S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

10/17/2016 - 22:55

పాపం ఆ ఆడపిల్లకేం తెలుసు
బడికెళ్లి నాలుగక్షరాలు నేర్చుకోవాలనుకుంది
ఇంట్లో ఖాళీ కంచాన్ని చూసి
మధ్యాహ్న భోజనంతో
కడుపు నిండుతుందని ఆశపడింది
చింపిరి జుట్టు చినిగిన గౌనులో నుంచి
స్కూల్ డ్రస్ చూసుకుని మురిసిపోయింది
అక్షరాల నుంచి ఒక్కో మెట్టూ పైకెక్కి
చదువే ధ్యేయంగా శక్తి సాధనతో
ఆకాశం అంచుల దాకా ఎగరాలని
జీవితాన్ని సవాల్‌గా తీసుకుని

10/09/2016 - 07:10

ధర్మదాత ధర్మారావు తన తాతల నాటి బంగారం పండే వ్యవసాయ భూమిని తాత నివసిస్తున్న ఊళ్లోని మోతుబరి రైతుకు విక్రయించి ఆ డబ్బుతో కోనేటిపురం శివారులో అనాథలకు ఆశ్రయం కల్పించే సదాశయంతో ‘సదావర్తి సేవా శాంతి ఆశ్రమం’ ఏర్పాటు చేశారు. రాత్రిపూట పరాయి ఊరి వారికి నివాస సౌకర్యం కల్పిస్తున్నారు ధర్మారావు. నా అనేవారు ఎవరూ లేకపోవడం వల్ల ఆయనతో ఆశ్రమంలోనే ‘వారాలబ్బాయి’ వాసుదేవరావు కూడా ఉంటున్నాడు.

10/02/2016 - 05:10

కుంచం అంత కూతురుంటే.. మంచం మీదే కూడు! అనే సామెత ఇప్పుడు రామచంద్రుడు దంపతులకి వర్తించదు. దుర్గాంబకి మోకాళ్ళ ఆపరేషన్ చేయించారు. ఈ విషయం ముగ్గురు కూతుళ్ళకీ తెలియపర్చలేదు. కారణం వాళ్ళు రాకుంటేనే ఇల్లు ప్రశాంతం. బిపి పెరక్కుండా ఆరోగ్యంగా వుంటారా దంపతులు. ఒకసారి పెద్దమ్మాయి సెలవులకి పిల్లలతో వచ్చింది.

09/27/2016 - 21:34

నా తల్లి గురించి కవిత రాయాలట
రాస్తాను కవితేగా! కానీ..
ఎంత చిత్రమైన సందర్భం
తల్లి బతికుందని కొడుకు సాక్ష్యం చెప్పాలా?
నిన్నమొన్నటిదాకా అందలమెక్కిన నా తెలుగు
నేడు అంతరించే భాషల్లో వుందంటే
ఈ తప్పెవరిది?
చిత్తశుద్ధిలేని పాలకులదా,
పాశ్చాత్య పోకడలవైపు
పరుగులు తీస్తున్న ప్రజలదా?
వౌనం వహించి ప్రయోజనం లేదు

09/27/2016 - 21:30

గౌహతిలో జాబ్ చేస్తున్న గౌతమ్ తల్లి ఫోన్ చేసిన మర్నాడే విజయవాడకి బయలుదేరాడు.
‘నువ్వు కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి మన ఇంటికి వచ్చేసిందిరా. వెంటనే బయలుదేరిరా’ చెప్పిందామె. తమ ఇంట్లో అద్దెకి దిగిన వాళ్లను పలకరించింది దుర్గమ్మ.

09/27/2016 - 21:26

‘వద్దనరాదు భోజనము, వద్దనరాదు ఫలంబు, పుష్పముల్
వద్దనరాదు, మోహమున వద్దకు వచ్చిన కాంత కౌగిలిన్
వద్దనరాదు స్నేహితుని పల్కులు నీదు హితంబు గోరినన్
వద్దనరాదు భామవి సపర్యలు చల్లని సంధ్యవేళలన్!

09/18/2016 - 20:28

రమ, ఉమ, సీత ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కలిసి చదువుకున్నారు. టెన్త్ పూర్తికాగానే సీత బావ రఘురాంని పెళ్లి చేసుకుంది. మొదట ఇద్దరు కవలలు. రెండో పురిటికి ఒక పాప. ఇరవై నిండేసరికి ముగ్గురి పిల్లల తల్లయింది. కవల పిల్లల అల్లరికి ప్రతిచోటా ఇంటివారితో గొడవపడి ఇల్లు మారడం.. వాళ్ల సంగతి ఎస్‌ఎన్ పురంలో అందరికీ తెలిసి వాళ్లకి ఇల్లు ఇవ్వలేమనడం వరకూ వచ్చింది.

09/11/2016 - 07:59

‘అమ్మా! ఆనందం అంటే ఏమిటి?’ స్కూలు నుంచి వస్తూనే తల్లిని ప్రశ్నించాడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల సురేష్.
‘అదేమిటిరా? అలా అడుగుతున్నావూ?’ అన్నది తల్లి.
‘అది కాదమ్మా! నాన్న నిన్న నాకు సైకిలు కొన్నారుకదా! ఈరోజు నేను దాన్ని వేసుకుని స్కూలుకు వెళ్లాను. నువ్విచ్చిన చాక్లెట్లు మా ఫ్రెండ్సందరికీ ఇచ్చి ‘ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉన్నది. మా నాన్న సైకిలు కొనిపెట్టారుగా’.. అన్నాను.

09/03/2016 - 23:56

వందనాలు! వందనాలు!
వందనాలు! వందనాలు! గురులకూ!
అభివందన హరిచందనాలు గురులకూ!
మా గురులకూ! బుధవరులకూ!! వందనాలు!!
చిట్టి చిట్టి కథలెన్నో చెప్పీ
పొట్టి పొట్టి పాటలెన్నో నేర్పీ
చైతన్యాన్నందించే గురులకూ!
మా చీకటి తొలగించే దినకరులకూ! వందనాలు!!
బుజ్జి బుజ్జి బుద్ధులు మేల్కొలిపే
గుజ్జెనగూళ్లుగ సుద్దులు తెలిపే
బుజ్జగించు నేటి మేటి ఒజ్జలకూ

09/03/2016 - 23:47

పుటలు: 24, వెల: రూ.15
ప్రతులకు:
ఘంటా విజయకుమార్,
కాకతీయనగర్, రైతుపేట,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి : 9948460199
**

Pages