S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/06/2018 - 17:11

కర్ణాటక: ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు నైతిక విజయంగా ముఖ్యమంత్రి కుమారస్వామి అభివర్ణించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోకసభ ఎన్నికల్లో 28 లోకసభ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. ఈ విజయంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అపవిత్ర కూటమి అంటూ బీజేపీ చేసిన ప్రచారం గాలిలో కొట్టుకుపోయిందని అన్నారు.

11/06/2018 - 17:12

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగిపోయారు. బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వివేకానంద సిన్హా, ఎస్పీ జితేంద్ర శుక్లా సమక్షంలో దాదాపు 62 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 51 మంది ఆయుధాలతో సహా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

11/06/2018 - 13:46

కర్ణాటక: కర్ణాటకలో కాంగ్రెస్ జేడీయూ కూటమి నాలుగు చోట్ల గెలిచారు. శివమొగ్గ లోకసభ స్థానంలో యెడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర 50 వేల మెజార్టీతో గెలిచారు. మొత్తం మూడు లోకసభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన నాలుగు స్థానాలను కాంగ్రెస్-జేడీఎస్ విజయం సాధించాయి.

11/06/2018 - 13:45

కర్ణాటక: కర్ణాటకలోని బళ్లారిలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శాంతాపై భారీ మెజార్టీతో గెలిచారు. బళ్లారి నియోజకవర్గం గాలి జనార్థన్‌రెడ్డి సోదరులకు మంచి పట్టు ఉన్న ప్రాంతం. ఉగ్రప్ప రెండు లక్షల మెజార్టీతో గెలుపొందటం గమనార్హం.

11/06/2018 - 13:05

కేరళ: కేరళలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నెహ్రు ట్రోఫీ బోటు రేసు పోటీలకు ముఖ్యఅతిథిగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి అర్జున్‌కు ఆహ్వానం అందింది. అలప్పుజ ప్రాంతంలో పునమ్‌ద సరస్సులో ఈ పోటీలు 10వ తేదీన నిర్వహించనున్నారు. కేరళలో అల్లు అర్జున్ అభిమానులకు ఎంతో క్రేజీ ఉంది.

11/06/2018 - 12:34

మధుర: ప్రముఖ భజన గాయకుడు వినోద్ అగర్వాల్ కన్నుమూశారు. వృందావనంలో జన్మించిన ఆయన తన 12 ఏట నుంచి భజన గీతాలు పాడటం ఆరంభించారు. దేశ విదేశాల్లోనూ ఆయన రాధాకృష్ణులుపై పాడిన భజన గీతాలు ప్రసిద్ధిచెందాయి. ఆయన వయసు 63 సంవత్సరాలు.

11/06/2018 - 12:31

కేరళ: శబరిమలలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అయప్పస్వామిని దర్శించుకుంటున్నారు. అయ్యప్పస్వామికి శ్రీచిత్రి తిరునాళ్లను ఘనంగా నిర్వహించారు. భక్తులు పంపానదిలో స్నానమాచరించి ఇరుముళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా యాభై సంవత్సరాల లోపు మహిళ ఆలయంలోకి ప్రవేశిస్తుందని అపోహపడిన కొందరు భక్తులు ఆమెను అడ్డుకున్నారు.

11/06/2018 - 12:30

కర్ణాటక: కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి విజయకేతనం ఎగురవేసింది. బీజీపీ ఒక్క స్థానంలో ఆధిక్యతలో ఉంది. కాగా మూడు లోకసభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యతలో కొనసాగుతు విజయాన్ని సొంతం చేసుకోనున్నారు. మాండ్య లోకసభ అభ్యర్థి శివరామ గౌడ సమీప బీజేపీ అభ్యర్థి సిద్ధరామయ్యపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11/06/2018 - 05:14

జైపూర్: రాఫెల్ వ్యవహారంపై బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. ఈ అంశాన్ని రాజకీయ ఐటమ్‌గా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో సోమవారం ఈ వివాదాన్ని కొత్తమలుపు తిప్పింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితుడైన దళారి సంజయ్ భండారిని తొలగించడం వల్లే కాంగ్రెస్ పార్టీ కకావికలమైందని అందుకే ఈ అంశాన్ని పట్టుకుని వేళ్లాడుతోందని కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ అన్నారు.

11/06/2018 - 01:55

తిరువనంతపురం, నవంబర్ 5:అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల ఆలయాన్ని ప్రత్యేక పూజల నిమిత్తం సోమవారం తెరిచారు. మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత ఈ ఆలయ ద్వారాలు తెరుచుకోవడం ఇది రెండోసారి. మొదటి సారి మహిళలు పెద్ద ఎత్తున అయప్ప ఆలయ దర్శనానికి రావడం, ఆలయ నిర్వాహకులు నిరోధించడంతో తీవ్రస్థాయి ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

Pages