S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/01/2016 - 17:00

కేరళ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రతిష్ఠాత్మక ‘నిషాగాంధీ’ పురస్కారం లభించింది. కేరళ ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ఇస్తున్నట్టు ప్రకటించింది. భారతీయ సినిమాకు ఇళయరాజా చేసిన విశేష సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు కేరళ పర్యాటకశాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 20న జరగనున్న ఉత్సవంలో కేరళ సీఎం వూమెన్‌చాందీ ఈ పురస్కారాన్ని ఇళయరాజాకు ప్రదానం చేయనున్నారు.

01/01/2016 - 16:59

న్యూఢిల్లీ : గ్యాస్‌ వినియోగదారుల సమస్యల నివారణకు అత్యవసర కాల్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 24 గంటల సర్వీసుతో నిర్వహించే ఈ కాల్‌సెంటర్‌ను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు. కాల్‌సెంటర్‌ నంబర్‌: 1906

01/01/2016 - 15:59

న్యూఢిల్లీ : సస్పెన్షన్‌కు గురైన బిజెపి ఎంపి కీర్తీ ఆజాద్‌ను పార్టీనుంచి ఎందుకు వెలివేయకూడదో తెలియజేయాలంటూ నోటీసు జారీ చేసింది. పది రోజులలోగా నోటీసుకు సమాధానం చెప్పాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. కీర్తీ ఆజాద్‌పై స్పెన్షన్‌ వేటు వేసినప్పటికీ ఆయన తన వైఖరి మార్చుకోలేదు. ఢిల్లీ క్రికెట్‌ సంఘం డిడిసిఎ అవినీతిలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రమేయం ఉందంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

01/01/2016 - 15:43

పాట్నా :శాంతి భద్రతలను ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కాపాడలేకపోతున్నారని ఆర్జేడీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్‌సింగ్‌ ఆరోపించారు. ఇంజనీర్లు హత్యకు గురౌతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆ హత్యలకు నితీష్‌ కుమారే బాధ్యత వహించాలని అన్నారు. ఆర్జేడీ ఆరోపణలను జేడీయూ నేతలు తిప్పికొట్టారు. శాంతి భద్రతల విషయంలో ఆర్జేడీ సలహాలు అవసరం లేదని అన్నారు.

01/01/2016 - 15:16

వారణాసి : కొత్త సంవత్సరం సందర్భంగా వారణాసిలో శుక్రవారం ప్రత్యేకంగా గంగా హారతి నిర్వహించారు. ఏడాది తొలిరోజు కావడంతో పుణ్య స్నానాలు చేశారు. మధురలో కృష్ణపరమాత్మునికి 156 టన్నుల లడ్డూ ప్రసాదం అర్పించారు. గంగా హారతితోపాటు యాగాలు చేశారు. గంగానదికి పూజలు చేశారు.

01/01/2016 - 15:14

న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి సంఖ్య కార్యక్రమానికి జనం నుంచి మంచి స్పందన వస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియాతో అన్నారు. ప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారని కేజ్రీవాల్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలు మిగతా దేశానికి ఓ మంచి మార్గం చూపుతారని అన్నారు.

01/01/2016 - 12:14

ఢిల్లీ:్భరతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఈనెల 10 తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌షా పదవీకాలం ఈనెల 23తో ముగుస్తుంది. ఆయనను కొనసాగిస్తారా? లేదా కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి వుంది.

01/01/2016 - 12:13

ఢిల్లీ:నూతన సంవత్సరంలో దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్‌లో పోస్టింగ్ చేశారు.

01/01/2016 - 12:11

శ్రీనగర్:జమ్మూలోని రాంబాణ్ జిల్లా చందర్‌కోటే ప్రాంతంలో కూలీలు ఏర్పాటుచేసుకున్న శిబిరాల్లో అగ్నిప్రమాదం సంభవించి గురువారం అర్థరాత్రి పదిమంది మృత్యువాతపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌నుంచి కూలీపనుల నిమిత్తం వచ్చినవారు ఇక్కడ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసుకుని ఉంటున్నారు.

01/01/2016 - 08:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలో వాహనదారులకు ఓ శుభవార్త. పెట్రోలు, డీజిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు ధర లీటరుకు 63 పైసలు, డీజిలు ధర లీటరుకు రూపాయి ఆరు పైసలు తగ్గాయి. తగ్గిన ధరలు గురువారం అర్ధరాత్రినుంచి అమలులోకి వచ్చాయి.

Pages