S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/31/2016 - 08:03

న్యూఢిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా జాతియావత్తు ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.

01/31/2016 - 08:01

న్యూఢిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను కేంద్ర మంత్రి ఉమాభారతి పిచ్చివాడిగా అభివర్ణిస్తూ, గాంధీజీ సిద్ధాంతం శాశ్వతమైనదని అన్నారు. శనివారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆమె గంగానది శుద్ధిలో పాలుపంచుకోవాలని నది పరీవాహక ప్రాంతంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేయడమే కాక ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేలా వారిని ఒప్పించడానికి తాను పాదయాత్ర నిర్వహిస్తానని చెప్పారు.

01/31/2016 - 08:00

చెన్నై, జనవరి 30: తమిళనాడులోని ఓ వైద్య కళాశాలలో ముగ్గురు విద్యార్థినుల బలవన్మరణం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బలవంతపు ఫీజుల వసూళ్లకు తట్టుకోలేక ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి జయలలిత ఈ మొత్తం వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు శనివారం ఆదేశించారు. అలాగే యోగా, నేచురోపతి విద్యార్థులను ప్రభుత్వ నిర్వహణలోని కళాశాలకు బదిలీ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.

01/31/2016 - 07:58

కోల్‌కతా, జనవరి 30: దాదాపు రెండున్నరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందుని గ్యాంగ్ రేప్ కేసు నిందితుల్లో ముగ్గురికి మరణ శిక్ష, మరో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక అదనపు సెషన్స్ జడ్జి సంచితా సర్కార్ శనివారం తీర్పు చెప్పారు. అమీనుల్ అలీ, సైఫుల్ అలీ, అన్సార్ అలీలకు మరణ శిక్ష, ఇమానుల్ ఇస్లామ్, అమీనుల్ ఇస్లామ్, భోలా శంకర్‌లకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు జడ్జి తీర్పు చెప్పారు.

01/31/2016 - 07:56

న్యూఢిల్లీ, జనవరి 30: బిజెపిలో అసమ్మతి ఎంపీగా ముద్రపడ్డ బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా మరోసారి మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వివాదం సుప్రీం కోర్టు విచారణలో ఉన్నందున తీర్పు వెలువడే వరకూ ఆగి ఉండాల్సిందని 70ఏళ్ళ బిజెపి ఎంపీ వ్యాఖ్యానించారు.

01/31/2016 - 05:51

న్యూఢిల్లీ/ హైదరాబాద్, జనవరి 30: సైనికదళ మాజీ ప్రధానాధికారి జనరల్ కెవి కృష్ణారావు (92) ఇకలేరు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించేందుకు 1971లో జరిగిన యుద్ధంలో కీలకపాత్ర పోషించిన కృష్ణారావు న్యూఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో శనివారం గుండెపోటుతో కన్నుమూశారు.

01/30/2016 - 20:02

ముంబై : ముంబై నూతన పోలీస్ కమిషనర్‌గా 1982 బ్యాచ్ ఐపిఎస్ అధికారి దత్తాత్రేయ పద్‌సాల్గికర్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న అహ్మద్ జావేద్ ఆదివారంనాడు పదవీవిరమణ చేయనున్నారు. షీనాబోరా హత్య కేసు దర్యాప్తు అర్ధంతరంగా చేపట్టి వివాదంలో ఇరుక్కున్న జావేద్ పదవీ విరమణ అనంతరం సౌదీఆరేబియాలో భారత దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు.

01/30/2016 - 20:02

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చేపట్టిన మహాదీక్షను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధి శనివారం సాయంత్రం విరమించారు. దాదాపు ఎనిమిదిగంటలపాటు ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవిక్ష వ్యతిరేక చట్టం తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.

01/30/2016 - 18:10

కోల్‌కత: యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులకు యావజ్జీవశిక్ష విధించింది. పశ్ఛిమబంగ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసులో తీర్పుపై సానుకూల స్పందన వచ్చింది.

01/30/2016 - 17:04

పూణె: ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఇక్కడ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. పూణెకు చెందిన భారతీయ ఛాత్ర సంసద్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసింది. రైతుల సంక్షేమం, ఐటీ సద్వినియోగంలో ఆయన చేస్తున్న కృషికిగాను ఈ అవార్డును ప్రకటించారు.

Pages