S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/14/2016 - 01:16

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశవ్యాప్తంగా క్రీడల కోటాలో ఇఎస్‌ఐలో ఉద్యోగాలు పొందిన 135 మందికి నియామక పత్రాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అందజేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయతోపాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఎంపీ మీనాక్షి లేఖి పాల్గొన్నారు.

10/13/2016 - 06:58

ధర్మచక్ర పరివర్తన్ దివస్ సందర్భగా మంగళవారం నాగపూర్‌లోని దీక్షాభూమిలో
నిర్వహించిన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన బౌద్ధులు

10/13/2016 - 06:49

ఇస్లామాబాద్, అక్టోబర్ 12: దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)పై భారత ప్రభావాన్ని నిలువరించేందుకు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చైనా, ఇరాన్‌తో పాటు పొరుగున వున్న మధ్య ఆసియా రిపబ్లిక్‌లను కూడా కలుపుకుని విస్తృత స్థాయిలో దక్షిణాసియా ఆర్థిక కూటమిని ఏర్పాటుచేసే అవకాశాలపై దృష్టి పెట్టింది.

10/13/2016 - 06:48

అహ్మదాబాద్, అక్టోబర్ 12: గుజరాత్‌లో దాదాపు 300మంది దళితులు బుధవారం బౌద్ధమతం స్వీకరించారు. మూడు వేర్వేరు కార్యక్రమాల్లో ఈ మార్పిళ్లు జరిగాయి. ప్రతి విజయదశమి నాడు బౌద్ధమతంలోకి మారడం మామూలేనని, అయితే ఈ సంవత్సరం ఈ మతంలోకి మారిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ‘‘అహ్మదాబాద్‌లోని దానీ లిండా ప్రాంతంలో గుజరాత్ బౌద్ధ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 140మంది మతం మార్చుకున్నారు.

10/13/2016 - 06:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: చైనా సహాయం లేకుండా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యుద్ధంలోనూ విజయం సాధించజాలదని బలూచిస్తాన్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు నీలా బలోచ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను అదుపు చేయాలంటే గత నెలలో జరిగినట్లుగా లక్షిత దాడులు పలుమార్లు జరగాల్సిన అవసరముందని బుధవారం నాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.

10/13/2016 - 06:46

ఇస్లామాబాద్, అక్టోబర్ 12: జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబా మిలిటెంట్ మసూద్ అజార్, జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాకిస్తాన్ పత్రిక ‘ది నేషన్’ప్రభుత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని ప్రశ్నించింది. వీరిపై చర్య తీసుకోవడం దేశ భద్రతకు ముప్పా అని కూడా నిలదీసింది.

10/13/2016 - 06:43

ముంబయి, అక్టోబర్ 12: యుపిఏ హయాంలో కూడా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు జరిగాయన్న వాదనను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం నాడిక్కడ తిరస్కరించారు. గత నెలలో ఆక్రమిత కాశ్మీర్‌లోని మిలిటెంట్ స్థావరాలపై జరిగిన సర్జికల్ దాడుల ఘనతలో ప్రధాన భాగం ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని, ఒకరకంగా చెప్పాలంటే భారతీయులందరిది అని ఆయన అన్నారు.

10/13/2016 - 06:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సర్వీసులో ఉన్న కాలంలో అంగవైకల్యానికి గురయితే ఆ ఉద్యోగిని తొలగించడం కాని, హోదాను తగ్గించడం కాని చేయకూడదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్వీసులో ఉన్న కాలంలో అంగవైకల్యానికి గురయిన ఉద్యోగులు సర్వీసులో కొనసాగడానికి లేదా ఇన్‌వాలిడ్ పెన్షన్‌ను పొందడానికి వీలుకల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ..

10/13/2016 - 05:53

చెన్నై, అక్టోబర్ 12: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘సలహా’మేరకే ఆమె నిర్వహిస్తున్న శాఖలను ఆర్థిక మంత్రి ఒ.పన్నీర్ సెల్వంకు బదలాయించినట్లు గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావు చేసిన ప్రకటనపై ప్రతిపక్ష డిఎంకె అధినేత కరుణానిధి విస్మయం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలోనే ఉన్న జయలలిత ఆమోదంతోనే శాఖల మార్పిడి జరిగిందంటూ గవర్నర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.

10/13/2016 - 06:19

లక్నో, అక్టోబర్ 12: గత ఐదు సంవత్సరాలుగా అయోధ్యలోని రామాలయ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా దాటవేస్తూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడి ఐష్‌బాగ్ రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ‘జై శ్రీరామ్’ అనడం సర్వత్రా ఊహాగానాలకు దారితీస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్యే బిజెపి నినాదం కాబోతోందని చెప్పడానికి ఇది సంకేతమన్న కథనాలు వెలువడుతున్నాయి.

Pages