S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతాజయంతి

సర్వమంగళకారిణి, సర్వసంశయ నివారిణి, సర్వార్ధ ప్రదాయిని అయిన భగవద్గీత మనిషికి తోడునీడఅంటే అతిశయోక్తికాదు. జీవన సంగ్రామంలో విజయాన్ని చేకూర్చడానికి భగవద్గీతనే ఉత్తమోత్తమైన అహింసాయుధం. ఉపనిషద్గోవుల దుగ్దము భగవద్గీతఅని పండితులు అంటారు. వేదాంగవేత్తలు భగవద్గీతను వేదాంత సారమని, బ్రహ్మవిద్య అనీ చెప్తారు. అర్జునునిఉపాధిగా చేసుకొన్న కృష్ణుడు జీవులయందు సమత్వమును, కర్మకౌశలమును మానవాళికి నేర్పించాడు. తెలిసినవారు గీత అద్వైతామృతమును బోధించుననియు, తద్వారా తత్వజ్ఞానంపొందుతారని దానివలన మోక్షం ప్రాప్తిస్తుందని అంటారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

కాశీ ఖండం.. 83

విశే్వశ్వర స్వామి ఒక రోజున పార్వతీ దేవితో మన యింత పెద్ద కుటుంబానికి ఒక దక్షుడైన హితుడు నిర్వాహకుడు కావలసి వుంది కదా అని మంతనం ఆడాడు.
ఆ విధంగా మంతనం ఆడి సదాశివుడు గిరిరాజ కుమారి ముఖాన్ని అరకంట చూశాడు. ఆ చూపున వర్షాకాల మేఘం వంటి నీలవర్ణుడైన ఒక ముద్దు కొడుకు ప్రభవించాడు.

-శ్రీపాద కృష్ణమూర్తి

నేర్చుకుందాం

వడిదనిపించు కొనుటకు
గడియైనను బట్టకుండు గాంతలలోనె
క్కుడు గుణవతి యనిపించెడి
నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ!
భావము: ఓ కుమారీ! సమర్థురాలు అనే ప్రఖ్యాతిని పొందడానికి గడియసేపైనా పట్టదు. స్ర్తిలలోపల ఎక్కువ గుణవతిగా ప్రఖ్యాతిని కలిగినట్టి నడవడికను అభ్యాసం చేయడమే మిక్కిలి గొప్పది. కార్యములలో మిక్కిలి సమర్థురాలు అనే పేరు పొందడం ఎక్కువ కాదని స్ర్తిలలో మిక్కిలి గుణవంతురాలని ప్రఖ్యాతి పొందడమే మిక్కిలి గౌరవమని కవి భావించి వివరించాడు.
బక్కి వెంకట నరసింహ కవి రచించిన కుమారీ శతకములోనిది. - కె. లక్ష్మీఅన్నపూర్ణ

కొత్త స్నేహితులు 38

నువ్వెవరో, నేనెవరో అన్నట్టుగా పదిమంది ముందూ ఉన్న ఆమె.. ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండవలసి వచ్చేసరికి- తన స్ర్తిత్వాన్ని తనే విశే్లషించుకునే గందగోళంలో పడి.. తనలో మగాణ్ణి ఆకర్షించే లక్షణాలు అసలున్నాయా, లేవా? అని తన అంతశే్చతనలోని ఆలోచనల్ని నిర్మొహమాటగా బయపెట్టే ధైర్యం తెచ్చుకుంది’’.
‘‘చూడండీ.. మీ మనసులోని సంఘర్షణ నాకర్థమైంది. మీరడిగారు కాబట్టి చెప్తున్నాను, మరోలా అనుకోకండి.
మిమ్మల్ని బస్‌లో మొదటిసారి చూడగానే సాధారణంగా అందరు మగాళ్లూ అనుకనే విధంగానే ‘ఎవరోగానీ చాలా బావుందీవిడ!’ అనుకున్నాను.

