S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/17/2018 - 02:08

న్యూఢిల్లీ, జూలై 16: భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎవరినైనా నియమించడానికి ముందు చాలా కసరత్తు జరుగుతుంది. సామర్థ్యం, సీనియారిటీ వంటి అనేకాకనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కానీ, ఒకప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సేవలు అందించిన అజిత్ నాథ్ రేకు అప్పటి సర్కారు ఎక్కువ సమయం ఇవ్వలేదు. రెండు గంటల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

07/17/2018 - 02:06

న్యూఢిల్లీ, జూలై 16: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో దాడులు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై ఫిర్యాదు చేశారు.

07/17/2018 - 02:05

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వలని పార్లమెంట్‌లో ప్రతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల నాయకులకు ఆ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం వామపక్ష పార్టీల నాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు తోట నరసింహం, రవీంద్రబాబు కలిశారు.

07/17/2018 - 02:03

న్యూఢిల్లీ, జూలై 16: మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు త్వరితగతిన విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు చలనచిత పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగంపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

07/17/2018 - 05:05

బాలసోర్, న్యూఢిల్లీ, జూలై 16: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్‌ను సోమవారం ఒడిసాలోని బాలసోర్ కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించారు. క్షిపణి జీవితకాలం పొడిగింపునకు తోడ్పడే సాంకేతికతను పరీక్షించే ధ్యేయంతో చేపట్టిన ఈప్రయోగ పరీక్షను మొబైల్ అటానమస్ లాంచర్ ద్వారా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ ద్వారా 290 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించవచ్చు.

07/17/2018 - 05:06

న్యూఢిల్లీ, జూలై 16: తెలంగాణలో ఒంటరిగా పోరాటం, ఆంధ్రలో భావసారూప్యత గల పార్టీతో పొత్తు లేదా సీట్ల సర్దుబాటు చేసుకోవటం ద్వారా వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ, శాసన సభల ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించిన ఆ పార్టీ అధినాయకత్వం తమ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది.

07/17/2018 - 01:20

న్యూఢిల్లీ, జూలై 16: వాతావరణ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఇపుడు ముఖ్యం కాదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వాతావరణ కాలుష్యం కారణంగా ఇటీవల కాలంలో దాదాపు 60వేల మంది ప్రజలు మరణించారని, ఇది చాలా విచారించదగ్గ అంశమని పేర్కొంది.

07/17/2018 - 05:09

మిద్నాపూర్, జూలై 16: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడిక్కడ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతునొక్కేస్తోందని, సిండికేట్ రాజ్యమే నడుస్తోందని ధ్వజమెత్తారు. ఈ సిండికేట్ ఆమోదం లేకుండా ఏదీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ఇక్కడ జరిగిన కిసాన్ ర్యాలీలో అన్నారు.

07/17/2018 - 05:10

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంటు సమావేశాలకు అడ్డుపడే ప్రసక్తే లేదు.. ఉభయ సభలు ప్రశాంతంగా కొనసాగాలనే ఏకాభిప్రాయాన్ని అన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేశాయి.

07/17/2018 - 00:54

న్యూఢిల్లీ, జూలై 16: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బేషరతు మద్దతు ప్రకటించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇరకాటంలో పడవేశారు. మహిళల సాధికారితకోసం పోరాడుతున్నానని చెప్పుకునే నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదం సంపాదిస్తారా? తమ పార్టీ ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తోంది అంటూ రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు.

Pages