S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2018 - 02:23

న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ ముస్లింల పార్టీ అవునా కాదా అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎందుకు స్పష్టం చేయటం లేదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవి అంటేనే ఇష్టం తప్ప ప్రజలు కాదని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌ను ముస్లింల పార్టీగా మార్చివేశారని సంబిత్ పాత్రా దుయ్యబట్టారు.

07/18/2018 - 02:22

న్యూఢిల్లీ, జూలై 17: స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచినట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సెక్షన్ 377పై నాలుగు రోజుల పాటు వాదనలను కోర్టు విచారించింది. ఈ నెల 10వ తేదీన సెక్షన్ 377పై కోర్టు విచారణను ప్రారంభించింది.

07/18/2018 - 05:38

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీ బుట్టా రేణుకను ఆహ్యానించడంపై ఎంపీ విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ ఆవరణలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరపున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

07/18/2018 - 00:47

న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో గోసంరక్షణ పేరుతో కొన్ని అల్లరిమూకలు జరిపే హత్యలు, హింసాత్మక సంఘటనలు అరికట్టడానికి పార్లమెంట్ కొత్త చట్టాన్ని చేయాలని, అల్లరిమూకలు ఇక ఏమాత్రం ఆగడాలకు పాల్పడకుండా ఇది ఉండాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

07/18/2018 - 05:19

న్యూఢిల్లీ, జూలై 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ప్రతిపాదనకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమోదం తెలిపాయని కాంగ్రెస్ వెల్లడించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తాం..

07/19/2018 - 18:41

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంటు శీతాకాల సమావేశాలను సజావుగా సాగేటట్లు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ప్రజల సమస్యలను అర్థవంతంగా జరిగే విధంగా నడుచుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు 18వ తేదీ బుధవారం నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి.

07/18/2018 - 04:57

న్యూఢిల్లీ, జూలై 17: తెలంగాణ వ్యాప్తంగా చేనేత కార్మికులను అదుకొనేందుకు 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంత్రి కేటీఆర్ కేంద్ర జౌళి శాఖమంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు గురించి మంత్రి స్మృతి ఇరానీతో చర్చించినట్టు ఆయన తెలిపారు.

07/18/2018 - 04:58

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు పట్టిన గతే వర్షాకాల సమావేశాలకూ పడుతుందా? ప్రతిపక్షం గొడవకు దిగితే ఈ సమావేశాలు కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ ఈ సమావేశాల్లోనూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్ధమవుతోంది. ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగనున్నాయి.

07/18/2018 - 00:20

న్యూఢిల్లీ, జూలై 17: తెలంగాణ హక్కుల సాధనకు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగుతుందని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీఆర్‌ఎస్ తరపున జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని అన్ని పార్టీలను కోరినట్టు చెప్పారు.

07/17/2018 - 16:44

లక్నో: రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కాలేడని, ఎందుకంటే ఆయన తల్లి సోనియా విదేశీయురాలని, కాబట్టి బీఎస్పీ అధినేత్రి మాయావతికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ సమన్వయ కర్త జయప్రకాష్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ పార్టీ అధినేత్రి మాయవతి అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జైప్రకాష్ సింగ్‌ను పార్టీ పదవి నుంచి తొలగించారు.

Pages