S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/22/2016 - 07:00

ముంబయి, అక్టోబర్ 21: ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.

10/22/2016 - 06:58

ముంబయి, అక్టోబర్ 21: ఇటీవల వెలుగు చూసిన కోట్లాది రూపాయల కాల్‌సెంటర్ కుంభకోణంలో కుంభకోణానికి పాల్పడిన వారు తమ అక్రమ కార్యకలాపాల్లో భాగంగా ఎదుటి వ్యక్తి ఆర్థిక స్తోమతును అంచనా వేయడం కోసం వ్యక్తుల పేర్లు, చిరునామాలను అందించే పేరుమోసిన వ్యక్తుల సెర్చ్ వెబ్‌సైట్లను ఉపయోగించే వారని పోలీసులు వెల్లడించారు.

10/22/2016 - 06:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో మానవ హక్కులను పర్యవేక్షించే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) మరిన్ని అధికారాలతో పులిలా గర్జించాల్సిన అవసరం ఉందని కమిషన్ చైర్‌పర్సన్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్.దత్తు ఉద్ఘాటించారు.

10/22/2016 - 07:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కావేరీ జలాలను కర్నాటక అందించకపోవడం వల్ల తమిళనాడు అధ్వాన్న స్థితికి దిగజారిందని ప్రతిపక్ష నేతలు శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి మొరపెట్టుకున్నారు. ఒకప్పుడు అన్నం పెట్టిన తమ రాష్ట్రం ఇప్పుడు పంటలు లేక నష్టపోయి భిక్షపాత్రగా మారిందని స్పష్టం చేశారు. తమ రాష్ట్ర పంటల దుస్థితిని అర్థం చేసుకొని తగిన రీతిలో జోక్యం చేసుకోవడం ద్వారా న్యాయం చేయాలని అభ్యర్థించారు.

10/22/2016 - 06:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సుప్రీం కోర్టులో శుక్రవారం కొన్ని అవాంఛనీయ ఘటనలు తలెత్తాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఆందోళనకు దిగిన కొంత మంది న్యాయవాదులు పరస్పరం ఒకరి నొకరు నిందించుకుంటూ వాదులాటకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ వారిని గట్టిగా దండించారు. ‘ఎందుకు అరుస్తున్నారు?.. ఇదేమన్నా న్యాయస్థానమా? లేక చేపల మార్కెట్టా?.. నోరు ముయ్యండి..

10/22/2016 - 06:54

శ్రీనగర్, అక్టోబర్ 21: సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వస్తిచెబితేనే భారత్‌తో చర్చలు ఫలప్రదమవుతాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. అననుకూల వాతావరణ ఉన్నప్రస్తుత పరిస్థితుల్లో సామరస్యపూరితంగా చర్చలు అసాధ్యమని శుక్రవారం ఇక్కడ చెప్పారు. అదే సమయంలో ఇరుదేశాల చర్చలకు తెరపడలేదని ఆమె వ్యాఖ్యానించారు.

10/22/2016 - 06:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రపంచంలోనే అత్యంత అరుదుగా 16 ఏళ్ల వయసు కలిగిన ఒక యువకుడు ఆడవారి లైంగిక అవయవాలను కలిగివున్న ఉదంతం పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చింది. ఇతను మగవాడే అయినప్పటికీ మహిళ మాదిరిగా యోనితో పాటు గర్భాశయాన్ని, అండాశయాలను, అండ నాళాలను కలిగి ఉన్నాడు.

10/22/2016 - 02:29

జమ్ము, అక్టోబర్ 21: ఎలాంటి కవ్వింపులేకుండా కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ రేంజర్లకు భారత దళాలు తమ సత్తా చూపాయి. శుక్రవారం ఉదయం ఆధీన రేఖ ప్రాంతంలోని బోబియాన్ పోస్టుపై పాక్ సరిహద్దు దళాలుగా పేర్కొనే రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు ప్రతిగా ఎదురుకాల్పులు జరిపిన భారత దళాలు ఎడుగురు పాక్ రేంజర్లును మట్టుబెట్టాయి.

10/22/2016 - 02:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రభుత్వరంగంలోని క్రిబ్కో (కృషక్ భారతి కో-ఆపరేటివ్), మొరాకోకు చెందిన ఓసిపి కంపెనీ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఓడరేవు సమీపంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎరువుల కర్మాగారానికి సంబంధించిన ఒప్పందాలు శుక్రవారం ఢిల్లీలో జరిగాయి.

10/22/2016 - 02:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ పథకం కింద చిన్న పట్టణాలను అనుసంధానించే గంట లోపు విమాన ప్రయాణానికి రూ 2,500 మాత్రమే చార్జి చేస్తారు. విమానంలోని సగం సీట్లను ఈ కేటగిరీ కింద కేటాయిస్తారు.

Pages