S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/17/2016 - 02:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఢిల్లీలోని ఓ వ్యాపారి నుంచి రెవిన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ భారీ ఎత్తున బంగారం, నగదు ఆదివారం స్వాధీనం చేసుకుంది. దాదాపు 20.64కిలోల బంగారం, రూ.6.44కోట్ల నగదును డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 995శుద్ధి కలిగిన మార్కు ఉన్న 20 బంగారు కడ్డీలు ఈ వ్యాపారి దగ్గర లభించాయని అధికారులు తెలిపారు. సదరు వ్యాపారిని అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించారు.

10/17/2016 - 02:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు మతాన్ని దుర్వినియోగం చేయడం ‘అవినీతి చర్యే’ అవుతుందని స్పష్టం చేస్తూ హిందుత్వంపై రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన తన తీర్పుపై మళ్లీ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది. ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించాలని 2014 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే.

10/17/2016 - 02:17

బెనౌలిమ్ (గోవా), అక్టోబర్ 16: భారత్‌తో సుమారు 60 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్న రష్యా ఐదోతరం యుద్ధ విమానాలపై (ఎఫ్‌జిఎఫ్‌ఏ) మరో ఒప్పందం ఈ ఏడాది చివరినాటికల్లా కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘మా వైపునుంచి ఈ ఒప్పందం పూర్తయింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇక భారత్ వంతే మిగిలి ఉంది. కొన్ని లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉంది.

10/17/2016 - 02:03

నోయిడా, అక్టోబర్ 16: దేశ రాజధాని ఢిల్లీలో భారీ దాడి జరపడానికి నక్సలైట్లు పన్నిన కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. దాడికి పాల్పడాలని ప్రణాళిక రచించుకున్న నక్సలైట్లలో పది మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక ఏరియా కమాండర్ కూడా ఉన్నాడు. వారినుంచి పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

10/17/2016 - 02:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: వివిధ మతాలకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు (పర్సనల్ లా) రాజ్యాంగానికి లోబడి ఉండాలనేది, లింగ సమానత్వం సూత్రానికి, గౌరవప్రదంగా జీవించే హక్కుకు అనుగుణంగా ఉండాలనేది ప్రభుత్వ స్పష్టమైన దృక్పథమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

10/17/2016 - 02:01

బెంగళూరు, అక్టోబర్ 16: బెంగళూరు నగరం నడిబొడ్డులో ఆదివారం ఉదయం బిజెపి నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. 35 ఏళ్ల రుద్రేశ్ ఆర్‌ఎస్‌ఎస్ శివాజీనగర్ శాఖ అధ్యక్షుడిగా, అదే ఏరియా బిజెపి కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

10/17/2016 - 02:00

సూరత్ (గుజరాత్), అక్టోబర్ 16: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ గుజరాత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాబ్ సింగ్ యాదవ్‌ను ఆదివారం ఇక్కడ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గులాబ్ సింగ్ అనుచరులు బెదిరించి డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై నమోదయిన కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే అంతకుముందే ఎమెల్యే స్థానిక పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

10/16/2016 - 07:34

పనాజీ, అక్టోబర్ 15: భారత్ చైనాల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం రెండూ ఒకటి కావలసిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో మోదీ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవా వచ్చిన జిన్‌పింగ్‌తో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

10/16/2016 - 07:31

చందౌలి (యూపీ), అక్టోబర్ 15: ఇరుకైన వంతెన... వేలాదిగా తరలివచ్చిన భక్తులు... ఇంతలోనే వంతెన కూలిపోయిందన్న వదంతులు... ఎవరికి వారు ప్రాణాలు దక్కించుకునేందుకు తోపులాట... ఇంకేముంది... తొక్కిసలాట మొదలైంది. ఫలితం... ఇరవై నాలుగు మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయ... ఎంతో ప్రశాంతతకు నిలయమైన ఆ ప్రాంతం శ్మశాన వాటికను తలపించింది. చిందరవందరగా పడిన వస్తువులు, చెప్పులు... ఆ మధ్యలో మృతదేహాలు...

10/16/2016 - 07:29

రామేశ్వరం, అక్టోబర్ 15: దివంగత మాజీ రాష్టప్రతి, ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ అబ్దుల్ కలాం స్మారక స్థూపానికి ఆయన స్వస్థలమైన రామేశ్వరం సమీపంలోని పీకారుంబు వద్ద శంకుస్థాపన జరిగింది. శనివారం కలాం 85వ జయంతి సందర్భంగా ఆయన సోదరుడు ముత్తుమీరన్ మరైకయర్ ఈ స్మారక స్థూపానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, కలాం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Pages