సీతాసత్య

మోహన్‌లాల్ కనుపాప

మలయాళంలో విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. మలయాళంలో 50 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని కనుపాపగా అందిస్తున్నామని నిర్మాత దిలీప్‌కుమార్ బోలుగోటి తెలిపారు. ఇంకా ఆయన చిత్ర విశేషాలు తెలుపుతూ, మోహన్‌లాల్ అంధుడిగా నటించాడని, ఓ అపార్ట్‌మెంట్‌లో లిప్ట్ ఆపరేటర్‌గా పనిచేసే ఆయన సమక్షంలోనే ఓ హత్య జరుగుతుందని, ఆ హంతకుడు తప్పించుకుంటే అతన్ని అంధుడైన మోహన్‌లాల్ ఎలా పట్టుకున్నాడు అనే కథనంతో ఈ చిత్రం హారర్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తెలిపారు.

ఎన్టీఆర్ కొత్త సినిమా ఖరారు

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై బంపర్‌హిట్ కొట్టిన ‘జనతా గ్యారేజ్’తో ఎన్టీఆర్ మళ్లీ తన కెరీర్‌లో పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక ఈ రేంజ్ హిట్ కొట్టాక ఆయన చెయ్యబోయే కొత్త సినిమా ఏమై వుంటుందని అభిమానులంతా ఎదురుచూస్తుండగా, రెండు మూడు నెలలుగా సరైన సమాధానం దొరకలేదు. ఇక ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్న ఎన్టీఆర్, చివరకు దర్శకుడి బాబీకి అవకాశమిచ్చారు. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలను తెరకెక్కించిన బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు.

వర్మ జర్నీలో నాగ్.. అమితాబ్!

ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన రామ్‌గోపాల్‌వర్మ చిత్రం ‘వంగవీటి’ డిసెంబర్ 23న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో కార్యక్రమం రోజున విజయవాడలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు వంగవీటి రంగా వర్గీయులు, మరోవైపు రామ్‌గోపాల్‌వర్మ ఎవ్వరూ ఎక్కడా తగ్గలేదు. కొద్దిసేపట్లోనే ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చివరికి ఎలాగో వర్మ విజయవాడలో ఆడియో వేడుక పూర్తిచేశాక అంతా సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు వర్మ హైదరాబాద్‌లో ‘శివ టు వంగవీటి’ అనే ఈవెంట్‌ను జరపాలని నిర్ణయించాడు. ఈ కార్యక్రమానికి ట్యాగ్‌లైన్‌గా ‘జర్నీ ఆఫ్ రామ్‌గోపాల్ వర్మ ఫ్రమ్ విజయవాడ టు నాగార్జున టు అమితాబ్’ అని పెట్టాడు.

రవితేజ సరసన మెహరీన్?

‘బెంగాల్ టైగర్’ తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు రవితేజ. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరిపి ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో సైలెంట్ అయ్యాడు. ఇప్పటికే ఏడాదికిపైగా గడుస్తున్నా రవితేజ నెక్స్ట్ సినిమా ఏంటి అనే సందేహం ఇంకా ఆయన ఫ్యాన్స్‌లో నెలకొంది. ఫైనల్‌గా రవితేజ నెక్స్ట్ సినిమా ఓకే చేసాడు. పటాస్, సుప్రీం సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తికావచ్చిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నాని హీరోయిన్ నటిస్తోందట.

బాబు.. బాగా బిజీ

అవసరాల శ్రీనివాస్ కథానాయకుడుగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘బాబు.. బాగా బిజీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా హంటర్ చిత్రాన్ని చూసి రూపొందించామని, తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలంటే అవసరాల శ్రీనివాస్ న్యాయం చేస్తాడని అతన్ని ఎంపిక చేశామని తెలిపారు.

వాస్తవ ఘటనల పిట్టగోడ

రామ్మోహన్.పి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్.కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్.పి నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌కి రెడీ అయింది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. దర్శకుడు కమలాకర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయని, వీటిని శ్రీమణి అద్భుతంగా రాశాడని, రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారని, ప్రతి ఒక్కరి జీవితానికి చాలా దగ్గరగా వుండే కథ ఇదని అన్నారు.

Pages