S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ

07/16/2017 - 01:19

పొలం పనులు జోరుగా సాగుతున్నాయి. రైతు

సిద్ధయ్య గట్టున కాలుమీద కాలు వేసుకొని

ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. జగదీష్ పని

జరిగేలా చూస్తున్నాడు. సిద్ధయ్య ‘ఒరేయ్ జగ్గా!

ఎంతసేపురా అక్కడ! రారా! నాకు ఇక్కడ చెనా

ఆకలిగా ఉండాది’ అన్నాడు. ‘పని చేస్తా ఉండ్లా

ఈడ నీకేమి కురిచీలో కూరుచుని సవాళ్ళు

పట్టిస్తా ఉంటావు. ఉండుమామా! ఫైవ్ మినిట్స్‌లో

07/16/2017 - 01:18

ఏరా.. బాగున్నావా?
ఎన్నాళ్లైంది ఈ పిలుపు విని
ఆ పిలుపులోని ఆప్యాయత
అనురాగం, ఆర్ధ్రత
ఎన్నాళ్లైంది వీటిని అనుభవించి
జౌను..
చదువు కోసమని, ఉద్యోగమని
కన్నతల్లిని, ఉన్న ఊరిని
అయినవారందరినీ విడిచి
ఆశగా పరుగెత్తాను
ఎండమావుల్లాంటి విదేశాల వైపు
కావాల్సినంత సంపాదించాను
ధగధగలాడే భవనాలు
కట్టుకున్నాను
అయినా.. ఏదో వెలితి

07/16/2017 - 01:17

కోపూరి పుష్పాదేవి రచయిత్రిగా, కవయిత్రిగా

తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర

వేసుకున్నారు. గృహిణిగా వుంటూనే నిత్యం

ఎంతో ఆసక్తిగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ

సాహితీ సేవ చేస్తున్నారు. అత్యంత సులభ శైలిలో

వెలువరించే ఈమె కవిత్వం, కథలు ఇప్పటికే

పాఠకుల మదిలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఇంతకుముందే ‘పుష్పరాగాలు’ (2006),

07/09/2017 - 00:54

సన్నగా పడుతున్న చినుకులు ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చటంతో ఏమిచేయాలో పాలుపోక బెల్లూ-బ్రేకులు, కనీసం స్టాండు కూడా లేని పాత సైకిల్‌ను కింద పడేసి ఓ చెట్టు కింద నిలబడ్డాడు ఆ కోయగూడేనికి కొత్తగా వచ్చిన రఘు మాస్టారు. వాన తెరిపివ్వటంతో సైకిల్ తీసుకొని ఊళ్లోకి వెళ్లాడు. ‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు’ ఆ ఊరి పటేలే పలకరింపుగా ‘కొత్తగా కనబడతావుండావే. ఎవరు నువ్వు?’ అని అడిగాడు. ‘నేను ఈ గూడెం పటేల్‌ని.

07/09/2017 - 00:53

తెలుగుజాతి వైభవాన్ని
తెలుగు భాష మాధుర్యాన్ని
తెలుగు పాట సోయగాన్ని
దశదిశలా చాటిన మేధోనిధి
విశ్వంభరతో జ్ఞానపీఠాన్నధివసించిన
పుంభావ సరస్వతి
నన్ను దోచుకొందువటే అంటూ
వలపు తలపులు చిలకరించినా
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని
శిలలలో మృదుభావాలు పలికించినా
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని
స్వేచ్ఛాగీతం ఆలపించినా

07/09/2017 - 00:52

సుందరం నా మిత్రబృందంలో ఒకడు. చాలారోజుల తర్వాత సుందరాన్ని చూడటానికి వెళ్లాను. ఇప్పుడది ఇల్లుకాదు, విల్లా! అందమైన షోకేసులు, వాటిలో సుందరం, వాడి శ్రీమతి ఫొటోలు, కొడుకు వారిని హత్తుకొని ఉన్న భంగిమలు! వాడు కవి కావటం వల్ల ఎన్నో జ్ఞాపికలు, సన్మాన పత్రాలు కూడా అలంకరించి ఉన్నాయి. ‘ఈరోజుల్లోనూ అంత అనురాగం చూ పే పుత్రరత్నాలు ఉన్నారా?’ అని మనసులోనే అనుకున్నా. సంతోషించాను.

07/09/2017 - 00:51

కవి జాని తక్కెడశిల మనసులో తనెలా అనుకుంటే అలా పదాల అమరికతో కవితలల్లారనే చెప్పాలి. ఎందుకంటే ఏభై ఒక్క కవితల కదంబమాల అంటే రంగు రంగుల పుష్పాల మాలనే కదంబ మాటల అంటారు. అలాగే రకరకాల కవితా వస్తువులతో అల్లిన కదంబ కవితా సంపుటి ఈ అఖిలాశ. ‘పెళ్లికూతురు’ కవితలో పెళ్లి వేడుకను కళ్లకు కట్టారు. ‘మాంగల్యం’ కవితలో పవిత్రత గురించి చెప్పారు.

07/03/2017 - 00:46

ఆదివారం ఉదయం 10 గంటలు. అమలాపురం అమ్మాయికి, అమెరికా అబ్బాయికి పెళ్లి. స్మార్ట్ ఫోన్, వాట్సాప్‌లో అందరికీ ఆహ్వానం. సుధీంద్ర పురోహితుల వారు జానెడు జరీ అంచు పంచె కట్టి, ఎర్ర శాలువా కప్పుకొని, ఐదు వేళ్లకి ఐదు ఉంగరాలు, మెడలో పులిగోరు చైన్ వేసుకొని, ఇన్నోవా కారులో కూర్చొని, ట్యాబంత అమెరికా సెల్‌ఫోన్‌లో నెట్ ఓపెన్ చేసి వివాహ వేడుక ఆహ్వానం సుమూహూర్తం సమయానికి అందరికీ మెసేజ్‌లు పెట్టారు.

07/03/2017 - 00:45

నా బాల్యంలో మా పల్లెలో
కల్మష రహిత రైతన్నల ఇళ్లలో
నా శ్రవణపు లోగిళ్లలో సందడి చేసిన
ఓ అందమైన పదరాజం.. ‘పాతర’!
ధాన్యపు రాసులతో నిండిపోయి
కళకళలాడుతుండేది పాతర
దాని వీక్షణలో నాడెందమానంద
డోలికల్లో విహరించేది
నేడుకూడా నా శ్రవణ శక్తికి
పరీక్షగా వినిపిస్తోంది పాతర!
ఉన్మాదుల వికృత చేష్టలతో
నైతిక విలువల పాతర..
కులాల కార్పణ్యాలతో

07/03/2017 - 00:43

‘ఈ శతాబ్ది నాది’- అని మహాకవి చెప్పుకున్నాడంటారు ఘనత వహించిన కొందరు వీర కమ్యూనిస్టులు. ఈ శతాబ్దంలో నాకూ భాగముందని బుచ్చిబాబు భావిస్తాడని నేనంటాను. విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. నాకెప్పుడూ ప్రభుత్వ విధానాల మీద, దాని తెలుగు భాషాభిమానం మీద నమ్మకం లేదు.

Pages