S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైస్‌పుల్లింగ్ కాయిన్ మహత్యం

హైదరాబాద్, డిసెంబర్ 8: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్లు ఉన్నట్టు ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు రైస్‌పుల్లింగ్ కాయిన్‌ను కనుగొన్నారు. లక్ష్మణ్‌రావు వద్ద కేవలం రూ. 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో అతని ఇంటితోపాటు ఇద్దరు కొడుకులు, కోడళ్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఐటి అధికారులు గురువారం లక్ష్మణ్‌రావు బోగస్ నల్లధనం ప్రకటనపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. లక్ష్మణ్‌రావును కర్నాటకకు చెందిన బాబు అనే వ్యక్తి బురిడి కొట్టించాడు.

ఆశాజనకంగా ‘యాసంగి’

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో రబీ సాగు జోరందుకుంది. 2016 నవంబర్‌లో యాసంగి (రబీ) పంటలకు విత్తనాలు వేయడం ప్రారంభమైంది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లో నీరు సమృద్ధిగా చేరటంతో పాటు, బావులు, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. అలాగే వాతావరణం పంటలకు అనుగుణంగా ఉంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పంటలకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. వరి, బుడ్డలు (వేరుశనగ), మొక్కజొన్న తదితర పంటలు వేస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సుమారు 30 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. తాజా సమాచారం ప్రకారం తొమ్మిది లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. డిసెంబర్ చివరి వరకు యాసంగి పంటలు వేయడం పూర్తవుతుంది.

అసెంబ్లీపై వ్యూహం మంత్రుల సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 8:ఈనెల 16నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రుల వ్యూహ కమిటీ గురువారం సమావేశం అయింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు సమావేశం అయ్యారు. 16 నుంచి జరిగే సమావేశాల్లో విపక్షాలు ఏయే అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందో చర్చించారు. రెండున్నర ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని సమావేశంలో వివరించాలని నిర్ణయించారు.

విశాఖ విమానాశ్రయంలో రూ.57 లక్షల విలువైన బంగారం స్వాధీనం

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీల్లో భాగంగా ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.56.88 లక్షల విలువైన 1.966 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు హైదరాబాద్, మరో వ్యక్తి దుబాయి నుంచి వస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ ఎయిర్ ఇంటిజిలెన్స్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రయాణికులను తనిఖీలు చేస్తుండగా సిల్వర్ రంగు కోటింగ్ వేసిన బంగారాన్ని వీరు ధరించిన షూల్లో దాచిపెట్టారు. అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీలు నిర్వహించడంతో అసలు గట్టు రట్టయింది.

కాంగ్రెస్ నేతల్ని కడిగేస్తా!

సంగారెడ్డి, డిసెంబర్ 8: రైతుల ఆత్మహత్యలు, వలసలు నివారించడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టాలని యోచిస్తే కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి తప్పులన్నింటిని ఎత్తి చూపించి అసెంబ్లీలో సబ్బుతో కడిగినట్లు కడిగేస్తానని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.

ప్లాస్టిక్ కవర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 8: విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ పంచాయతీ శివారులోని శ్రీనాథ్ రూట్ ప్యాక్ లిమిటెడ్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు, కార్మికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. సమీప ప్లాట్-1, ప్లాట్-2లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిజ్వాలలో దగ్ధమవుతున్న పరిశ్రమ నుండి కలర్ డబ్బాలు పేలుతుండటంతో కార్మికులు పరుగులు తీశారు.

అంతర్యుద్ధం తప్పదేమో!

హైదరాబాద్, డిసెంబర్ 8: నోట్ల సమస్యపై ప్రజల్లో అంతర్యుద్ధం (సివిల్ వార్) వచ్చే ప్రమాదం ఉందని పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నోట్లను రద్దు చేసి నెల రోజులు గడుస్తున్నా, ప్రజలకు ఉపశమనం కలిగించ లేకపోయారని విమర్శించారు. ‘సామాన్యులు పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు. బిజెపి నేతలు మాత్రం వందల కోట్ల ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు’ అని అన్నారు. మోదీ నల్లధనం గురించి మాట్లాడుతున్నారని, మరి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నల్లధనం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

15నుంచి కళాభారతిలో పుస్తకాల పండుగ

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో డిసెంబర్ 15 నుండి 26 వరకు హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తెలిపారు. సచివాలయంలో గురువారం నేషనల్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను రమణాచారి ఆవిష్కరించారు. నోట్ల రద్దు ప్రభావం లేకుండా నగదు రహితంగా పుస్తకాలు కొనుగోలు చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయాలని కోరారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగులు వచ్చినప్పటికీ నేటికీ పుస్తకాలను ప్రేమించే వారు ఉన్నారని అన్నారు. బిసి కమిషన్ చైర్మన్ బియస్ రాములు బుక్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని కోరారు.

పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పెట్టాలి

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో వీలున్నంత త్వరగా ప్రతిపాదిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య గురువారం తెలిపారు. కేంద్ర సమాచార మంత్రి వెంకయ్యనాయుడు, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయలతో కలిసి నంది ఎల్లయ్య పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీని కలిశారు. ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వారు వివరించగా ప్రధాని సావధానంగా విన్నారు. జస్టిస్ ఉషామెహ్రా కమీషన్ సిఫార్సులను ఆమోదించటం ద్వారా వర్గీకరణ చేయాలని తాము మోదీని కోరినట్టు నంది ఎల్లయ్య చెప్పారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏదీ?

హైదరాబాద్, డిసెంబర్ 8: ‘రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేకుండా బాధపడకూడదన్నది నా అభిమతం. అందుకే నిబంధనల ప్రకారం సాధ్యం కాదంటున్నా మానవతా దృక్పథంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను దశల వారీగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించాం’ వారం రోజుల కిందట విద్యుత్‌శాఖ ఉద్యోగుల సమ్మె నోటీసుపై స్పంది స్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఇది. ‘ఒకే పని చేసే ఉద్యోగులకు ఒకేరకంగా వేతనం ఉండాలి.

Pages