S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/28/2016 - 01:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఆరు దశాబ్దాల నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అనేక వివాదాలకు కేంద్రంగా మారిన సెన్సార్ బోర్డు పనితీరును మెరుగుపరచడానికి కేంద్రం ఈ చర్యకు పూనుకుంది. జస్టిస్ ముద్గల్ కమిటీ, బెనగల్ కమిటీ చేసిన సిఫార్సులను తాను పరిశీలిస్తున్నానని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు.

10/28/2016 - 01:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: తమ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో భద్రత, సుస్థిరత, సుఖసంతోషాలను పెంపొందించడంలో భారత్, న్యూజిలాండ్ కలిసి పని చేయగలవని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మన దేశంలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీకి రాష్టప్రతి భవన్ వద్ద స్వాగతం పలుకుతూ రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేశారు. కీ బుధవారం రాష్టప్రతిని కలిశారు.

10/28/2016 - 01:13

జమ్మూ, అక్టోబర్ 27: జమ్మూకాశ్మీర్ సరిహద్దులోని ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ రేంజర్ మృతి చెందాడని బిఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒక బిఎస్‌ఎఫ్ జవాను మరణించినట్టు తెలిపాయి. ఆరుగురు పౌరులకు గాయాలయ్యాయి. ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లోని ఆర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే ఎల్‌ఓసి వద్ద సుందేర్‌బనీలో పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించాయ.

10/28/2016 - 01:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల ముందే దీపావళి వచ్చింది. 2 శాతం డిఏ పెంచుతూ గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 లక్షల మంది ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. పెంచిన డిఏ 2016 జూలై 1 నుంచి అమలు చేస్తారు. వినియోగ ధరల పెంపు సూచీకి అనుగుణంగా ప్రభుత్వం డిఏ నిర్ణయిస్తుంది.

10/28/2016 - 01:10

సూరత్, అక్టోబర్ 27: దేశంలో పేరున్న వజ్రాల వ్యాపారి సావ్‌జీభాయ్ ధోలాకియా. హరే కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ యజమాని ధోలాకియాకు వజ్రాల వ్యాపారం, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఉన్నాయి. ఏటా సంస్థ లాభాల్లో ఉద్యోగులకు బోనస్ రూపేణా గిఫ్టులు అందజేసే ధోలాకియా ఈ దీపావళి సందర్భంగా భారీ నజరానా ప్రకటించారు. 400 మంది ఉద్యోగులకు ఫ్లాట్లు, 1260 మందికి కార్లు అందజేయనున్నారు.

10/28/2016 - 01:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. వచ్చే ఏడాది ఆగస్టులో జరగాల్సి ఉన్న ప్రిలిమ్స్ రెండు నెలల ముందు జరిపారు. జూన్‌లో పరీక్షలు జరుగుతాయని యుపిఎస్‌సి వర్గాలు వెల్లడించాయి. 2017 సివిల్స్ ప్రిలిమ్స్‌కు సంబంధించి సర్వీస్ కమిషన్ పరీక్షల కేలండర్‌లో జూన్ 18న పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు.

10/28/2016 - 01:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశ వ్యాప్తంగా పెన్షనర్లు అందరికీ జాతీయ చిహ్నం (మూడు సింహాల గుర్తు)తో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు హోమ్‌శాఖ ఆమోదం తెలిపింది. పెన్షనర్లందరికీ జాతీయ చిహ్నంతో ఒకే విధమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు.

10/28/2016 - 01:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఎన్నికల అవినితీ చట్టం పరిధి, విస్తృతిపై సుప్రీం కోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. మతం, జాతి, కులం, సమాజం, భాషల పేరుతో ఓట్లు అడగటం అవినీతి పరిధిలోకి వస్తుందా రాదా అన్న అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘మతం పేరుతో ఓట్లు అడగటం అంటే ఏమిటి? ఎవరి మతం?

10/27/2016 - 08:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: భారత్, న్యూజిలాండ్‌లు కీలకమైన వాణిజ్యం, రక్షణ, భద్రతా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే అంగీకారానికి వచ్చాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ బుధవారం ఇక్కడ జరిపిన చర్చల సందర్భంగా ఈ అంగీకారం కుదిరింది.

10/27/2016 - 08:01

బెంగళూరు, అక్టోబర్ 26: గనుల అక్రమ తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పకు పెద్ద ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌లో అవినీతికి పాల్పడినట్లు నమోదయిన కేసులో యెడ్యూరప్పను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సిబిఐ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. యెడ్యూరప్ప ఇద్దరు కుమారులు, అల్లుడు, మరో తొమ్మిది మంది నిందితులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Pages