S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/22/2016 - 02:03

చెన్నై, అక్టోబర్ 21:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సందేహాలు క్రమంగా తొలగిపోతున్నాయి. గత నాలుగు వారాలుగా ఇక్కడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ దాదాపుగా స్పృహలోకి వచ్చారని, మంచంమీద కూర్చోగలుగుతున్నారని చెబుతున్నారు.

10/21/2016 - 03:12

అహ్మదాబాద్, అక్టోబర్ 20: మైనార్టీ వర్గానికి చెందిన 33మంది సజీవ దహనానికి సంబంధించిన సర్దార్‌పూర కేసులో 17మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను గుజరాత్ హైకోర్టు ధృవీకరించింది.

10/21/2016 - 03:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కొత్తగా ప్రవేశపెట్టబోయే వస్తు సేవల పన్నులో భాగంగా నాలుగంచెల పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ పన్ను విధానం వల్ల వంటింటి సరకులైన వంటనూనెలు, మసాలాదినుసులు, మాంసంలాంటివి వంటింటి సరకులు ప్రియం కానుండడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది.

10/21/2016 - 02:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పిసిసి మాజీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రీటా బహుగుణ జోషి గురువారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె బిజెపిలో చేరారు.

10/21/2016 - 02:24

భువనేశ్వర్, అక్టోబర్ 20: గత సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన భువనేశ్వర్‌లోని ‘సమ్’ ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన లోపాలున్నట్లు ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా గురువారం అంగీకరించింది.

10/21/2016 - 02:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: జాడ తెలియకుండా పోయిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) విద్యార్థి నజీబ్ అహ్మద్ జాడ తెలుసుకోవడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.

10/21/2016 - 03:00

చెన్నై, అక్టోబర్ 20: అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అవుతారని అన్నాడిఎంకె ప్రకటించింది.‘విదేశీ నిపుణులు, అపోలో వైద్యుల పర్యవేక్షణలో అమ్మకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజురోజుకు ఆమె ఆరోగ్యపరిస్థితి మెరుగవుతోంది’అని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి గురువారం వెల్లడించారు.

10/21/2016 - 02:21

భువనేశ్వర్, అక్టోబర్ 20: ఎస్‌యుఎంలో 21 మంది మరణానికి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలిపెట్టేది లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని గురువారం ఇక్కడ పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైనవారెవరినీ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి యజమానితోపాటు ఐదుగుర్ని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

10/21/2016 - 02:19

శివకాశి, అక్టోబర్ 20: బాణసంచా తయారీకి కేంద్రమైన తమిళనాడులోని శివకాశిలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పది మంది గాయపడ్డారు. లారీలోంచి బాణసంచా సామగ్రిని దుకాణం వద్ద దించుతుండగా నిప్పు అంటుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించి ఎనిమిది మంది మృతి చెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. సమీపంలోని పలు వాహనాలు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి.

10/21/2016 - 01:50

జమ్ము, అక్టోబర్ 20: జమ్ముకాశ్మీర్‌లో గురువారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. గాయపడ్డ 30మందిలో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 45మంది ప్రయాణికులతో రియాసీ నుంచి బకుల్ ప్రాంతానికి వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని రియాసీ ఎస్‌ఎస్‌పి తాహిర్ సజాద్ భట్ తెలిపారు.

Pages