S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతికందని నోటు!

అనంతపురం, డిసెంబర్ 8: రోజువారీ నగదు లావాదేవీల కోసం జనానికి ముప్పుతిప్పలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు దాటినా పరిస్థితి చక్కబడటం లేదు. డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలకు అలవాటుపడాలని ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా అందుకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన పెరగడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు, లేదా వచ్చే ఏడాది జనవరి 15లోపు వంద శాతం కాకపోయినా, కనీసం 80 శాతం మేరకు ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రజల్ని అలవాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందుకోసం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

సాంకేతిక బోధనా ఉపాధ్యాయులకు శిక్షణ

నక్కలగుట్ట,డిసెంబర్ 8: దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులు ఏలాంటి శిక్షణ లేకుండానే ఉపాద్యాయ వృత్తిలోకి వస్తున్నారని, దీంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రొఫెసర్ బర్రీ స్పాండర్ అన్నారు. గురువారం వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో టీచింగ్ లర్నింగ్ సెంటర్ అధ్వర్యంలో మూడు రోజుల సెమినార్ ప్రారంభ సమావేశం జరిగింది. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జిఆర్‌సి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా స్పాండర్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు పరిశోధనల వైపు వెళ్లక పోవడానికి, ఉపాద్యాయులు సరియైన అవగాహన కల్పించకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు.

కౌలు రైతు ఆత్మహత్య

నిర్మల్ రూరల్, డిసెంబర్ 8: నిర్మల్ మండలం న్యూముజ్గికి చెందిన కౌలు రైతు పెద్దోళ్ల గంగాధర్ (48) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం గంగాధర్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని పత్తి , మొక్కజొన్న సాగు చేస్తున్నాడు.దిగుబడి సరిగా రాదని దిగాలు చెందాడని పేర్కోన్నారు. దీనికి తోడు రూ. 2.5 లక్షలు అప్పు వుండడంతో దిక్కుతోచని స్ధితిలో గురువారం పత్తి చేలుకు విద్యుత్ సరఫరా చేయడానికి వెళ్లి అక్కడే ఉరి వేసుకోని ఆత్మహత్యకు చేసుకన్నట్లు తెలిపారు. ఆయనకు భార్య గంగవ్వతో పాటు ముగ్గురు కుమారులున్నట్లు వివరించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సాగునీరు అందించడమే లక్ష్యం

సంగారెడ్డి, డిసెంబర్ 8: వ్యవసాయ రంగానికి సాగు నీటిని పూర్తిస్థాయిలో అందించి కోటి ఎకరాల మాగాణిని పచ్చగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి సింగూర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఎం.బాగారెడ్డి సింగూర్ కాలువలు, సిలారపు రాజనర్సింహా ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసి గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

ఉసూరుమంటున్న ’ఉపాధి‘ లబ్ధిదారులు

నిజామాబాద్, డిసెంబర్ 8: సర్కారీ కొలువులు అత్తెసరు నోటిఫికేషన్లకే పరిమితం అవుతుండగా, కనీసం ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధినైనా ఏర్పాటు చేసుకుందామని ఆశిస్తున్న నిరుద్యోగ యువతకు రుణాల పంపిణీలో మొండిచేయి మిగులుతోంది. స్వయం ఉపాధి కల్పనకై అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు నిధుల లేమితో నీరుగారిపోతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.

ప్రతిష్టంభన ఆమోదయోగ్యం కాదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పార్లమెంటు ప్రతిష్టంభనపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటును పనిచేయనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టసభలు ఉన్నది ధర్నాలు చేయడానికి కాదని ధ్వజమెత్తారు. సభ పనిచేయకుండా అడ్డుకోవడం అంటే మైనారిటీ సభ్యులు మెజారిటీ సభ్యుల నోరు నొక్కడమే అవుతుందని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు ఉన్నది సభలో వివిధ అంశాలపై చర్చలు జరపడానికి కాని సభను అడ్డుకోవడానికి కాదని ఆయన పేర్కొన్నారు. ‘పార్లమెంటరీ వ్యవస్థలో సభను అడ్డుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు.

చేనేతకు చేయూత

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 8: ఖండాంతర ఖ్యాతి చెందిన పోచంపల్లి చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఐటి శాఖామంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. గురువారం భూదాన్ పొచంపల్లి మండలం కనుముకుల గ్రామం చేనేత పార్కును ఆయన సందర్శించారు. చేనేత పార్కులోని మగ్గాలను, వస్త్రాలను ఆయన పరిశీలించారు. వస్త్రాల తయారీ విధానం, రంగుల అద్దకాల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.

సమతా ఎక్స్‌ప్రెస్ పేరు ఇకపై వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్‌ప్రెస్

న్యూఢిల్లీ/ విశాఖపట్నం (గాజువాక): డిసెంబర్ 8: విశాఖపట్నం నుండి ఢిల్లీ (హజారత్ నిజాముద్దీన్) వెళ్లే సమతా సూపర్ ఫాస్ట్ రైలు పేరును వైజాగ్ స్టీల్ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా గురువారం మార్పు చేశారు. ఈ మేరకు గురువారం నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో బయలుదేరిన వైజాగ్ స్టీల్ సమతా ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, రైల్వేశాఖ మంత్రి సురేష్ పి ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రి సింగ్ మాట్లాడుతూ ఇటువంటి ప్రచార కార్యక్రమాలు సంస్థ మార్కెట్ పరిధిని మరంత విస్తరింపచేయడంలో కీలక భూమిక వహిస్తాయన్నారు.

యంత్రాలతో ఇసుక తవ్వకాలు వద్దు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: తెలుగు రాష్ట్రాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపవద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారంటూ ‘రేలా’ స్వచ్చంద సంస్థ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపవద్దని, ఇసుక తవ్వకాలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాలను ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 25కి వాయిదా వేసింది.

శంషాబాద్‌లో ఆగిపోయిన హాంగ్‌కాంగ్ విమానం

హైదరాబాద్, డిసెంబర్ 8: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో క్యాత్య పసిఫిక్ విమానం నిలిచిపోయింది. సిఎక్స్ 646 పసిఫిక్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హాంగ్‌కాంగ్ వెళ్లాల్సి ఉంది. కాగా విమానంలో సాంకేతిక లోపంత తలెత్తడంతో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున బయల్దేరాల్సిన విమానం ఆలస్యం కాగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీగా పాత నోట్లు

Pages