S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్‌తో సూర్య

హీరో సూర్య తన కెరీర్‌ను స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ పెద్ద హీరోగా మారిన విషయం తెలిసిందే. కెరీర్ మొదటి రోజుల్లో సూర్య నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా కాకా’. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఇక్కడ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సూర్య గౌతమ్‌తో ‘వారణం ఆయురం’ అనే సినిమాతో చేయాలనుకున్నా కుదరలేదు. ‘సింగం-3’ చిత్రం పూర్తిచేసిన సూర్య మరోసారి గౌతమ్‌మీనన్‌తో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. గౌతమ్ ఈ సినిమాకోసం కథ చర్చలు కూడా జరిపాడని తెలుస్తోంది.

30న పిజ్జా 2

విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఆర్.పి.ఎ. క్రియేషన్స్, డి.వి. సినీ క్రియేషన్స్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం పిజ్జా-2. తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 30న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులను, అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలుపుతూ ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకుని ధ్రిల్లర్ జోనర్‌లో సినిమా రూపొందించామని తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలకు థియేటర్ ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, విజయ్ సేతుపతికి ఎనిమిదవ హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని ఆయన తెలిపారు.

ఎందరో మహానుభావులు

పల్లాడ సాయికృష్ణ కథానాయకుడిగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్, శ్రీలక్ష్మి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ఎందరో మహానుభావులు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. సంగీత దర్శకుడు రఘు కుంచె ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సంగీత దర్శకుడు సిద్ధార్థ్ అందించిన పాటలు చాలా బాగున్నాయని, కథానాయకుడే దర్శకుడిగా రెండు బాధ్యతలను చక్కగా నిర్వహించారని తెలిపారు.

ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు?

విజెవైఎస్ ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘన విజయం సాధించిన ‘తర్కప్పు’ చిత్రాన్ని ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’గా వై.శేషిరెడ్డి తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు’ చిత్ర విశేషాలను చిత్ర సమర్పకుడు వై.శేషిరెడ్డి తెలియజేస్తూ.. చట్టసభల్లో కూర్చుని చట్టాలు తయారుచేసే రాజకీయ నాయకులు.. ఆ చట్టాన్ని కాపాడాల్సిన కొంతమంది పోలీస్ అధికారులు పారిశ్రామికవేత్తలతో కలిసి సామాన్య మానవుల జీవితంతో ఏవిధంగా ఆడుకుంటున్నారు?

ముద్దుగుమ్మ!

ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్‌గా మారాయి. ఇప్పటికే పలువురు భామలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ఈ లిప్ లాక్ సీన్స్‌కి కొదువే లేదు. ఈమధ్యే తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువయ్యాయి. ఇక తెలుగు భామ తేజస్విని కూడా ఈ విషయంలో మంచి జోరుమీదుంది. ఐస్‌క్రీమ్ తరువాత హాట్ డోస్ పెంచిన ఈ భామ, తనలోని గ్లామర్ యాంగిల్‌ని బాగానే బయటపెట్టింది. గ్లామర్ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న తేజస్విని లేటెస్టుగా అవసరాల శ్రీనివాస్ రూపొందిస్తున్న హిందీ ‘హంటర్’ రీమేక్ ‘సోగ్గాడు’ సినిమాలో నటిస్తోంది.

చెలరేగిన పూనమ్!

టూ పీస్ బికినీలతో రెచ్చగొట్టే పూనమ్ పాండే, లేటెస్టుగా ఓ తెలుగు సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఈ అమ్మడి అందాలు బాలీవుడ్‌కి బోర్ కొట్టినట్టున్నాయి. అందుకే బాలీవుడ్‌లో పెద్దగా సినిమా ఛాన్సులు రావడంలేదు. ఇక తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోసి క్రేజ్ తెచ్చుకోవడం ఎలాగో బాగా తెలిసిన ఈ భామ ఇన్ని రోజులు సైలెంట్‌గా వుండి మరోసారి వేడెక్కించేందుకు రెడీ అయింది. తాజాగా మాల్దీవులలో వీకెండ్‌ని ఎంజాయ్ చేసిన పూనమ్ మరోసారి బికినీ, టూ పీస్ డ్రెస్‌లో అదరగొట్టింది. ఆ ఫొటోలు మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం రేపింది. ప్రస్తుతం పూనమ్ పాండే బికినీ ఫొటోలు వైరల్ అయ్యాయి. కావాలంటే ఆ ఫొటోలపై మీరు ఓ లుక్ వేయండి.

