S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/23/2016 - 04:03

ముంబయి, అక్టోబర్ 22: రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల ఒత్తిళ్లకు బాలీవుడ్ నిర్మాతల మండలి దిగొచ్చింది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కళాకారులను నిషేధించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ చేశారు. పాకిస్తాన్ నటులతో సినిమాలు తీయబోమని బాలీవుడ్ నిర్మాతల గిల్డ్ ప్రకటించింది. కాగా కరణ్ జోహార్ నిర్మించిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.

10/23/2016 - 03:40

జమ్మూ, అక్టోబర్ 22: సరిహద్దుల్లో పదే పదే కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్ రేంజర్లపై బిఎస్‌ఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు దాడుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు, ఒక ఉగ్రవాది మృతి చెందినప్పటికీ పాక్ రేంజర్లకు మాత్రం బుద్ధి రాలేదు. శుక్రవారం ఈ సంఘటన జరిగిన తర్వాత రాత్రంతా పాక్ రేంజర్లు ఆర్‌ఎస్ పురా ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్ బాంబుల వర్షం కురిపించారు.

10/23/2016 - 02:54

వడోదర, అక్టోబర్ 22: నల్లధనానికి వ్యతిరేకంగా లక్షిత దాడులు నిర్వహించి ఉంటే ఎలా ఉండేదోనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అన్నారు. ‘‘దేశవ్యాప్తంగా నల్లధనాన్ని వెల్లడి చేసేందుకు ఒక్క అవకాశం ఇచ్చాం. ఆ ఒక్క అవకాశంతోనే రూ.65వేల కోట్లు పన్ను రూపంలో, జరిమానా రూపంలో వచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 36వేల కోట్ల రూపాయలు దారి మళ్లకుండా కాపాడగలిగాం.

10/23/2016 - 02:52

చెన్నై, అక్టోబర్ 22: గత కొద్ది రోజులుగా ఇక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను శనివారం ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఇంతకు ముందు జయలలిత ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వస్తుండడంతో ఈ నెల 1న ఆయన అపోలో ఆస్పత్రిని సందర్శించి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

10/23/2016 - 02:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: మంత్రివర్గ సమావేశాలలోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా కేంద్రం నిషేధం విధించింది. మంత్రివర్గ సమావేశాలలో జరిగే చర్చలను ఎవరైనా అనధికారికంగా మొబైల్ ఫోన్ల వంటి సమాచార పరికరాలతో రికార్డు చేసి, లీక్ చేస్తారనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.

10/23/2016 - 02:27

వడోదర, అక్టోబర్ 22: విమానయాన రంగంపై గత ప్రభుత్వాలకు ఎలాంటి విజన్ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రంగానికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించిందని, అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంచే ఈ రంగం విస్తరణకు ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తోందని చెప్పారు.

10/23/2016 - 03:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరులోనే కాదు, అంతర్జాతీయ పోటీల్లోను తమకు తామే సాటి అని భారత సైన్యం నిరూపించుకుంది. సైన్యంలోని గూర్ఖా రైఫిల్స్ దళం అత్యంత కఠినమైన కాంబ్రియన్ పెట్రోలింగ్ ఎక్సర్‌సైజెస్‌లో స్వర్ణ పతకం సాధించింది. వేల్స్‌లోని బ్రిటిష్ సైన్యం ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంది.

10/23/2016 - 02:21

ఆర్‌ఎస్ పుర, అక్టోబర్ 22: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ముష్కరుల దాడులు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫిరంగులు, తుపాకీ బుల్లెట్లకు పశు సంపదనను కోల్పోతున్నారు. పశుపోషణే జీవనాధారంగా బతుకున్న రైతులు ‘మూగ’ రోదనను వినిపించుకునేవారై కరవైపోయారు. ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో గత రాత్రి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పులకు అభంశుభం ఎరుగని మూగజీవాలు బలైపోయాయి. ‘అందరి దృష్టిలో అవి పశువులే.

10/23/2016 - 02:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: జమ్మూ, కాశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లో పాకిస్తానీ ఉగ్రవాదులు పెద్దఎత్తున చొరబాటుకు విఫలయత్నం చేసిన ఫోటోలను బిఎస్‌ఎఫ్ శనివారం విడుదల చేసింది.

,
10/23/2016 - 02:19

లక్నో, అక్టోబర్ 22: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన కలహాలు ఆ పార్టీ పాలిట ముసలంగా మారుతున్నాయి. పార్టీ చీఫ్ ములాయం సోదరుడు శివపాయాదవ్, కుమారుడు అఖిలేష్‌ల మధ్య పెరుగుతున్న అంతరం ముదిరి పాకాన పడింది. అఖిలేష్‌ను సిఎం పదవి నుంచి తప్పుకోవాలని తండ్రి, పార్టీ అధ్యక్షపదవి నుంచి తప్పుకోవాలని తండ్రిని కొడుకు డిమాండ్ చేస్తున్నారు.

Pages