S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/19/2016 - 00:11

అయోధ్య/న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో అయోధ్య అంశం జోలికి పోయేది లేదని బిజెపి వర్గాలు చెబుతున్నప్పటికీ ‘రాముడు చుట్టూనే’ ఎన్నికల వ్యవహారం కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

10/19/2016 - 00:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున కావేరీ జలాలను విడుదల చేయాలని కర్నాటకను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ అంశంపై ఎలాంటి వివాదాలను రెచ్చగొట్టుకోకుండా శాంతి, సామరస్యాలను పాటించాలని రెండు రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

10/19/2016 - 00:08

కొచ్చి, అక్టోబర్ 18: ఇస్లాం సంప్రదాయంలో మూడు తలాఖ్‌ల విధానం ఆ మతంలోని మహిళలకు నష్టం కలిగిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మూడు తలాఖ్‌ల విధానంపై న్యాయ కమిషన్, సుప్రీం కోర్టు ప్రజాభిప్రాయాన్ని కోరిందని ఆయన అన్నారు. మూడు తలాఖ్‌ల విధానం మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకమైందని, ఇది రద్దు కావాలని ఆయన అన్నారు. ‘ఇది ప్రభుత్వ విధానం, ఇందులో ఎలాంటి బేషజాలకు తావులేదు.

10/19/2016 - 00:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఎన్నికల లబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేయడాన్ని దుష్ట సంప్రదాయంగా పేర్కొంటూ దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల చట్టానికి సంబంధించి తాను ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది. ‘హిందుత్వ’ తీర్పుగా అభవర్ణించే ఈ తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది.

10/19/2016 - 00:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: విదేశీ, స్వదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్చంద సేవా సంస్థలు విధిగా ఆస్తులు, వ్యయాల వివరాలు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంస్థలే కాకుండా వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయ, వ్యయాలు వెల్లడించాలని లోక్‌పాల్ చట్టంలో ఉంది. తమ వద్ద ఉన్న నగలు, బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, చేతిలో ఉన్న నగదు, బాండ్ల రూపంలో ఉన్న పెట్టుబడులు, కంపెనీల్లో షేర్లు ప్రభుత్వానికి తెలియజేయాలి.

10/18/2016 - 06:53

భువనేశ్వర్, అక్టోబర్ 17: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. మరో 12మంది తీవ్రంగా ఒళ్లుకాలిన గాయాలతో సమీపంలోని ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

10/18/2016 - 06:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: నాగపూర్-సికింద్రాబాద్ రైల్వే కారిడార్ వేగం పెంచేందుకు గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు భారత రైల్వే రష్యా రైల్వేతో ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. భారత రైల్వే సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది.

10/18/2016 - 08:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: వచ్చే జనవరి 3 నుంచి 7వ తేదీవరకు తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఏర్పాట్లుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రణాళిక, వసతి, భద్రతాలపై ఈ సమావేశంలో చర్చించారు.

10/18/2016 - 06:16

చండీగఢ్, అక్టోబర్ 17: పాకిస్తాన్ యంత్రాంగం అంతా భారత్‌లో ఉగ్రవాదాన్ని రగుల్కొల్పడానికి కృషి చేస్తోందని, అందువల్ల భారత్-పాక్ సరిహద్దుల నిర్వహణ పెద్దసవాలుగా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే పాములను పెంచి పోషిస్తున్న వారు అవి తమనూ కరుస్తాయని గ్రహించాలని ఆయన పరోక్షంగా ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా ఉన్న పాకిస్తాన్‌ను హెచ్చరించారు.

10/18/2016 - 05:25

బెనాలిమ్ (గోవా), అక్టోబర్ 17: అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్రమైన తీర్మానాన్ని (సిసిఐటి) ఐక్యరాజ్యసమితి వీలైనంత త్వరగా ఆమోదించేందుకు భారత్, బ్రెజిల్ కలిసి పనిచేయాలని తీర్మానించాయి. సోమవారం బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమెర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు సుహృద్భావంగా జరిగాయి. అణు ఇంధన సరఫరా దేశాల గ్రూపులో భారత్ సభ్యత్వానికి బ్రెజిల్ మద్దతును ప్రకటించింది.

Pages