S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/02/2018 - 02:07

ఢిల్లీ: దేశ రాజధానిలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని ఒక ఇంట్లో 11 మంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుదిపేసింది. వీరిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరణించిన ఏడుగురు మహిళల్లో నలుగురు బాలికలు ఉన్నారు.

07/02/2018 - 02:08

పౌరి (ఉత్తరాఖండ్): ‘దేవ భూమి’ ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా 48 మందిని పొట్టనపెట్టుకుంది. 11 మంది ప్రయాణికులు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి సంక్లిష్టంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పౌరి గర్వాల్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నారు.

07/01/2018 - 05:30

హైదరాబాద్, జూన్ 30: మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరావుతో శనివారం రాత్రి జరపాల్సిన భేటీ రద్దయింది. సాంకేతిక కారణాలతోనే దేవెగౌడ హైదరాబాద్ చేరుకోవడం ఆలస్యమైందని ఒక వర్గం చెబుతుండగా, రాజకీయ అజెండాపై స్పష్టత లేకనే సీఎం కేసీఆర్‌తో భేటీ రద్దయిందని, ఇందుకు రాజకీయాలే కారణమని మరో వర్గం చెబుతోంది.

07/01/2018 - 05:20

న్యూఢిల్లీ చాణక్యపురిలోని మధ్యప్రదేశ్ హౌస్‌లో ఏడేళ్ళ బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ప్రదర్శనను నిర్వహిస్తున్న ఎఐఎంఎస్‌ఎస్, ఎఐడీఎస్‌ఓ, ఎఐడీవైఓ సభ్యులు

07/01/2018 - 05:15

ఇండోర్, జూన్ 30: మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలికను పాఠశాల నుంచి కిడ్నాప్ చేసి కాముకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దారుణం, దుర్మార్గం అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సత్వర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

07/01/2018 - 05:11

శ్రీనగర్, జూన్ 30: కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సంఘటన ప్రదేశం నుంచి ఇంతవరకు ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ ఘటనలో హతమయ్యారని భావించిన మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని ఉంటారని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. హతుడైన ఉగ్రవాదా లష్కర్ తోయిబాకు చెందిన సజాద్ అహ్మద్ షా అని పోలీసులు గుర్తించారు.

07/01/2018 - 05:10

న్యూఢిల్లీ, జూన్ 30: హవాలా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణపై ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించి ఫైనాన్షియల్ ఏక్షన్ టాస్క్ఫోర్సు (ఎఫ్‌ఎటీఎఫ్) పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో పెట్టడాన్ని భారత్ స్వాగతించింది.

07/01/2018 - 05:09

న్యూ ఢిల్లీ, జూన్ 30: నరేంద్రమోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు గందరగోళంగా తయారయ్యాయని, స్థూల జాతీయోత్పత్తి రేటు 6.7 శాతం వద్ద ఊగిసలాడుతోందని , అంకెల గారడీకి ప్రభుత్వం పాల్పడుతోందని కేంద్రమాజీ మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. బ్యాంకింగ్ వ్యవస్థ దివాళా తీసిందని, నిరర్థక ఆస్తుల విలువ రూ.2,63,015 కోట్ల నుంచి రూ.10,30,000 కోట్లకు పెరిగిందని ఆయన అన్నారు.

07/01/2018 - 05:01

సంగీతానికి పక్షుల కిలకిలా రావాలకి లోతైన సంబంధమే ఉంది. అందుకేనేమో.. ఓ గిటార్‌పై పక్షులన్నీ కొలుదీరాయ. కళాకారుడి కళాత్మకతకు ఆకాశమే హద్దు. ఎలాంటి దృశ్యాన్నైనా కళ్ళకు కట్టగలిగే విస్తృత పరిశీలనా శక్తి అతడికి ఉంటుంది. అలాంటిదే మరో దృశ్యం రెండవది.
ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కళా ప్రదర్శనలో ఈ రెండు దృశ్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయ.

07/01/2018 - 04:58

న్యూఢిల్లీ, జూన్ 30: దౌత్యవేత్తలు, రాయబారులు ప్రభుత్వానికి కాకుండా, దేశంలోని 1.3 బిలియన్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని భారత రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఎక్కడికెళ్లినా మాతృభూమి గొప్పతనాన్ని మరవకుండా భారత్ విశిష్టతను ప్రచారం చేయాలన్నారు. దౌత్య రంగంలో నైపుణ్యం సాధించేందుకు దౌత్యవేత్తలు కృషి చేయాలని కోరారు.

Pages