S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబేద్కర్ ఆశయాలను విస్మరించిన కాంగ్రెస్

మెదక్, డిసెంబర్ 9: డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జికెఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా దేశంలో ప్రతి ఒక్కరు సమానులుగా ఉండాలనే భావనతో పద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆనాడే పెద్దనోట్లను రద్దు చేయాలని పార్లమెంట్‌లో తీర్మానించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు.

అవినీతి రహిత సమాజం అందరి బాధ్యత

నల్లగొండ, డిసెంబర్ 9: ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుందని ఇందుకు ప్రజలంతా బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్ భవన్‌లో జిల్లా అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన అవినీతి నిరోధక దినోత్సవ సదస్సును ఆయన ప్రారంభించి ప్రజలు, అధికారులు, విద్యార్థులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు దేశంలో అవినీతి వ్రేళ్లూనుకుపోయిందని అవినీతి నిర్మూలన ప్రభుత్వంతో మాత్రమే సాధ్యంకాదని ప్రజలంతా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.

ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం దీక్ష

కనగల్, డిసెంబర్ 9: పెండింగ్ ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, కెజి టూ పిజి ఉచిత విద్య హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ఒక్కరోజు దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో బిజెపి జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహ్మారెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధి సంఘం జిల్లాఅధ్యక్షులు ఏర్పూల శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్ధి అమరుల త్యాగాల పునాధుల మీద అధికారంలోకి వచ్చిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం నేడు విద్యార్ధులను చదువులకు దూరం చేసే విధంగా ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయడంలేదని దుయ్యబట్టారు.

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

మునుగోడు/నల్లగొండ రూరల్, డిసెంబర్ 9: మండలంలోని చల్మేడ గ్రామంలో వివాహిత గంగుల మంజుల(20) శుక్రవారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన గంగుల నర్సింహ్మ యాదవ్, కళమ్మల ఏకైక కుమార్తె మంజులను రెండున్నర ఏళ్ల క్రితం మునుగోడు మండలం చల్మెడ గ్రామానికి చెందిన గుండెబోయిన మల్లేష్‌తో వివాహాం జరిపించారు. మల్లేష్-మంజూల దంపతులకు 14నెలల కుమారుడు ఉన్నాడు. ఇటీవల కట్నం కోసం తరుచూ గొడవలు జరుగుతున్నాయని, శుక్రవారం కూడ గొడవ జరిగిందని తమ తల్లిదండ్రులకు కూతురు మంజుల తెలిపింది.

సాగర్ పునాదిరాయికి 62 ఏళ్లు

నాగార్జునసాగర్, డిసెంబర్ 9: బహుళార్ధసాధక ప్రాజెక్టు, తెలంగాణ, ఆంధ్రా తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పునాదిరాయికి నేటితో 61ఏండ్లు నిండి 62వ ఏండ్లు ప్రారంభమయ్యాయి. ఆనాడు భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రు తన కలలను నిజం చేస్తూ కోట్లాది మంది ప్రజల జీవనాధారంగా 1955డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌కాలనీలో పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇక్కడి జరిపే శంకుస్తాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికి శంకుస్థాపన అని, శంకుస్థాపనకు పవిత్రకార్యంగా అనుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

24 వేల లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యంతో.. గోదాముల నిర్మాణం

నేరేడుచర్ల, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 24వేల లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామియేలు తెలిపారు. ఆయన శుక్రవారం నేరేడుచర్లలో నిర్వహించిన మాదిగల అలాయ్‌బలాయ్ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, పాల్వంచ, జగిత్యాల, కొత్తగూడెంలలో నూతన గోదాములు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

నగదు రహిత విధానానికి ప్రోత్సాహం

నల్లగొండ టౌన్, డిసెంబర్ 9: గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన నగదు రహిత కార్యక్రమం నోడల్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీల విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. ప్రణాళిక అంశాల మేరకు బ్యాంకర్లు, అధికారులు గ్రామాలను సందర్శించి ఖాతాలు లేనివారితో బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. ప్రతి ఖాతాదారునికి ఏటిఎం, డెబిట్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతీ, యువకులకు మొబైల్ లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలన్నారు.

డబుల్ బెడ్‌రూం పథకానికి నిధుల కొరత లేదు

నల్లగొండ, డిసెంబర్ 9: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర హౌజింగ్ ముఖ్య కార్యదర్శి చిత్రరామచంద్రన్ స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయా జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం పథకం పురోగతిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం 213 కోట్ల ప్లాన్ బడ్జెట్ మంజూరు చేసినందున హడ్కో నుండి 282 కోట్ల రుణం పొందామని ఈ మొత్తం ఖర్చు చేస్తే మరో 900 కోట్ల రుణం మంజూరు కానుందన్నారు. డబుల్ బెడ్‌రూంల నిర్మాణ ప్రగతి నివేదిక అందించిన వెంటనే జిల్లా కలెక్టర్లు నిధులను బదిలీ చేయడం జరుగుతుందని తెలిపారు.

పచ్చని చెట్లకు నేస్తాలు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అందరం చెబుతాం. కాని ఆచరణలో పెట్టేది కొందరే. ఇల్లు కట్టాలన్నా.. ఏ చిన్న ఊరేగింపు కోసమైనా పచ్చని చెట్లను నరికేస్తుంటాం. ఇటీవలనే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కొన్ని రోజులు పాటు స్కూళ్లు సైతం మూతపడ్డాయి. అయినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోం. ప్రకృతిని ప్రేమిస్తే అది పదికాలాలపాటు మనల్ని చల్లగా చూస్తుందని బీహార్‌లోని మధుబనీ జిల్లా మహిళలు, బాలికలు నమ్మారు. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని విశ్వసించిన ఈ జిల్లా మహిళలు, బాలికలు చెట్లపై అక్కడి సంప్రదాయబద్దమైన మధుబని పెయింటింగ్స్ వేస్తుంటారు.

ఐశ్వర్యానందం

చిన్ననాటి నేస్తాలను, గురువులను చూస్తే ఎవరికైనా ఆనందం వెల్లివిరుస్తుంది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి ఐశ్వర్యా బచ్చన్ కూడా అలాంటి అనుభూతినే పొందింది. ముంబయిలోని నవోదయ ఇండియా డ్యాన్స్ థియోటర్‌లో ఏర్పాటుచేసిన ప్రపంచ స్థా యి నృత్య సమావేశానికి అతిథిగా ఐశ్వర్యారాయ్‌ను ఆహ్వానించారు. ఇదే సమావేశానికి నిర్వాహకులు ఐశ్వరారాయ్ చిన్ననాటి నృత్య గురువు లతాసురేంద్రను సైతం ఆహ్వానించారు. అక్కడ తన గురువును చూసిన ఈ అందాల సుందరి సంభ్రమాశ్చర్యాలకులోనైంది. గురువును వేదికపైకి తీసుకువచ్చింది.

Pages