలేడురా!’ అన్నాడు శర్మ.
‘మన భరద్వాజ్ గారు నెగ్గలేదా?’ ఉడుక్కున్నాడు పరాశర్.

08/07/2017 - 00:24

జాతీయ సాహిత్య పరిషత్తు 177వ గ్రంథంగా సామలేటి లింగమూర్తి పద్మశాలి గారు రచించిన ‘పాటల పల్లకి’ బాల గేయాల సంపుటిని వెలువరించారు. లోగడ ‘పంచరత్న మంగళారతులు’, ‘్భక్తమార్కండేయ నాటకం’, ‘అడవితల్లి’, ‘దేవి స్మరణామృతము’ ‘్భక్తజన భజనమాల’ తదితర గ్రంథాలను ప్రకటించిన లింగమూర్తి గారు ఇప్పుడు వెలువరిస్తున్న ‘పాటల పల్లకి’లో బాల గేయాలకు స్థానం కల్పించారు.

08/07/2017 - 00:23

గోపాలా! గోకులపాలా!
మా మొర వినవేలా!
పాపపుణ్యములెరుగని మూగజీవులం మేము
పవిత్రమైన చరిత కలిగిన వారము మేము
నీకత్యంత ప్రియమైన పశుజాతులం మేము
మా‘నవు’లు చేసే దుష్కృత్యాలు కనలేవా!
విధాత ఇచ్చిన గాలి, నీరు, గ్రాసము తింటూ
పరులకు ఏమాత్రము హానిచేయని
జంతువులం మేము
సాధుజీవులుగా బతికే మా కష్టాలు
తీర్చలేవా గోపాలా!

07/30/2017 - 02:25

‘పోతన గారు భాగవతంలో దేవుడి చేత అబద్ధం ఆడించలేదు. ఇందుకు వామనావతార కథా ఘట్టంలోని ఈ కింది పద్యమే నిదర్శనం:-
‘గొడుగో, జన్నిదమో, కమండలులొ, నాకున్ ముంజియో, దండమో
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్, వామాక్షులశ్వంబులె
క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ? మదాకాంక్షా మితంబైన మూఁ
డడుగుల్ మేరయె త్రోవకిచ్చుటది- బ్రహ్మాండంబు నాపాలికిన్’

07/30/2017 - 02:23

‘ఏమిటీ? అర్జంటుగా రాజీవ్ గాంధీ పార్క్‌కు రమ్మన్నావ్?’ అడిగింది సుమతి.

07/30/2017 - 02:23

మానవజాతి మనుగడకు వాల్మీకి మహర్షి అందించిన అపురూపమైన ఆదికావ్యం రామాయణం. లోకంలో దాదాపు అందరికీ ఈ కావ్యం పరిచయమే. అయితే, రామయణంలో నాయకుడు శ్రీరాముడైతే, అంతటి ప్రాధాన్యం గలవాడు ఆంజనేయుడు! రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలలో హనుమాన్ సంగతి కనిపించదు. మొదటిగా కిష్కంధకాండలో ప్రారంభమవుతుంది.

Pages