S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2017 - 01:51

న్యూఢిల్లీ, జూలై 8: విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల విడాకుల కేసుల్లో వారి పిల్లలు తీవ్రవత్తిళ్లకు గురవుతున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ పేర్కొన్నారు. భార్యాభర్తల్లో ఒకరు వేరే దేశంలో నివాసముంటే వారి మధ్య తలెత్తిన వివాదాలు విడాకుల వరకు వెళ్తే వారి పిల్లల సంరక్షణ ఎవరి బాధ్యతో నిర్ణయించడం చాలా క్లిష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు.

07/09/2017 - 01:49

న్యూఢిల్లీ, జూలై 8: జమ్మూ-కాశ్మీరులోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఒక మోస్తరు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 పాయింట్లుగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాలకు భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపన సంభవించిందని భారత వాతావరణ విభాగంలోని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.

07/09/2017 - 01:15

న్యూఢిల్లీ, జూలై 8: భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో సహకారాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శనివారం ఆయన ఈ విషయమై బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు.

07/09/2017 - 01:33

జమ్మూ, జూలై 8: పాక్ సైన్యం మరోసారి సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో అధీన రేఖ వెంబడి ఉండే సైనిక శిబిరాలు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, అతని భార్య మృతి చెందగా, వారి ముగ్గురు కుమార్తెలు గాయపడ్డారు.

07/08/2017 - 02:14

న్యూఢిల్లీ/పాట్నా, జూలై 7: తనపై దాఖలైన అవినీతి ఆరోపణలను అర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ కొట్టిపారేశారు. బిజెపి పన్నిన కుట్రలో భాగంగానే సిబిఐ తనపై ఆరోపణలు దాఖలు చేసిందని అన్నారు. ఈ రకమైన కుట్రలకు తాను, తన పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేశారు. ఇదంతా బిజెపి కుట్రతో జరిగిన దాడేనని పేర్కొన్నారు.

07/08/2017 - 02:07

హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ మృతిచెంది ఏడాది పూర్తయన సందర్భంగా శుక్రవారం శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ముఖ్య కూడళ్లలో పహరా కాస్తున్న సైనిక బలగాలు.

07/08/2017 - 02:05

న్యూఢిల్లీ, జూలై 7: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరాశ్రయులైన వితంతువుల జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నామని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వారి కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్‌లో పరిస్థితులు దారుణంగా ఉండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత కేంద్రం ఈ విషయం కోర్టుకు తెలియజేసింది.

07/08/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 7: గంగా, యమున నదులను జీవ నదులుగా పేర్కొంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. రెండు నదులకు మానవులతో సమానంగా జీవించే హక్కులు కల్పిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దేశంలోనే పెద్ద నదులైన గంగా, యమునలు కలుషితం కావడంపై ఆందోళన చెందిన ఉత్తరాఖండ్ హైకోర్టు ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. మనుషులతో పాటు వాటికీ జీవం ఉందంటూ జీవ నదులుగా ప్రకటించింది.

07/08/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 7: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై జరిగిన సిబిఐ దాడుల వెనుక ఎన్‌డిఏ ప్రభుత్వ ప్రమేయం ఎంతమాత్రం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చట్టప్రకారమే సిబిఐ ఈ చర్యలు తీసుకుందని, దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించడం అర్థరహితమని ఆయన అన్నారు.

07/08/2017 - 02:03

న్యూఢిల్లీ, జూలై 7: బాలలపై సాగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా అన్ని మతాలకు చెందిన నేతలతో నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరంపాటు సాగనున్న ఈ కార్యక్రమంలో బాలలపై సాగుతున్న లైంగిక దాడులు, అక్రమ రవాణాపై విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. దీనికి దేశంలోని అన్ని మతాల పెద్దలు, నేతలు కలిసి రావాలని కైలాష్ సత్యార్థి కోరారు.

Pages