S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/11/2017 - 02:58

న్యూఢిల్లీ, జూలై 10: పాకిస్తాన్ కస్టడీలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ తల్లికి మెడికల్ వీసా మంజూరు చేయకపోవడంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నావీ ఉద్యోగి జాధవ్ పాక్ ప్రభుత్వం కస్టడీలో ఉన్నారు. కుమారుడిని కలవాలని అతడి తల్లి అవంతిక జాధవ్ వీసాకోసం దరఖాస్తు చేసుకున్నారు.

07/11/2017 - 02:32

రేణిగుంట, జూలై 10: తిరుపతి నుంచి పూరికి వెళ్లే పూరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ లీకవ్వడంతో అత్యవసర చైన్‌లాగి రైలును ఆపి ప్రయాణికులు పరుగులు తీసిన సంఘటన సోమవారం ఉదయం రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రెండోనెంబర్ ప్లాట్‌ఫాం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే తిరుపతి నుంచి పూరికి బయలుదేరిన పూరి ఎక్స్‌ప్రెస్ రైలు రేణిగుంట రైల్వేస్టేషన్‌నుంచి బయల్దేరింది.

07/11/2017 - 02:08

శ్రీనగర్, జూలై 10: జమ్ము కాశ్మీర్ పోలీసులు సోమవారం లష్కర్ ఏ తోయిబాకు చెందిన అత్యంత కీలకమైన ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు ఉత్తరప్రదేశ్ వాసితోసహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ‘వివిధ సంచలనాలు సృష్టించిన ఉగ్రవాద నేరాల్లో కీలకపాత్ర పోషించిన ముష్కరుడిని అరెస్ట్ చేశాం. దక్షిణ కాశ్మీర్‌లో పలు నేరాలకు ఇతడు పాల్పడ్డాడు.

07/11/2017 - 01:39

న్యూఢిల్లీ, జూలై 10: వివిధ పథకాలకు ఇచ్చే సబ్సిడీలను నగదు బదిలీ పథకం కింద నేరుగా వినియోగదారుల ఖాతాలకు వేయటం ద్వారా కేంద్రానికి దాదాపు రూ.57వేల కోట్ల రూపాయల మేర ఆదా అయిందని కేంద్ర ప్రభుత్వ డాటాలో వెల్లడైంది. 2013 జనవరి 1న అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

07/11/2017 - 01:35

విశాఖపట్నం, జూలై 10: భారత్, యుఎస్, జపాన్ దేశాల మధ్య నౌకాదళ సంబంధాలు మరింత పటిష్ఠపరుచుకునేందుకు దోహపడేవిధంగా బంగాళాఖాతం, నార్త్ ఇండియన్ సీలో మలబార్ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విన్యాసాలు 17వ తేదీ వరకూ జరగనున్నాయి. సముద్ర భద్రత విషయంలో ఈ మూడు దేశాలు సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలు, వాటికి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్న శక్తి సామర్థ్యాల గురించి ఇందులో పరస్పరం తెలుసుకుంటారు.

07/11/2017 - 01:34

న్యూఢిల్లీ, జూలై 10: ఉపరాష్టప్రతి పదవికి కూడా పోటీ చేయాలని భావిస్తున్న ప్రతిపక్షం మంగళవారం తమ అభ్యర్థి పేరును ఖరారు చేయవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన 18 ప్రతిపక్ష పార్టీల నాయకులు మంగళవారం సమావేశం అవుతున్నారు.

07/11/2017 - 01:33

పాట్నా, జూలై 10: బీహార్ సంకీర్ణంలో ముసలం పుట్టింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై సిబిఐ దాడులు చేయటం నితీశ్ కుమార్‌కి మద్దతు ఇవ్వటానికి బిజెపి సంసిద్ధం వ్యక్తం చేసింది.

07/11/2017 - 01:32

న్యూఢిల్లీ, జూలై 10: మనీలాండరింగ్ కేసులో ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఎంపీ మీసా భారతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల ఈడి పలు సంస్థలపై నిర్వహించిన దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. సుమారు 8వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి లాలూ కుమార్తె భారతిపై మనీలాండరింగ్ కేసు నమోదైంది.

07/11/2017 - 01:32

న్యూఢిల్లీ, జూలై 10: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. 2002 గుజరాత్ అల్లర్లలో చనిపోయినవారి మృతదేహాలు ఖననం చేసిన ఘటనతో ఆమెకు సంబంధం ఉన్నట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. పంచ్‌మహల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. గుజరాత్ హైకోర్టు ఆదేశం మేరకు సెతల్వాడ్‌పై కేసు నమోదు చేయగా సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

07/11/2017 - 01:26

నాగపూర్, జూలై 10: తామెక్కడున్నామో తెలుసుకోకుండా సెల్ఫీలకోసం పాకులాడాలన్న ఆసక్తి ఏడుగురి ప్రాణాలను బలిగొంది. ఓ రిజర్వాయర్ మధ్యలో బోటు ప్రయాణిస్తుండగా సెల్ఫీలు తీసుకునేందుకు కొందరు పర్యాటకులు చేసిన ప్రయత్నం ఈ దుర్ఘటనకు దారి తీసింది. సెల్ఫీల హడావుడి కారణంగా బోటు బోల్తా పడటంతో ఏడుగురు మునిగిపోయారు. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

Pages