S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/26/2016 - 03:17

న్యూఢిల్లీ/ హైదరాబాద్, అక్టోబర్ 25: విద్యా హక్కు చట్టం అమలులో పెనుమార్పులు రానున్నాయి. సవరణలకు వీలుగా రాష్ట్రాలకు అధికారం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర విద్యా సలహా మండలి (సిఎబిఇ) 64వ వార్షిక సమావేశం మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జావడేకర్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యా మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

10/25/2016 - 02:10

లక్నో, అక్టోబర్ 24: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతఃకలహాలు మరింత రచ్చకెక్కాయి. సోమవారం ఇక్కడ జరిగిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మధ్య వేదికపైనే వాగ్యుద్ధం జరిగింది.

10/25/2016 - 02:02

మహోబా (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 24: దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

10/25/2016 - 01:59

జమ్ము, అక్టోబర్ 24: జమ్ముకాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను మరింత తీవ్రతరం చేసింది. జమ్ము జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక సబ్ సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం ఉద్ధృతంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ ఆరేళ్ల బాలుడు, ఒక జవాను మరణించారు. సుమారు 25 బోర్డర్ అవుట్‌పోస్ట్‌లను లక్ష్యం చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.

10/25/2016 - 02:20

ఇంఫాల్, అక్టోబర్ 24: మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ సోమవారం మిలిటెంట్ల కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఉఖ్రుల్‌లో ఆయన ఓ హెలికాప్టర్ నుంచి దిగుతున్న సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇబోబి సింగ్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినప్పటికీ మణిపూర్ రైఫిల్స్ జవాన్ గాయపడ్డాడని సిఐడి వర్గాలు తెలిపాయి.

10/25/2016 - 01:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ట్రిపుల్ తలాక్’ను వ్యతిరేకించటం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి బాగా కలిసి వస్తుందని బిజెపి నాయకులు అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ దుర్నీతితో విసిగి వేసారిన ముస్లిం మహిళలు ఈసారి బిజెపికి ఓటు వేస్తారని వారు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

10/25/2016 - 01:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్లుపై విచారణ నవంబర్ 21 తేదీకి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ పరిధి నుంచి జలవనరుల శాఖకు బదిలీచేయాలని ఏపీ ప్రభుత్వం సోమవారం ఎన్జీటికి విజ్ఞప్తి చేసింది.

10/25/2016 - 01:55

తిరువనంతపురం, అక్టోబర్ 24: సౌమ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టిన మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ మరొక అడుగు ముందుకేసి ‘పని ఒత్తిడి వల్లే తీర్పులో పొరపాట్లు జరిగి ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. సౌమ్య హంతకుడు గోవిందసామికి కేరళ హైకోర్టు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చిన సంగతి తెలిసిందే.

10/25/2016 - 01:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఇప్పటివరకు పురుషులు మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉన్న ముంబయిలోని చరిత్రాత్మక హజీ అలీ దర్గాలోకి ఇకనుంచి మహిళలు కూడా ప్రవేశించి ప్రార్థనలు చేయవచ్చు. దర్గా ట్రస్టు సోమవారం సుప్రీంకోర్టుకు ఈ విషయం చెప్పింది.

10/25/2016 - 01:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపి శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. మహిళా సాధికారిత లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్టు సోమవారం ఇక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిట్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సహకారంతో ఏపి నూతన రాజధానిలో ఈ సదస్సు నిర్వహించనున్నారు.

Pages