S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/26/2016 - 08:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో పోలీసు శిక్షణా కేంద్రంపై జరిగిన ఉగ్రదాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అదుపు చేయలేని హింసను ఎవరూ సృష్టించకూడదనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనమన్నారు. క్వెట్టా పోలీసు ట్రైనింగ్ అకాడమీపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 60 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే.

10/26/2016 - 08:19

పాట్నా, అక్టోబర్ 25: బిహార్‌లో ఓ మహిళా ఇంజనీర్‌ను సజీవ దహనం చేశారు. సరితాదేవీ (42) అనే జూనియర్ ఇంజనీర్‌ను ఆఫీసులోనే కుర్చీకి కట్చేసి ఈ దారుణానికి ఒడిగట్డారు. ముజఫర్‌పూర్‌లోని మొరౌల్ బ్లాక్‌లో ఆమె జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆఫీసు గదిలోనే ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

10/26/2016 - 08:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గత నెల జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటించుకుంది. ఈ దాడిలో 20 మంది భారతీయ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది.

10/26/2016 - 08:18

చెన్నై, అక్టోబర్ 25: డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. మందులు అలర్జీవల్ల అస్వస్థతకు గురైన కరుణను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కోరారని పార్టీ వెల్లడించింది. అధినేతను పరామర్శించానికి ఎవరూ రావద్దని వారు విజ్ఞప్తి చేశారు. రోజువారి ముందులు పడక ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఇంట్లోనే వైద్య సేవలు అందిస్తున్నట్టు పార్టీ స్పష్టం చేసింది.

10/26/2016 - 08:16

కురుక్షేత్ర, అక్టోబర్ 25: పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద అసువులు బాసిన బిఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. సుశీల్‌కు నివాళులర్పించేందుకు ఆయన స్వగ్రామమైన పిహోవా స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులతో పాటు సమీప గ్రామాలనుంచి భారీ సంఖ్యలో పిహోవా చౌక్‌కు తరలివచ్చారు.

10/26/2016 - 08:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే పార్టీ అధ్యక్ష పదవి చేపడతారని పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోని ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. రాహుల్ గాంధీ త్వరలోనే సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు, అయితే అధ్యక్ష పదవిని కచ్చితంగా ఎప్పుడు చేపడతారనేది వెల్లడించలేనని అంబికా సోని తెలిపారు.

10/26/2016 - 07:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: తెలంగాణలోని వివిధ నీటిపారుదల పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు వెయ్యి కోట్ల నిధులు రెండు మూడు రోజుల్లో విడుదల చేయించాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతిని కోరినట్టు రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

10/26/2016 - 07:44

జమ్మూ, అక్టోబర్ 25: కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాక్ సైన్యం మంగళవారం జమ్మూ, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున మోర్టార్లతో కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులకు స్పందించిన బిఎస్‌ఎఫ్ బలగాలు తగిన రీతిలో గట్టిగా సమాధానం చెప్తున్నాయి.

10/26/2016 - 07:08

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత రాష్టప్రతి, ఉపరాష్టప్రతి వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఎంతగా అంటే ఇప్పుడున్న వేతనాలకు దాదాపు మూడు రెట్లు పెరగనున్నాయి. హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను ఇప్పటికే సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడంతో దేశ ప్రథమ పౌరుడు, ఆ తర్వాతి స్థానమైన ఉపరాష్టప్రతి వేతనాలను సైతం పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.

10/26/2016 - 03:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: హిందుత్వం జీవన విధానమని పేర్కొంటూ 1995లో వెలువరించిన ప్రఖ్యాత తీర్పును పునఃసమీక్షించేది లేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తమకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నివేదించిన పరిశీలనాంశాల్లో ఈ అంశం లేదని, దీని దృష్ట్యా హిందుత్వ అంశంపై విస్తృత స్థాయి చర్చ జరిపే ప్రసక్తి లేదని వెల్లడించింది.

Pages