S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతాంగానికి ‘నగదు’ కష్టాలు!

ఎర్రగుంట్ల,డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు గ్రామీణ రైతాంగాన్ని కరెన్సీ కష్టాల్లో ముంచింది. పట్టణ ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలతో ఎంతోకొంత నగదు దొరుకుతోంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో రైతు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఆరుగాలం బావుల కింద ఎంతోకొంత పండించుకున్న పంటకు గిట్టుబాటుధరతోపాటు అసలు కొనే నాధుడే లేకపోవడంతో నగదు లావాదేవీలు జరగక నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ పెద్ద రైతు వద్ద ఎంతోకొంత చేతిబదులు తీసుకునే చిన్న, సన్నకారు రైతు పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది.

పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలి

కమలాపురం, డిసెంబర్ 9: గ్రామీణ స్థాయి పాఠశాలల నుంచే విద్యార్థులకు క్రీడలపట్ల మక్కువపెంచి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఈవో ప్రతాపరెడ్డి అన్నారు. ఆయన మండల పరిధిలోని పెద్దచెప్పల్లి బాలుర జడ్పీ హైస్కూల్లో మూడురోజులుగా జరుగుతున్న యర్రగుంట్ల జోనల్‌మీట్ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుఎంత ముఖ్యమో క్రీడలుకూడా అంతే అవసరం అన్నారు. క్రీడల్లో రాణించిన వారు చదువుల్లో కూడా రాణిస్తారని అన్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు.

ఆరోగ్యశ్రీపై కక్షసాధింపులు వద్దు

కడప,డిసెంబర్ 9: ఆరోగ్యమే మహాభాగ్యమన్న నినాదంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఆరోగ్యశ్రీపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పేద ప్రజలకు అన్యాయం చేయడమేనని పలువురు వైకాపా నేతలు తీవ్రంగా విమర్శించారు. పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట వైకాపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది.

నగదు రహిత లావాదేవీలు అలవరచుకోవాలి

నెల్లిమర్ల, డిసెంబర్ 9: ప్రజలు నగదు రహిత లావాదేవీలు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కోరారు. శుక్రవారం మండలంలోని దన్నానపేట గ్రామంలో వెలుగు ఆధ్వర్యంలో నగదు రహిత కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్లర సమస్య తీరాలంటే ఈ విధానాన్ని వినియోగించాలన్నారు. మరుగుదొడ్లను వినియోగించుకోవాలని, ఉపాధి హామీ నిధుల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్ని మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నా నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం ప్రజలు సహకరించాలని కోరారు.

రంగారెడ్డిలో ప్రమాదం.. బలిజపేటలో విషాదం

విజయనగరం, డిసెంబర్ 9: పొట్ట చేతపట్టుకొని కూలీ పనుల కోసం హైదరాబాద్ వెళ్లిన కూలీల బతుకులు చిద్రమయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం పేక మేడలా కుప్పకూలిన సంఘటనలో జిల్లాకు చెందిన తల్లికూతురు మృత్యువాతపడ్డారు. వీరు బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన వారుగా గుర్తించారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

జనవరి నుంచి అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ సిస్టమ్ అమలు

విజయనగరం, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్టీసీలోని అన్ని బస్సులకు అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ సిస్టమ్ విధానాన్ని అమలుచేయనున్నట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఆర్టీసీ వర్క్‌షాపు, బస్సు డిపోలను పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపడుతున్నామన్నారు. సంస్థకు లాభాలు రావాలంటే సిబ్బంది ప్రవర్తనలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీపై రుణభారం రూ.1000 కోట్లు ఉందన్నారు.

అగ్రవర్ణపేదల రిజర్వేషన్లకోసం జాతీయ ఉద్యమం

గజపతినగరం,డిసెంబర్ 9: ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణ పేదలకు విద్య ఉద్యోగ రిజర్వేషన్లను కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ ఉద్యమం నిర్వహిస్తామని ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరవై సంవత్సరాల రిజర్వేషన్ వ్యవస్థ అనంతరం సామాజిక వివక్ష అంతరించి ఆర్థిక వివక్ష కొనసాగుతుందని, ఈనేపద్యంలో సామాజిక మత ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లను రద్దుచేసి ఆర్ధిక వెనుకబాటును పరిగణనలోకి తీసుకుని అగ్రవర్ణ పేదలతోపాటు అన్ని వర్గాల వారికి విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

ఆదాయం పెంచండి.. నష్టాలు తగ్గించండి

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని, తద్వారా నష్టాలను తగ్గించాలని ఆర్టీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్‌డైరెక్టర్ ఎం.మాలకొండయ్య కోరారు. పట్టణంలో జోనల్‌వర్క్స్‌షాపు, ఆర్టీసీ డిపోలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల ఊబిలో ఉన్న సంస్థను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని, అంతర్గత సామర్థ్యం పెంచుకోవాలన్నారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు.

సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిల్ సభ్యులు గతానికి భిన్నంగా అరుపులు, కేకలు లేకుండా అజెండాలో పొందుపర్చిన అంశాలను ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. నెల్లిమర్ల వాటర్‌వర్క్స్‌లో హుదూద్ తుపాన్‌లో నేలకొరిన టేకుచెట్లు గురించి అధికారులు ఇంతవరకు పట్టించుకోక పోవడం దారుణమని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావుఅన్నారు.

భర్త చేతిలో భార్య దారుణ హత్య

బెజ్జూర్, డిసెంబర్ 9: భర్త చేతిలో భార్య దారుణహత్యకు గరైన సంఘటన బెజ్జూర్ మండలంలో శుక్రవారం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధింన వివరాలు కౌటాల సిఐ అచ్చేశ్వర్ రావు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని పాపన్‌పేట గ్రామానికి చెందిన ఉబిడె శకుంతల (28)ను ఆమె భర్త సురేష్ గురువారం రాత్రి గొంతుకోసి హత్యచేసినట్లు సిఐ తెలిపారు. గతేడాది శకుంతల, సురేష్‌లకు బెజ్జూర్ రంగనాయకుల ఆలయంలో ప్రేమవివాహం జరిగింది. వివాహ సమయంలో వరకట్నం క్రింద సురేష్‌కు రూ.2లక్షలను శకుంతల తల్లిదండ్రులు ఇచ్చారు.

Pages