S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/25/2016 - 01:46

ముత్తుకూరు, అక్టోబర్ 24: కృష్ణ పట్నం పోర్టు తీరప్రాంత పరిరక్షణకు కోస్టుకార్డు పరిధిలో రాణిగైడిన్లు అనే రక్షణ నౌక ఓడరేవు భూ భాగంలో ఉండడం చాలా సంతోషకరమని, పోర్టు సెక్యూరిటికి అదనపు బలం లాంటిదని ఓడరేవు సిఇఓ అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం విశాఖపట్నం ఓడరేవు నుంచి ఇండియన్ కోస్టుగార్డు పరిధిలో రాణిగైడిన్లు రక్షణనౌక కృష్ణపట్నం ఓడరేవులో లంగరు వేసింది.

10/25/2016 - 01:44

ప్రత్యేక బోడోల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అసోంలో రైల్‌రోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ప్రోగ్రెసివ్), పీపుల్స్ జాయంట్ కమిటీ ఫర్ బోడోల్యాండ్ మూవ్‌మెంట్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిరంగ్ జిల్లాలోని బాసుగావ్ రైల్వే స్టేషన్‌లోని దృశ్యమిది

10/25/2016 - 01:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: అరుణాచల్‌లోని తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటనను చైనా ప్రతిఘటించడాన్ని భారత్ సోమవారం నిరసించింది. చైనా అభ్యంతరం అర్థరహితమంటూ కొట్టివేసింది. వార్షిక తవాంగ్ ఉత్సవంలో భాగంగానే రిచర్డ్ వర్మ అక్కడికి వెళ్లారని స్పష్టం చేసింది. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు అమెరికా రాయబారి వెళ్లడంలో తప్పేమిటని..

10/24/2016 - 07:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వస్తుసేవల పన్ను అమల్లోకి వచ్చిన తరువాత దేశీయంగా వివిధ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/24/2016 - 06:08

ఇండోర్, అక్టోబర్ 23: దేశంలో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, అలాగే వ్యాపార వాణిజ్యాలను పెంపొందించేందుకు వీసా మంజూరు విధానాన్ని మరింతగా సరళతరం చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటామని ఆదివారం నాడిక్కడ ముగిసిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.

10/24/2016 - 06:09

అంక్లేశ్వర్, అక్టోబర్ 23: ప్రపంచ దేశాలలో భారత్ సముచితమైన స్థానాన్ని పొందాలంటే స్థూల జాతీయోత్పత్తి అంకెలు మాత్రమే సరిపోవని, పౌరులందరికీ అందుబాటులో ఉండే ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉండాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించారు. గుజరాత్‌లోని భారుచ్ జిల్లా అంక్లేశ్వర్‌లో ఆదివారం ఆయన సర్దార్ పటేల్ మల్టీ స్పెషాలిటి అండ్ హార్ట్ హాస్పిటల్‌ను ప్రారంభించారు.

10/24/2016 - 06:09

లక్నో, అక్టోబర్ 23: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీలో, ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం అత్యంత వేగంగా సంభవించిన పరిణామాలతో ములాయం సింగ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ఇద్దరూ బహిరంగంగానే నువ్వా, నేనా తేల్చుకుందాం అనే స్థితికి చేరుకున్నారు. దీంతో ఆ పార్టీ నిలువునా చీలిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు.

10/24/2016 - 06:10

ఆర్.ఎస్.పురా (జమ్మూ), అక్టోబర్ 23: ఆమె కుమారుడు దేశంకోసం అమరుడయ్యాడు... ముష్కరుల ఎదురుకాల్పుల్లో నిర్జీవంగా తిరిగొచ్చాడు... చెట్టంత కుమారుడి భౌతికకాయాన్ని చూసి ఆమె వౌనంగా రోదిస్తోంది. దేశంకోసం త్యాగం చేశాడని గర్వించాలా లేక యుక్త వయసులోనే అమరుడయ్యాడని దుఃఖించాలా- ఇంతటి విషాదంలోనూ ఆమె తన కుమారుడికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంది. ఆమె హృదయం ఎంతగా రోదిస్తున్నా, ఆమె మాత్రం కన్నీరు పెట్టడం లేదు.

10/24/2016 - 05:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమవుతాయని భావిస్తున్న కీలకమైన ఉత్తరప్రదేశ్‌తో పాటుగా అయిదు రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నావిస్తోంది. ఫిబ్రవరి 1న సాదారణ బడ్జెట్‌ను సమర్పించిన కొద్ది రోజులకే ఈ ఎన్నికలు జరగనున్నాయి.

10/23/2016 - 04:32

డెహ్రాడూన్, అక్టోబర్ 22: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిరాశా నిస్పృహలతో ఉన్న దేశాన్ని దానినుంచి బయటపడేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని, ఆయన నాయకత్వంలో దేశంలో దేశంలో ఆశావహ దృక్పథం తొణికసలాడుతోందని, తాము భారతీయులమని చెప్పుకోవడానికి దేశ ప్రజలు గర్విస్తున్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

Pages