శనివారంపేట కథ
Published Friday, 9 December 2016శనివారం సంత జరిగే ఊరని పొరబాటు పడుతుంటారు విన్నవారు. అది కాదు.
ఆ ఊరి కొండమీద నిలువుగా పాతిపెట్టిన ఎత్తయిన శిల ఉంది. శనిగ్రహ దోషాలున్నవారు ఆ శిలను శనివారంనాడు నువ్వుల నూనెతో అభిషేకిస్తే గ్రహదోషం తొలగిపోతుందని పురాతన కాలంనించీ నమ్మకం ఉంది.
ఆదిమానవుల నివాసాలు ఇక్కడ ఉండేవనీ, మరణించినవారిని పూడ్చిపెట్టి తలవైపున పెద్ద శిలను స్థాపించేవారని- ఈ శిల అటువంటిదేనని కొందరి అభిప్రాయం.