S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/29/2017 - 03:24

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్టప్రతి పదవికి ఎన్‌డిఏ తరపున పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్ తరపున నాలుగో నామినేషన్ దాఖలైంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన ఈ నామినేషన్‌ను లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి బలపరిచారు.

06/29/2017 - 03:23

న్యూఢిల్లీ, జూన్ 28: మాంసంకోసం అక్రమంగా పశువిక్రయం చేయటంపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అకిల భారత కిసాన్ సభ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ నోటిఫికేషన్ దేశంలో మత స్వేచ్ఛ, స్వేచ్ఛా రవాణ హక్కులను కూడా కాలరాస్తోందని ఆ పిటిషన్‌లో పేర్కొంది.

06/29/2017 - 03:22

న్యూఢిల్లీ, జూన్ 28: సామూహిక హత్యాకాండలు, మతపరమైన దాడులు సహా ఇటీవల జరిగిన అనేక దురంతాలపై పౌర సమాజం కనె్నర్ర చేసింది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీసహా అనేక నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లో వేలాది మంది పౌరులు పాల్గొన్నారు. ‘నాట్ ఇన్ మై నేమ్’ (పేరే నేరమా) అన్న నినాదంతో మొదలై ప్రచారం విస్తృత స్థాయిలో ప్రజా చైతన్య ప్రదర్శనగా మారింది.

06/29/2017 - 03:22

న్యూఢిల్లీ, జూన్ 28: ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశానికి చేరుకున్నారు. అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్‌లో పర్యటించిన మోదీ అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన పర్యటన ఫలప్రదమైంది. మోదీకి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘనస్వాగతం పలికారు.

06/29/2017 - 01:53

న్యూఢిల్లీ, జూన్ 28: అప్పుల ఊబిలో కూరుకు పోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ఎంత వాటాను విక్రయించాలనే దానితో పాటుగా ఇతర విధి విధానాలను మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రివర్గ సమావేశం వివరాలను తెలియజేశారు.

06/29/2017 - 02:35

న్యూఢిల్లీ, జూన్ 28: జూలై ఒకటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగే చారిత్రక సమావేశంలో ఈ పరోక్ష పన్నుల వ్యవస్థ ఆవిష్కృతమవుతుంది. కేంద్రంలోని ఎన్డీ ఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ, అన్ని రాష్ట్రాల ఆమోదం పొందుతూ, జీ ఎస్టీ వ్యవస్థ ఓ స్పష్టమైన రూపును సంతరించుకుంది.

06/29/2017 - 01:42

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్టప్రతి పదవికి ప్రతిపక్షం అభ్యర్థిగా రంగంలోకి దిగిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఉదయం 11.30కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

06/28/2017 - 03:45

సూళ్లూరుపేట, జూన్ 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి జీశాట్-17 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 3,447కిలోల బరువుగల జీశాట్-17 ఉపగ్రహాన్ని ముందస్తు ఒప్పందం ప్రకారం ఫ్రెంచి గయానా నుంచి ఏరియల్-5 రాకెట్ నుండి ప్రయోగిస్తున్నారు.

06/28/2017 - 03:48

వరంగల్, జూన్ 27: తోటి ప్రయాణికులుగా నటించిన ఆగంతకులు రైలుబోగీలోని ఆరుగురు యువకులకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి డబ్బు దోచుకుని ఉడాయించిన సంఘటన ఇది.

06/28/2017 - 03:12

న్యూఢిల్లీ, జూన్ 27: జూలై 1నుంచి వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) అమలులోకి రానుండడంతో దీని అమలులో ఎదురయ్యే ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఒక మినీ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వార్‌రూమ్‌లో పలు ఫోన్ లైన్లు, కంప్యూటర్లతో పాటుగా వాటిని నిహించేందుకు టెక్నాలజీ బాగా తెలిసిన పలువురు యువ నిపుణులు కూడా ఉంటారు.

Pages