S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/20/2016 - 03:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కృష్ణా జలాల పంపిణీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకే వర్తింపచేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రకు కేటాయించిన జలాలనే ఆంధ్ర, తెలంగాణలకు పంపిణీ చేయాలని తీర్పులో ఆదేశించింది.

10/19/2016 - 03:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తెలంగాణా రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం 175 కోట్ల గ్రాంటు ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు.

10/19/2016 - 01:46

లూధియానా, అక్టోబర్ 18: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇప్పటికీ దళితులపై దాడులు జరగడాన్ని చూసి సిగ్గుపడుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదనతో అన్నారు. ఈ దారుణాలను ఇంకెంత మాత్రం ఉపేక్షించకూడదని, ఈ ఘోరాలకు దారితీస్తున్న సామాజిక ప్రతికూల పరిస్థితుల్ని సరిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు జరగాల్సిందేనని పిలుపునిచ్చారు.

10/19/2016 - 01:41

శ్రీనగర్, అక్టోబర్ 18:ఉగ్రవాదులపై ఉక్కుపాదం మొపుతున్న సైనిక దళాలు మంగళవారం మరో విజయం సాధించాయి. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య కేంద్రాలను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో బాంబులతో పాటు చైనా, పాకిస్తాన్ జెండాలు, లష్కరే తోయిబా,జైషే మొహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన లెటర్‌హెడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి.

10/19/2016 - 01:41

న్యూఢిల్లీ, అక్టోబరు 18: కృష్ణా జలాల కేటాయింపులపై బుధవారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించనుంది. కృష్ణా నదీ జలాల కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్యా? లేక రెండు రాష్ట్రాల మధ్య జరపాలా? అన్న అంశంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ స్పష్టత ఇవ్వనుంది.

10/19/2016 - 00:21

భారత పర్యటనకు వచ్చిన మైన్మార్ విదేశాంగ మంత్రి ఆంగ్ సాన్ సూకీకి రాష్టప్రతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో స్వాగతం చెబుతున్న సుష్మాస్వరాజ్

10/19/2016 - 00:19

భువనేశ్వర్, అక్టోబర్ 18: భద్రత, నిర్వహణ పరంగా నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే ఇక్కడి ఎస్‌యుఎమ్ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగి 22 మంది మరణానికి దారితీసిందంటూ ఒడిశా ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా మొత్తం నలుగురు అధికారుల్ని అరెస్టు చేశారు. మరో నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు.

10/19/2016 - 00:16

మండీ, అక్టోబర్ 18: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం నిర్వహించిన ఉగ్రవాద లక్షిత దాడులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ సైనిక దాడులతో పోల్చారు. ‘ఇటీవలి కాలంలో భారత సైన్యం శౌర్యం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. గతంలో ఇజ్రాయెల్ తన శత్రు దేశాలు, ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు చేసేదని మనం వినేవాళ్లం. ఇప్పుడు మన సైన్యం ఎవరికీ తీసిపోదని రుజువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

10/19/2016 - 00:13

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బ్రిక్స్ డిక్లరేషన్‌లో సీమాంతర ఉగ్రవాదంను ప్రస్తావించేలా చేయడంలో భారత్ విఫలమైందన్న విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చుతూ ప్రభుత్వ ప్రోత్సాహిత, ప్రభుత్వ రక్షణలోని ఉగ్రవాదం కన్నా పెద్దముప్పు మరోటి లేదని సదస్సు గుర్తించిందని, ఉగ్రవాదం విషయంలో ఇంతకుముందు మాదిరిగా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిందని పేర్కొంది.

10/19/2016 - 00:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాలన్న ముస్లిం మహిళల డిమాండ్‌కు సిపిఎం మద్దతు ప్రకటించింది. ట్రిపుల్ తలాక్ ఏకపక్షమే కాకుండా అనాలోచితమని, దాన్ని రద్దుచేయాలన్న ముస్లిం మహిళలకు మద్దతు తెలుపుతున్నామని సిపిఎం పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.

Pages