S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్క్ దేశాలు ప్రగతి సాధించాలి

జగదాంబ, డిసెంబర్ 8: సార్క్ సభ్యదేశాలు సమన్వయంతో పని చేస్తూ ప్రగతి సాధించాలని ఎయు విసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎయు ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో సార్క్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయులో నెలకొల్పిన సార్క్ కేంద్రం దేశంలోనే ఏకైక కేంద్రంగా నిలుస్తోందన్నారు. యువ విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మంచి పరిశోధనలకు అవకాశం కలిగిందన్నారు. వచ్చే నెల 5 నుంచి జరిగే అంతర్జాతీయ సదస్సులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యానస్ హాజరవుతారన్నారు.

జనచైతన్య హామీల అమలుకు రూ. 20కోట్లు మంజూరుకు సిఎం చర్యలు

అనకాపల్లి, డిసెంబర్ 8: జనచైతన్య యాత్రల పర్యటనలో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలకు తాను ఇచ్చిన హామీల అమలుకు సిఎం చంద్రబాబు 20కోట్ల ప్రత్యేక గ్రాంటును విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నారని స్థానిక శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. స్థానిక జీవిఎంసి జోనల్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతోను, అనధికారులతోను పట్టణాభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

క్యూలో నిలబడలేక... పింఛను రాక.. పండుటాకుల పాట్లు

సబ్బవరం, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసి గురువారం నాటికి సరిగ్గా నెల రోజులయినప్పటికీ నగదుకోసం ఖాతాదారులు తిప్పలు తప్పలేదు. దీంతో ప్రతీరోజూ బ్యాంక్‌ల చుట్టూతిరగటంతోనే తమ పని సరిపోతోందని, రోజుకు 2వేల చొప్పున నగదుకోసం క్యూలో ఉంటే ముందున్నవారికే దక్కుతోందని పలువురు వాపోతుండగా,తాము సంపాదించి బ్యాంకులో దాచుకున్న సొమ్మును అవసరానికి తీసుకునేందుకు ఇన్నితిప్పలా అంటూ పలువురు ఆసహనం, ప్రభుత్వాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వృద్థాప్య పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం వేస్తున్న వారికైతే ఆ సొమ్మును తీసుకునేందుకు నరకం చూస్తున్నామని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.

కాఫీ సాగుతో పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలి

పాడేరు, డిసెంబర్ 8: కాఫీ సాగులో గిరిజన రైతులు అధిక దిగుబడులను సాధించి పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆకాంక్షించారు. పాడేరు మండలం మినుములూరు కాఫీ బోర్డు ఆవరణలో గురువారం నిర్వహించిన క్షేత్ర దినోత్సం-2016లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాఫీ బోర్డు అధికారులు అందిస్తున్న సలహాలు, సూచనలను పాటించి ఎకరాకు మూడు వందల కిలోల కాఫీ దిగుబడిని సాధించాలని అన్నారు.

ముద్దాడపేట వద్ద వంతెనకు గ్రీన్‌సిగ్నల్: విప్

ఆమదాలవలస, డిసెంబర్ 8: ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతించినట్టు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. మండలంలోగల దూసిపేట జెడ్పిహైస్కూల్ వద్ద రూ.32లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ముద్దాడపేట నుండి బెలమాం మీదుగా సంతకవిటి, రాజాం, రేగిడి ఆమదాలవలస, జి.సిగడాం వంటి మండలాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టును రూ.130కోట్ల నిధులతో ఆధునీకరించేందుకు రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామనివిప్ తెలిపారు.

వైకాపా పురోభివృద్ధిపై జగన్ దృష్టి సారించేనా?

ఒంగోలు, డిసెంబర్ 8 : రానున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారనున్నాయ. దీంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కీలకం కావడంతో గెలుపుగుర్రాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో తాము ఏ అభ్యర్థిని నిలబెట్టినా, చివరకు తమ కారు డ్రైవర్‌ను నిలబెట్టినా గెలుస్తారన్న అహంభావం ఉండటంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పటిష్టమైన నాయకత్వం ఉన్న నేతలకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.

దస్త్రాల్లో వాస్తవాలు!

నెల్లూరు, డిసెంబర్ 8: తమ ఇంటి నివేశన స్థలాలను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కబ్జా చేశారంటూ కొందరు బాధితులు జిల్లా అధికారులను ఆశ్రయించడం, కాకాణిపై కేసు నమోదు కావడం సంగతి విదితమే. అయితే ఈ కేసులో అసలు కబ్జాదారుడు ఎవరనే విషయంలో జిల్లా యంత్రాంగం వద్ద అన్ని దస్త్రాలు ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ మండలం వావిలేటిపాడులో సర్వే నంబరు 272/2 ఏలో ఎకరం భూమి మాత్రమే ఉన్న వ్యక్తి ఇళ్ల స్థలాల కోసం 2004లో 2.92 ఎకరాల భూమిని మూడు విడతలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం.

నేడు సాంకేతిక భారత్!

కర్నూలు, డిసెంబర్ 8 : సరిగ్గా పాతికేళ్ల క్రితం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెంచడానికి సాక్షర భారత్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించగా, నేటి ప్రధాని నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాంకేతిక భారత్ కార్యక్రమం రూపొందిస్తున్నారు. ఆనాడు సంతకం చేయని పక్షంలో ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పినా సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలను పొందలేకపోయారు.

జిల్లా సిపిఒలు రాష్ట్రానికే ఆదర్శం

చిత్తూరు, డిసెంబర్ 8: జిల్లాలోని సిపిఒ (పోలీసు కమ్యూనిటి ఆఫీసర్స్) వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శమైందని రాష్ట్ర డిజిపి సాంబశివరావు కొనియాడారు. గురువారం రాత్రి చిత్తూరు పోలీసు మైదానంలో జిల్లా స్థాయి సిపిఒల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా డిజిపి మాట్లాడుతూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజసేవలో మేము సైతం అంటూ అనేకమంది శాంతి భద్రతలు కాపాడాలన్న ఉత్సాహంతో యువత సిపిఒలుగా ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో సిపిఒలు పోలీసులకు చక్కగా సహకరిస్తూ, ట్రాఫిక్, శాంతి భద్రతలు పరిరక్షణలో, రాత్రివేళ బీట్ డ్యూటీలు తదితర పోలీసులు విధుల్లో పాలుపంచుకోవడం గొప్ప విషయమన్నారు.

నగదు పాట్లు ఇంకెన్నాళ్లు!

కడప,డిసెంబర్ 8:పెద్దనోట్లు రద్దుచేసి నెలరోజులు పైబడినా నోట్ల కష్టాలు పెరుగుతూ చిన్ననోట్లు, పెద్దనోట్ల కోసం నోట్లు పాట్లు పడుతూనే జిల్లాలో ఆ ప్రాంతం ఈప్రాంతం అని లేకుండా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల్లో డబ్బులున్నా, సగానికి పైబడి ఏటిఎంలు తెరుచుకోక బ్యాంకుల వద్ద రోజురోజుకు భారీ రద్దీపెరిగి అరకొర కరెన్సీ ఉన్న ఏటిఎంల ముందు వందల్లో క్యూ కడుతున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నిలుచుకోలేక అస్వస్థతలకు గురౌతున్నారు. వృద్ధులు పెన్షన్లకోసం వెళ్లి నానాయతలు పడుతూ రోజుల తరబడి బ్యాంకులు, ఏటిఎంల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.

Pages