S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/02/2018 - 13:34

న్యూఢిల్లీ: ఆఫ్గాన్ ప్రభ్వుత్వానికి అండంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆఫ్గానిస్ధాన్‌లోని జలాలాబాద్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. జలాలాబాద్‌లో తాలిబన్ ఉగ్రవాదులు ఆదివారంనాడు హిందువులు, సిక్కులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడిలో 19మంది మృతిచెందగా, 20మందికి పైగా గాయపడ్డారు.

07/02/2018 - 03:21

న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలులో మార్పులు తేవాలని, ప్రత్యేకించి సింగిల్ శ్లాబ్ విధానాన్ని పాటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

07/02/2018 - 02:57

శ్రీనగర్, జూలై 1: అమర్‌నాథ్ యాత్రలో వలంటీర్‌గా ఉన్న ఒక వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సేవాదార్ (వాలంటీర్)గా వ్యవహరిస్తున్న గుజరాత్‌కు చెందిన బానోభాయ్ గదియా (62) పహల్గాం ప్రాంతంలోని నున్‌వాన్ బేస్ కాంప్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఏడాది జూన్ 28న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఇది రెండో మృతి.

07/02/2018 - 02:55

భువనేశ్వర్, జూలై 1: వచ్చే ఏడాది జరగనున్న ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఒడిశా అసెంబ్లీలో 147 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కనీసం 120 సీట్లలో విజయం సాధించాలని బీజేపి అగ్రనాయకత్వం పట్టుదలతో ఉంది.

07/02/2018 - 02:52

కోల్‌కతాలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ పంచాయత్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ నుంచి జ్ఞాపికను అందుకుంటున్న ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ అమలా శంకర్. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను సత్కరించారు. ఆమె కుమార్తె, ప్రఖ్యాత నృత్యకారిణి, నటి మమతా శంకర్ కూడా ఉన్నారు.

07/02/2018 - 02:42

జమ్మూ, జూలై 1: వరదల్లో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించడంలో నిర్లక్ష్యంగా గురించి తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టించిన ఒక అధికారి జీతంలో కోత విధించడమే కాకుండా, అతడిని అటాచ్ చేస్తున్నట్టు పూంచ్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ అజాజ్ అసద్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఊరు వదిలి వెళ్లరాదని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

07/02/2018 - 02:23

న్యూఢిల్లీ, జూలై 1: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేసి, అదే స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిటీ ఆఫ్ ఇండియా (హెచ్‌ఐసీఐ)ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాపరమైన అంశాల్లో రాజకీయాలు తగవని స్పష్టం చేస్తున్నారు.

07/02/2018 - 02:29

బెంగళూరు: ఇదేమీ సినిమా కథ కాదు. నిజంగా జరిగింది. కలికాలంలో కూడా జీవితాంతం సంపాదించిన ఆస్తులను సమాజ హితానికి ఔదర్యంతో, దానం చేసిన వితరణ శీలి వాస్తవ సంఘటన ఇది. బెంగళూరులో ఒక ఐశ్వర్యవంతుడు వంద కోట్ల రూపాయలను రోటరీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు.

07/02/2018 - 02:18

న్యూఢిల్లీ, జూలై 1: పురావస్తు ప్రాధాన్యత కలిగిన ఐదు హెరిటేజ్ ప్రదేశాల పరిరక్షణకు ఆర్కియాలజీ శాఖ వినూత్న స్కీంను ఆవిష్కరించింది. ఈ స్కీం కింద ఎంపిక చేసిన హెరిటేజ్ ప్రదేశాలకు ‘స్మారక (మాన్యుమెంట్) స్థలాల మిత్ర’ కమిటీలను నియమించాలని ఆర్కియాలజీ శాఖ నిర్ణయించింది. పురావస్తుప్రాంతాలను దత్తత తీసుకోండి అనే లక్ష్యంతో ఈ స్కీంకు రూపకల్పన చేశారు.

07/02/2018 - 02:17

న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని మాతృ భాషలున్నాయో తెలుసా? జనాభా గణాంకాల విశే్లషణ ప్రకారం 121 కోట్ల జనాభా గల మన దేశంలో కనీసం పదివేల మంది మాట్లాడే భాషల సంఖ్య 121 అని ఈ విశే్లషణలో తేలింది. దేశంలో మొత్తమీద సుమారు 19,500లకు పైగా భాషలను, మాండలికాలను తమ మాతృభాషలుగా కోట్లాదిమంది భావిస్తున్నారు. మాట్లాడుతున్నారు. 2011 జనాభా లెక్కల సమయంలో మొదటిసారిగా మాతృభాషను కూడా చేర్చారు.

Pages