S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/17/2018 - 20:06

చెన్నై: సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన సంఘటన ఇది. చెన్నైలోని పురుసవాక్కుమ్‌లో 300 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ఓ బాలికకు చెవుడు ఉంది. ఎలివేటర్‌గా పనిచేసే 66 ఏళ్ల రవికుమార్ అనే వ్యక్తి ఈ బాలికను లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత మరో ఇద్దరు తాగుబోతులు ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

07/18/2018 - 05:27

జార్ఖండ్: ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ పై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు పాకుర్ లో దాడికి పాల్పడ్డారు. ఓ కార్యక్రమానికి హాజరవడానికి అగ్నివేష్ వచ్చారు. హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా జైశ్రీరాం అంటూ ఆయనపై దాడి చేశారు. స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరానని తెలిపారు. దాడికి సంబంధించి 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07/17/2018 - 16:41

చెన్నై: అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ వద్ద నుంచి భారీ ఎత్తున సొమ్మును అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయంలో ఎమ్‌ఎస్ ఎస్‌పీకే అండ్ కంపెనీ ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే ఈ కంపెనీపై అనేక ఆవినీతి ఆరోపణలు రావటంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, భవనాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించటం జరిగింది.

07/17/2018 - 13:16

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను కేటీఆర్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మగ్గాల ఆధునీకరణకు నిధులు, రాష్ట్రానికి కొత్తగా కస్టర్లు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

07/17/2018 - 13:15

ముంబయి: కొంత కాలంగా కిడ్నీ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న న‌టి రీటా భాదురి(62) సోమ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా ఆమె డ‌యాల‌సిస్‌పైనే ఆధార‌ప‌డి ఉన్నారు. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు.

07/17/2018 - 20:04

న్యూఢిల్లీ: గోవుల సంరక్షణ పేరుతో కొందరు కార్యకర్తలు గుంపులుగా వ్యక్తులపై దాడిచేయటాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిపై చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక కార్యకర్త తెహసీన్ పునావాలా, మహాత్మాగాంధీ మనుమడు తుషార్‌గాంధీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

07/17/2018 - 12:36

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులపై దాడికి పాల్పడేందుకు లష్కరే తోయిబా భారీ కుట్రకు వ్యహారచన చేసిందని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్రంలో భద్రతాచర్యలను కట్టుదిట్టం చేశారు. బుఖారీ హత్యకేసులో నిందితులైన నవీద్ జట్, ఆజాద్ అహ్మద్ మాలిక్ ఇద్దరూ కూడా కలిసే ఉన్నారని ఇంటలిజెన్స్ అధికారులు వెల్లడించారు.

07/17/2018 - 12:34

ముంబయి: ముంబయిలో జలశయాలన్నీ నిండుకుండలా ప్రవస్తున్నాయి. దాదాపు అన్ని సరస్సులలో కూడా నీటితో నిండుగా ఉన్నాయి. ఈ ఏడాది మంచినీటికి కొరత ఉండదని అంటున్నారు. మొదక్, సాగర్, తులసి, విహార్, తాన్సా, అప్సర వైతరణి, మిడిల్ వైతరణ, భాట్సా సరస్సులు నీటితో కళకళలాడుతున్నాయి.

07/17/2018 - 12:28

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు రూ.8కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రెవిన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ వెల్లడించారు. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలెక్టర్లను ఆదేశించారు.

07/17/2018 - 05:33

న్యూఢిల్లీ: తాను మద్దతు ఇస్తున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏడిపించడం, కూలగొట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, ఇప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కూడా ఆ పార్టీ తన చర్యలతో ముప్పుతిప్పలు పెడుతోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ సహకారంతో అదికారం చేపట్టిన చరణ్‌సింగ్, చంద్రశేఖర్, హెడి దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌లను కూడా కాంగ్రెస్ ఇలాగే చేసిందని ఆయన అన్నారు.

Pages