S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/20/2016 - 07:37

బెంగళూరు, అక్టోబర్ 19: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహ శుభలేఖ హాట్‌టాపిక్ అయింది. బెంగళూరులో జరిగే కూతురు వివాహానికి ఆహ్వానిస్తూ అదిరిపోయే పెళ్లికార్డు వేయించారు. అది అలాంటి ఇలాంటి వివాహ ఆహ్వానపత్రిక మాత్రం కాదు. బ్రహ్మణి వివాహం నవంబర్ 16 రాజీవ్‌రెడ్డితో జరుగబోతున్నదంటూ ప్రచురించిన శుభలేఖను ఒక బాక్స్‌లో ఉంచారు.

10/20/2016 - 07:31

భువనేశ్వర్, అక్టోబర్ 19: భువనేశ్వర్ సమ్ ఆసుపత్రి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా బుధవారం స్పష్టం చేస్తూ, ఈ తీవ్రమైన తప్పిదానికి బాధ్యులైన వారినందరిపైనా చర్యలు తీసుకునేలా చూడాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించారు.

10/20/2016 - 07:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశంలో నిర్బంధ ఓటు విధానాన్ని అమలు చేయటం కార్యాచరణలో సాధ్యం కాని పని అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం జైదీ బుధవారం అన్నారు. లోక్‌సభలో ఇదే డిమాండ్‌ను ప్రభుత్వం గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించింది. ‘‘తప్పని సరి ఓటింగ్ విధానం అనేది కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. కానీ, మన దేశంలో వాస్తవంగా అమలు చేయాల్సి వచ్చేసరికి అంత సాధ్యం కాదు.

10/20/2016 - 07:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కేరళకు చెందిన సౌమ్య రేప్ కేసులో తమ ముందు హాజరై తామిచ్చిన తీర్పులో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఇచ్చిన సమన్లను తాను స్వాగతిస్తున్నానని జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు.

10/20/2016 - 07:30

బీజింగ్, అక్టోబర్ 19: చైనా వస్తువులను భారత్‌లో బహిష్కరించాలని సామాజిక మాధ్యమంలో కొంతమంది ఇచ్చిన పిలుపుపై స్పందిస్తూ భారతీయ వస్తువులు చైనా వస్తువులతో పోటీ పడలేవని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ తన బుధవారం సంచికలోని ఓపెన్ ఎడిట్ పేజీలో ప్రచురించిన ఒక కథనంలో భారత్ కేవలం ‘మొరగగలుగుతుంద’ని, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య లోటుపై ఏమీ చేయజాలదని వ్యాఖ్యానించింది.

10/20/2016 - 07:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తనతో సహా ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం పిటిషన్‌పై ట్రయల్ కోర్టులో విచారణను నిలిపివేయించాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

10/20/2016 - 07:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దాదాపు అర్ధశతాబ్దం పాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్ ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం, అభివృద్ధి వైపు పయనం మొదలుపెట్టిన నేపథ్యంలో భారత్ ఆ దేశానికి తిరుగులేని మద్దతును ప్రకటించింది. మరోవైపు భద్రత, వాణిజ్యంతో పాటుగా వివిధ రంగాల్లో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

10/20/2016 - 07:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్ విచారణ నవంబర్ 21 తేదీకి వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లో స్పందించాలని, కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

10/20/2016 - 07:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 16న ప్రారంభమయి డిసెంబర్ 16తో ముగుస్తాయి. బుధవారం అధికారికంగా ఈ విషయం ప్రకటించారు. 16వ లోక్‌సభ పదో సమావేశాలు, రాజ్యసభ 241 సమావేశాలుగా ఇవి ఉంటాయి. ‘16వ లోక్‌సభ పదో సమావేశాలు 2016, నవంబర్ 16 బుధవారం ప్రారంభమవుతాయి.

10/20/2016 - 04:57

న్యూఢిల్లీ,అక్టోబర్ 19: జనరేటర్లు, బాయిలర్లు, టర్బైన్లను ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన మన్నవరం ప్రాజెక్టును తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఖండించారు. మన్నవరం ప్రాజెక్టు అక్కడే ఉంటుందని ఆయన బుధవారం విలేఖరులకు చెప్పారు.

Pages