S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/15/2016 - 07:41

జోధ్‌పూర్, అక్టోబర్ 14: ఈ ఫోటోలోని మహిళను చూసిన ఎవరైనా ఆమె రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతానికి చెందిన అత్యంత భయానక డ్రగ్ స్మగ్లర్లలో ఒకరని చెప్పలేరు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సుంతా బిష్ణోయ్ అనే ఈ మహిళకు సంబంధించిన వివరాలు, రాష్ట్రంలో డ్రగ్ రాకెట్‌ను ఎలా నడిపేదనే వాటికి సంబంధించిన ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి.

10/15/2016 - 07:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత దేశాన్ని సహనశీలతకు విశ్వవిద్యాలయంగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనివర్ణిస్తూ, దేశంలో మత హింసను ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేశారు.‘శాంతియుత సహజీవనానికి సహన శీలత ముఖ్యం. భారత దేశంలో అన్ని మతాలకు చెందిన వారు వివక్ష భయం లేకుండా శాంతియుతంగా జీవించడమే కాకుండా తమ మతాలను అచరిస్తున్నారు.

10/15/2016 - 07:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ముస్లిం లా బోర్డు ప్రధాని నరేంద్రమోదీని నియంతలా చిత్రీకరించడం తగదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టి ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని లా బోర్డు చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

10/15/2016 - 07:33

రత్లాం, అక్టోబర్ 14: మధ్యప్రదేశ్‌లో ఓ ప్రైవేటు బస్సు భారీ నీటిగుంతలో పడిపోవడంతో 17మం ది దుర్మరణం చెందారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రత్లాం నుంచి జోరాకు వెళుతున్న ఈ బస్సు డ్రైవర్ అదుపుకోల్పోవడంతో రో డ్డు పక్కన వున్న భారీ నీటి గుంతలో పడిపోయింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మట్టిని తవ్వడంతో ఏర్పడిన ఈ పెద్ద గొయ్యి వర్షపు నీటితో నిండిపోయింది.

10/15/2016 - 07:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ ముఖ్యమంత్రి అభ్యర్థికాదంటూ శుక్రవారం సంచలన వ్యాఖ్య లు చేశారు.

10/15/2016 - 07:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఆమె కుమారుడు సైన్యంలో కెప్టెన్. ఆపరేషన్ రక్షక్‌లో అసువులు బాశాడు. అతని మరణానంతరం కేంద్రం శౌర్యచక్రను, జమ్మూ ప్రభుత్వం సాహస అవార్డును ప్రకటించాయి. అయితే, అవి చోరీకి గురికావడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు తిరిగినా పోలీసులు స్పందించలేదనీ, వాటిని వెతికిపెట్టాలంటే లంచం డిమాండ్ చేశారని ఆమె వాపోయింది.

10/15/2016 - 07:28

ఇస్లామాబాద్, అక్టోబర్ 14: భారత్‌తో దౌత్యపరంగా ఎలాంటి తెరచాటు చర్చలు జరగడం లేదని పాకిస్తాన్ తెలిపింది. ఇరు దేశాల మధ్య సమగ్ర చర్చల ప్రక్రియ ఇంకా నిలిచిపోయే ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాదారు (విదేశాంగ వ్యవహారాలు) సర్తాజ్ అజీజ్ శుక్రవారం ఎక్స్‌ప్రెస్ న్యూస్ చానల్‌కు చెప్పారు. భారత్ ఎల్లవేళలా ఎలాంటి ఆధారాలు లేకుండా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ నిందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

10/15/2016 - 06:37

న్యూఢిల్లీ, అక్టోబరు 14: మైసూర్-బెంగళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మార్గంపై అధ్యయనాన్ని విజయవాడ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు జర్మనీ రవాణ మంత్రి అలెగ్జాండర్ డాబ్రింట్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రైల్ భవన్‌లో ఉభయ దేశాల మంత్రులు సమావేశమయ్యారు. భారత్‌లో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి.

10/15/2016 - 06:35

బెనౌలిం (గోవా), అక్టోబర్ 14: ఉగ్రవాదమే విధానంగా పెట్టుకున్న పాకిస్తాన్‌ను మరింతగా ఏకాకిని చేసే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేస్తోంది. ఉరీ దాడి నేపథ్యంలో సార్క్ దేశాల నుంచి పూర్తిస్థాయి మద్దతు పొందిన భారత్ ఇప్పుడు బ్రిక్స్ సదస్సు వేదికగా పాక్ ఉగ్ర ధోరణిని తీవ్రస్థాయిలో ఎండగట్ట బోతోంది.

10/15/2016 - 06:48

శ్రీనగర్, అక్టోబర్ 14: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. ఓ పక్క విస్తృత స్థాయిలో సైనిక నిఘా, నియంత్రణలు కొనసాగుతున్నప్పటికీ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సైనిక కాన్వాయ్‌పై విరుచుకు పడ్డారు. ఈ దాడిలో ఓ జవాన్ మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని జకూరా ప్రాంతంలో ఈ మెరుపుదాడి జరిగింది.

Pages