S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/18/2016 - 05:21

చెన్నై, అక్టోబర్ 17: కావేరీ నిర్వహణ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో డిఎంకెసహా ప్రతిపక్ష పార్టీలు సోమవారం విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైలు మార్గాలను దిగ్బంధించారు. ప్రతిపక్ష పార్టీలతోపాటు రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావేరీ డెల్టా జిల్లాలు సహా అన్నిచోట్లా తీవ్రస్థాయిలోనే ప్రదర్శనలు జరిగాయి.

10/18/2016 - 05:20

అహ్మదాబాద్, అక్టోబర్ 17: పాక్ అక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్ చేయటంపై రక్షణమంత్రి మనోహర్ పారికర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ సైన్యం నిరంతరం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, భారత సైన్యం దీటుగా వాటికి జవాబిస్తోందని ఆయన అన్నారు. ‘‘గత అయిదారేళ్లుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. మీరు లెక్కలు చూడవచ్చు.

10/18/2016 - 05:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అఖిల భారత వాణిజ్య పన్నుల శాఖ అధికారుల, ఉద్యోగుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

10/18/2016 - 05:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పునాదులు కదిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, శాసన సభ్యురాలు రీటా బహుగుణ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు రావటంతో రాష్ట్ర కాంగ్రెస్ గందరగోళంలో పడింది.

10/18/2016 - 05:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కావేరీ జలాల పంపిణీ విషయంలో దీర్ఘకాలంగా అమలవుతున్న అశాస్ర్తియ, కాలంచెల్లిన విధానాలకు స్వస్తిచెప్పాలని సుప్రీం కోర్టు నియమించిన సాంకేతిక కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ తాజా సూచన ద్వారా తమిళనాడు, కర్నాటకల మధ్య తలెత్తిన జల వివాదానానికి ఓ పరిష్కారాన్ని సూచించే ప్రయత్నం చేసింది.

10/17/2016 - 03:15

చెన్నై, అక్టోబర్ 16: దాదాపు ఇరవై రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సూపర్‌స్టార్ రజినీకాంత్, ఆయన కుమార్తె సౌందర్య ఆదివారం సాయంత్రం చెన్నై అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. సాయంత్రం 6.15గంటల నుంచి దాదాపు 25 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఆయన ఉన్నారు. జయ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

10/17/2016 - 03:13

న్యూఢిల్లీ, అక్టోబరు 16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి భూమి పిచ్చిపట్టిందని, 13 జిల్లాలలో ఆయన భూములను తీసుకొంటున్నారని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ట విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల భూమిని సేకరించి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

10/17/2016 - 02:48

రాజ్‌గిర్, అక్టోబర్ 16: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యునైటెడ్ జనతాదళ్ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. జాతీయ రాజకీయాల్లో కాలక పాత్ర పోషించటానికి ఆయనకు మరింత అవకాశమిచ్చినట్లయింది. జెడియు జాతీయ మండలి పార్టీ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ పేరును ఆదివారం ఆమోదించింది. నలందా జిల్లాలో జరిగిన నేషనల్ కౌన్సిల్ సమావేశంలో నితీశ్ కుమార్ ఒక్కరి పేరే ప్రతిపాదించటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

10/17/2016 - 02:43

జమ్ము, అక్టోబర్ 16: జమ్ము కాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల పరంపర ఆగటం లేదు. రాజోరీ జిల్లాలో ఆదివారం పాకిస్తాన్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరిపిన కాల్పుల్లో భారత జవాను ఒకరు వీరమరణం పొందారు. గోవాలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో రష్యా, చైనా దేశాధినేతలు భారత్‌లో చర్చలు జరుపుతున్న సమయంలోనే పాక్ దుందుడుకుగా వ్యవహరించటం గమనార్హం.

10/17/2016 - 02:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: సాధారణ రంగంలోని రెండు కోట్ల మందికి పైగా కార్మికులకు త్వరలో ప్రభుత్వ కార్మిక బీమా సంస్థ (ఇఎస్‌ఐసి) పథకానికి బదులుగా మార్కెట్లో ఉన్న ఇతర ఆరోగ్య బీమా పథకాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం నెలకు 21వేల రూపాయల లోపు స్థూల వేతనం పొందుతున్న కార్మికులకు ఇఎస్‌ఐసి ఆధ్వర్యంలోని ఆరోగ్య బీమా పథకాన్ని తప్పనిసరిగా వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే.

Pages