నెలరోజులైనా తీరని కష్టం

విశాఖపట్నం, డిసెంబర్ 8: పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు పూర్తయ్యింది. అయినా ఇంకా జనం కష్టాలు తీరనేలేదు. పైగా నోట్ల సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ఒకరోజు, రెండు రోజులు కాదు. ఏకంగా నెలల తరబడి పడుతున్న ఇటువంటి సమస్యలు తలుచుకుంటునే భయమేస్తుందంటూ వృద్ధులు గగ్గోలు చేస్తున్నారు. ఎలా తెల్లారుతుందనే ఆందోళన వీరికి పట్టుకుంది. ఫించన్ల సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదంతో వృద్ధులు, వితంతువులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

వైద్య ఆరోగ్యశాఖలో అనధికార చెల్లింపులు

జగదాంబ, డిసెంబర్ 8: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చిత్రమైన పద్ధతులు నడుస్తున్నాయి. వాస్తవంగా రాష్టవ్య్రాప్తంగా సంచార వైద్యసేవా పథకంలో పని చేస్తున్న సిబ్బందికి ఒక ప్రైవేటు సంస్థ ఏజెన్సీ నుంచి జీతాలు అందజేస్తుంటారు. 104 ఉద్యోగులను సంచార వైద్యసేవా పథకంలోకి తీసుకునే విధానంలో కొంతమందికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో జిల్లావైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే పలువురు ఉద్యోగులు సాధారణ బడ్జెట్ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు.

స్మార్ట్‌సిటీ సిక్

విశాఖపట్నం, డిసెంబర్ 8: ఒకవైపు నోట్ల బాధలతో అతలాకుతలం అవుతుంటే మరోపక్క స్మార్ట్‌సిటీ సిక్ అయింది. నగరవాసులకు ఈ ఏడాది చివరిలో కూడా పీత కష్టాలే. ఏ విధంగా తెల్లారుతుందోనన్న ఆందోళనే. రెండు మాసాలుగా సగటు జీవి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్య, మధ్య తరగతి వర్గాల బాధలు వర్ణనాతీతం. నోట్ల పుణ్యమా అని నెల రోజులుగా చేతిలో ఒక్క పైసా ఆడటం లేదు. దీనికి రోగాలు తోడవుతున్నాయి. వైద్యులు చూస్తే వాతావరణంలో మార్పులు అంటూ సరిపెడుతున్నారు. ఇదే నగరవాసుల పాలిట శాపమవుతుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులకు వీటి బాధ ఎక్కువైంది.

కొండగుడికి పోటెత్తిన భక్తజనం

జగదాంబ, డిసెంబర్ 8: నగరంలోని పాత పోస్ట్ఫాసు వద్దనున్న రోజ్ హిల్‌పై అమలోద్బవి ఉత్సవం (కొండ గుడి) గురువారం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా భక్తులు తెల్లవారు జాము నుంచే అధిక సంఖ్యలో బారులు తీరి మొక్కలు తీర్చుకునేందుకు కాలి నడకన, మరి కొంత మంది మోకాళ్ళపై మెట్లమీదుకు ఎక్కి మాతను దర్శించుకున్నారు. ఏసుక్రీస్తు తల్లిగా, లోకమాతగా మరియమ్మ జీవితం అందరికీ ఆదర్శమని, కష్టాల్లో కుంగిపోకుండా సంతోషాల వేళ సాగిలపడకుండా స్థిరమైన జీవితాన్ని గడపాలని ఉత్తరాంధ్ర ప్రజలు అమలోద్బవి మాతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది నిర్వహించే కొండగుడి పండగకు వేలాదిమంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాతను దర్శించుకుంటారు.

Pages