S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/08/2017 - 02:02

ఉమియామ్ (మేఘాలయ), జూలై 7: దేశంలో ఎవరికైనా రాజ్యాంగమే సర్వోన్నతమైనదని రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. కుల, మత, ప్రాంతీయత ఆధారంగా ఎవరి పట్లా వివక్ష చూపబోనని ఆయన హామీ ఇచ్చారు.

07/08/2017 - 02:01

చెన్నై, జూలై 7: దశాబ్దాలుగా భారతీయులు ఆలపిస్తున్న జాతీయ గీతం వందేమాతరంపై మద్రాసు హైకోర్టు ఆసక్తికరమైన సందేహాన్ని వ్యక్తం చేసింది. బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గీతాన్ని మొదట బెంగాలీలో రాశారా లేక సంస్కృత భాషలో రాశారా అనేది హైకోర్టుకు తలెత్తిన సందేహం. దీనికి సరయిన సమాధానం తెలుసుకోవడంలో సహకరించాలంటూ అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌వి మురళీధరన్ కోరారు.

07/08/2017 - 01:43

న్యూఢిల్లీ, జూలై 7: ఉమ్మడి ఏపీ కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు 26 విస్తృత అంశాల అధారంగా విచారణ కొనసాగించేందుకు కృష్ణా ట్రిబ్యునల్ నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదించిన అంశాలపై ట్రిబ్యునల్‌లో శుక్రవారం నాడు వాదనలు ముగిసాయి. జస్టిస్ బ్రీజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ తదుపరి విచారణను సెప్టెంబరు 13వ తేదీకి వాయిదా వేసింది.

07/08/2017 - 01:41

న్యూఢిల్లీ,జూలై 7: వంశధార నదీ జలాల వివాద ట్రిబ్యునల్‌లో ఆంధ్రా వాదనలు పూర్తియ్యాయి.

07/08/2017 - 01:20

న్యూఢిల్లీ, జూలై 7: ఆఠ్‌జెడి అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసు నమోదు చేసిన సిబిఐ శుక్రవారం పాట్నా సహా 12 చోట్ల దాడులు జరిపింది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ దాడులు పాట్నా, రాంచి, భువనేశ్వర్ సహా 12 ప్రాంతాల్లో జరిగినట్లు సిబిఐ అదనపు డైరెక్టర్ రాకేష్ ఆస్తానా ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు.

07/08/2017 - 01:15

న్యూఢిల్లీ, జూలై 7: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చినందున దానికి అనుగుణంగా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సరుకులపై కొత్త రేట్లను ముద్రించని ఉత్పత్తిదారులకు లక్ష రూపాయల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ హెచ్చరించారు.

07/08/2017 - 01:11

న్యూఢిల్లీ, జూలై 7: జెఇఇ (అడ్వాన్స్‌డ్) ప్రవేశ పరీక్షల ద్వారా ఐఐటిల్లో తదుపరి కౌన్సిలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. జెఇఇ-ఐఐటి (అడ్వాన్స్‌డ్) లపై హైకోర్టుల్లో దాఖలయ్యే ఏ పిటిషన్లనూ పరిగణనలోకి తీసుకోవద్దని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

07/08/2017 - 01:07

న్యూఢిల్లీ,జూలై 7: ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం జర్మనీ ఓడరేవు పట్టణం హాంబర్గ్‌లో జి- 20 సమావేశాల సందర్భంగా పరస్పరం పలకరించుకోవటంతోపాటు ఆ తరువాత పలు అంశాలపై ముఖాముఖి చర్చలు జరపటంతో గత మూడు వారాలుగా సిక్కిం సెక్టార్‌లో రెండుదేశాల సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు తెర పడే అవకాశాలు కొంత మెరుగయ్యాయి.

07/07/2017 - 02:26

న్యూఢిల్లీ, జూలై 6: రాజ్యాంగబద్ధతతో కూడిన జాతీయ బి.సి కమిషన్ ఏర్పాటుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఆమోదం తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

07/07/2017 - 02:04

న్యూఢిల్లీ, జూలై 6: రాజకీయ పార్టీలు విరాళాల పేరుతో సేకరించిన దానికంటే ప్రచారానికి చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల సమయంలో ప్రచారార్భాటాలకు జాతీయ పార్టీలనుంచి ప్రాంతీయ పార్టీల వరకు ఇదే తంతు. అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది.

Pages