S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/15/2016 - 06:33

భోపాల్, అక్టోబర్ 14:సమయాన్ని బట్టి అమితమైన శౌర్య సాహసాలను ప్రదర్శించడమే తప్ప భారత సైన్యం మాట్లాడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనికులు జరిపిన లక్షిత దాడిని ప్రస్తావించిన మోదీ ‘మెలకువగా ఉండాల్సిన సమయంలో దేశం నిద్రిస్తూంటే సైనికులు క్షమించరు’అని పేర్కొన్నారు.

10/14/2016 - 04:06

ముంబై, అక్టోబర్ 13: ముంబైలో గురువారం దారుణం చోటుచేసుకుంది. అయిదంతస్థుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు మైనర్లు మరణించారు. బాంద్రా సబర్బన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. మరో అయిదుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.

10/14/2016 - 02:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ హవా కొనసాగుతుందని ఇండియాటుడే-యాక్సిస్ ముందస్తు ఎన్నికల సర్వే అంచనా వేసింది. 403 స్థానాలున్న యూపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 170 నుంచి 183 స్థానాలు గెలుచుకోవచ్చని పేర్కొంది. అంటే సాధారణ మెజారిటీకి 19 నుంచి 29 స్థానాలు మాత్రమే తక్కువ అవుతాయి.

10/14/2016 - 02:03

నౌషేరా(జమ్మూ, కాశ్మీర్), అక్టోబర్ 13: పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లు సరిహద్దుల్లో ఆర్మీ కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్‌ద్వారా పలు మందుపాతర పేలుళ్లు జరిపిన తర్వాత భారత సైన్యం ఇప్పుడు జమ్మూ, కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వద్ద గస్తీ నిర్వహించే సమయంలో రక్షణ కోసం మొబైల్ జామర్లను తమ వెంట తీసుకెళ్తున్నారు.

10/14/2016 - 02:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16నుంచి నెల రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం నిర్వహించిన లక్షిత దాడులు సమావేశాలలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

10/14/2016 - 03:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: నియంత్రణ రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు జరిపినట్లు భారత ప్రభుత్వం చెప్పుకోవడాన్ని మన దేశంలో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కొట్టి పారేస్తూ భారత్ గనుక సర్జికల్ దాడులు జరిపి ఉంటే పాక్ వెంటనే ఆ దాడులను తిప్పికొట్టి ఉండేదని అన్నారు.

10/14/2016 - 01:24

చెన్నై, అక్టోబర్ 13: అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారాలను ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై వస్తున్న విమర్శలను అధికార అన్నాడిఎంకె తోసిపుచ్చింది. దీనిపై ప్రతిపక్ష డిఎంకె చేస్తున్న ఆరోపణలు అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి గురువారం ఇక్కడ ఖండించారు. ‘సిఎం జయలలిత కోలుకుంటున్నారు. ఆమె రోజూ దినపత్రికలు చదువుతున్నారు’ అని ఆమె వెల్లడించారు.

10/14/2016 - 01:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్)ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లామిక్ చట్టాన్ని రద్దుచేసి దానిస్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి, దేశంలో విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడింది.

10/14/2016 - 01:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: భారత జవాన్లకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ఇవ్వటానికి సిద్ధమవుతోంది. పండుగ నాటికి కనీసం పది శాతం ఏడో వేతన సంఘం సిఫార్సుల బకాయిలు చెల్లించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ వార్త ప్రకారం అక్టోబర్ 30 నాటికి సైనికులు మధ్యంతరంగా పదిశాతం బకాయిలను పొందుతారు.

10/14/2016 - 01:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఎంత ఘోరమైన నేరాలకు పాల్పడినప్పటికీ బాలల హక్కుల విషయంలో ఏమాత్రం రాజీ పడడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక హత్య కేసు విషయంలో సెషన్స్ కోర్టు వ్యవహరించిన తీరు పట్ల, కోర్టు ఉదాసీనత కారణంగా ఒక బాల నేరస్థుడు తొమ్మిదేళ్లపాటు జైల్లో గడపాల్సి రావడంపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Pages