S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలి

శ్రీకాకుళం, డిసెంబర్ 9: ప్రజాస్వామ్యవ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియలో కచ్చితమైన ఓటర్ల జాబితా తయారీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు ఐ.శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశమందిరంలో 2017 స్పెషల్ సమ్మరీ రివిజన్‌పై నిర్వహించిన సమావేశానికి ఆయన విచ్చేసారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే నిమిత్తం ముందుగా ఓటరుగా నమోదు కావాలన్నారు.

బంగారం కొనుగోళ్లపై ఐటి దృష్టి!

కర్నూలు, డిసెంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత నల్ల కుబేరులు కొనుగోలు చేసిన బంగారంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున బంగారు అమ్మకాలు జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐటి అధికారులు ఆ వివరాలపై మరింత కూపీ లాగుతున్నట్లు సమాచారం. నవంబర్ 9వ తేదీ నుంచి జరిగిన బంగారు లావాదేవీలను పరిశీలించగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.

స్టాక్ పాయింట్ అక్రమాల పుట్ట!

ఆదోని, డిసెంబర్ 9: ప్రజలకు చౌక దుకాణాల ద్వారా అందజేసే నిత్యావసర వస్తువుల స్టాక్‌పాయింట్ అక్రమల పుట్ట అంటూ ఎన్నో సార్లు ఆంధ్రభూమి స్టాక్‌పాయింట్‌లో జరిగే అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిం ది. అయితే ఎట్టకేలకు ఆలస్యంగానైన ఆదోని స్టాక్‌పాయింట్‌పైన విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న 99 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చివరకు అక్రమార్కులపై కేసు లు పెట్టారు. అక్రమార్కులు కటకటలాపాలయ్యారు. ఈ విధంగా స్టాక్ పాయింట్‌కు వచ్చిన అధికారి ఆధ్వర్యంలో గత మూడేళ్ల నుంచి అక్రమా లు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోదాం ఇన్‌ఛార్జి అధికారి నేతలకు నెలకు రూ.

అవినీతి మహమ్మారిని నియంత్రించాలి

కర్నూలు, డిసెంబర్ 9:మానవ జీవితంతో పెనవేసుకుపోయిన అవినీతి మహమ్మారిని పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని కలెక్టర్ విజయమోహన్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ అవినీతి అనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకత్తించే అంశమన్నారు. చరిత్రలో పురాతన కాలం నుంచి అవినీతి మనిషితో పాటు సహజీవనం చేస్తూ వచ్చిందని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.

వైఎస్ పాలన స్వర్ణయుగం

కర్నూలుసిటీ, డిసెంబర్ 9:ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పాలన స్వర్ణయుగం లాగా నడిచిందని, అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య విమర్శించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ముస్లింల కోసం 4శాతం రిజర్వేషన్, తదితర ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అయితే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.

ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా బాబు పాలన

కర్నూలుసిటీ, డిసెంబర్ 9:గత కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పతనమైన ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించటమే లక్ష్యంగా సిఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమిశెట్టి శుక్రవారం తన ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్ చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేయడం తగదన్నారు. తన తండ్రి వైఎస్ హయాంలో ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాసి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

నగదు కోసం రోడ్డుపై బైఠాయింపు

బేతంచెర్ల, డిసెంబర్ 9:నగదు కోసం బ్యాంకుకు వెళ్లగా అక్కడ నో క్యాష్ బోర్డు దర్శనం ఇవ్వడంతో ఆగ్రహించిన ఖాతాదారులు శుక్రవారం పట్టణంలోని ఎస్‌బిఐ శాఖ ముందు నగదు కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పారిశ్రామిక కేంద్రమైన బేతంచెర్లతో పాటు ఆర్‌ఎస్ రంగాపురం ఎస్‌బిఐ శాఖల్లో పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఖాతాదారులకు సక్రమంగా నగదు అందలేదు. దీంతో ఖాతాదారులు శుక్రవారం ఎస్‌బిఐ శాఖల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిరుపాలు, బేతంచెర్ల ఎస్‌బిఐ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని చర్చించారు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.

మంగంపేట నిర్వాసితులకు మహర్దశ.!

కడప,డిసెంబర్ 9: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అత్యంత విలువైన బేరియం ఖనిజసంపద రైల్వేకోడూరు మంగంపేట గనుల్లో లభ్యవౌతుండటంతో ఏపిఎండిసిచే గనుల నిర్వాసిత ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాల్సివుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధిసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకయ్య చౌదరి గనుల ప్రాంతంలోని నిర్వాసితుల ప్రాంతాలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి ఏటా రూ.8కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.

నగదురహిత గ్రామంగా యామవరం

ముద్దనూరు, డిసెంబర్ 9: జిల్లాలోనే మొదటిసారిగా సిండికేట్‌బ్యాంక్ దత్తత తీసుకున్న యామవరం గ్రామాన్ని బ్యాంక్ ఆధ్వర్యంలో నగదురహిత గ్రామంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేయడం జరిగిందని కలెక్టర్ కెవి.సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిధిలోని యామవరం గ్రామంలో శుక్రవారం సిండికేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న నగదురహిత లావాదేవీలపై నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమన్నారు.

ఎర్రచందనాన్ని పరిరక్షించాలి

చింతకొమ్మదినె్న,డిసెంబర్ 9: అడవులను పరిరక్షించితే వాతావరణ కాలుష్యనివారణతోపాటు వర్షాలు సకాలంలో కురుస్తాయని ,అడవుల్లోని ఎర్రచందనాన్ని పరిరక్షించాలని అటవీ టాస్క్ఫోర్స్ సిబ్బంది పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇప్పెంట పంచాయతీ వెంకట్రామ్‌పల్లెలో ఎర్రచందనం పరిరక్షణపై అవగాహన సదస్సులు ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా అటవీటాస్క్ఫోర్స్ సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఓ జివి రమణారెడ్డి ఆధ్వర్యంలో వనచైతన్యయాత్రలు నిర్వహించారు.

Pages