S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధికి పెట్టుబడులే కీలకం

న్యూఢిల్లీ, జూన్ 8: వేగవంతమైన వృద్ధికి ప్రైవేట్‌రంగ పెట్టుబడులు చాలా అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. వేగవంతమైన వృద్ధిని అందుకునే సామర్థ్యం భారత్‌కుందన్న ఆయన వాస్తవ జిడిపి గణాంకాలు ఒక శాతం ఎక్కువగానో, తక్కువగానో ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా నమోదైనట్లు ఇటీవల ప్రకటించినది తెలిసిందే. ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో ఇదే అత్యధికమని కూడా కేంద్రం చెప్పుకొచ్చింది.

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి దక్షిణ కొరియా అన్ని రకాలుగా సహకరిస్తుందని భారత్‌లో కొరియా రాయబారి చో హ్యూన్ స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, కొరియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు కొరియాకు చెందిన 50 మంది వాణిజ్య ప్రతినిధులు హాజరై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలుసుకుని ముగ్ధులయ్యారు.

మేధో కవాటాలు మూయకండి

న్యూఢిల్లీ, మే 8: మేధో కవాటాలు ఎప్పటికీ తెరిచి ఉన్నప్పుడే స్వేచ్ఛగా సృజనాత్మక ఆలోచనల ప్రసారాలు ఒకరి నుంచి ఒకరికి కొనసాగుతాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం అన్నారు. ఆలోచనల పరస్పర ప్రసారం వల్ల నూతన ఆవిష్కరణలకు దారి ఏర్పడుతుందని ఆయన అన్నారు. తాను రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన కార్యకలాపాలన్నింటినీ క్రోడీకరించి ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రచురించిన ‘ది ఎడ్యుకేషన్ ప్రసిడెంట్’ పుస్తకం తొలి ప్రతిని ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా రాష్టప్రతి అందుకున్నారు.

అభివృద్ధి ఇంజన్.. భారత్

వాషింగ్టన్, జూన్ 8: ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుకు భారత దేశం బలమైన ఇంధనశక్తిగా, ఇంజనుగా పనిచేసేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతగా విస్తరిస్తే, అంతగానూ ప్రపంచానికి బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయని బుధవారం ఇక్కడ జరిగిన భారత అమెరికా వ్యాపార మండలి సమావేశంలో స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుత ప్రపంచ వృద్ధి రేటును పెంచేందుకు బలమైన ఇంజను కావాలి.. ఆ చోదక శక్తి భారత్‌కు ఉంది’’ అని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా భారత్‌లోని తన ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, వివిధ విధానాల సరళీకరణ విషయంలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు.

కేరళలో సోనియాపై కేసు

తిరువనంతపురం, జూన్ 8: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేరళకు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కోర్టులో కేసు దాఖలు చేసింది. నెయ్యర్‌లో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ కాంప్లెక్స్ సంస్థకు సంబంధించి భవన నిర్మాణాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టింది. భవన నిర్మాణ బాధ్యతలను హీథర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. పను లు పూర్తిచేసినా నిర్మాణ సంస్థకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కంపెనీ మేనేజింగ్ పార్టనర్ విజయ్ తరఫున న్యాయవాది బాబూరాజ్ ఫిర్యాదు చేశారు. ఇందులో సోనియాగాంధీని ప్రధాన ప్రతివాదిగా పేర్కొన్నారు.

చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్

లాస్ ఏంజిల్స్, జూన్ 8: అమెరికా రాజకీయ చరిత్రలోనే ఒక ప్రధాన రాజకీయ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ బుధవారం చరిత్ర సృష్టించారు. న్యూజెర్సీ, న్యూమెక్సికో, డకోటా రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆమె డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అర్హతను సంపాదించారు. అయితే ఆమె ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ మాత్రం తాను పోటీనుంచి తప్పుకోబోనని అంటున్నారు.‘ మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మనం ఒక మైలురాయిని చేరాం.

రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిపై రెండు దశల్లో సమగ్ర సర్వే

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో నివాసముండే ప్రతి కుటుంబానికి చెందిన ఆర్థిక, సామాజిక స్థితిపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 20నుంచి 30వ తేదీ వరకు, మళ్లీ వచ్చే నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. రెండు దశల్లో ఈ సర్వే ముగుస్తుంది. ఈ సర్వేలో ప్రతి కుటుంబాన్ని 75 ప్రశ్నలు అడుగుతారు. దాదాపు 30 వేల మంది మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారు.

అయోమయానికి పరాకాష్ఠ! (తరలింపు తిప్పలు-4)

సిఎం రమ్మంటున్నారు.. కార్యదర్శులు వద్దంటున్నారు!
హైదరాబాద్‌లో ఇళ్లు ఖాళీ చేయాలా? వద్దా?
వస్తే లక్షలాది ఫైళ్లు ఎక్కడ పెట్టాలి? ఎలా తరలించాలి?
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాకే కదిలేదంటున్న ఉద్యోగులు

ఇదీ రోడ్‌మ్యాప్

హైదరాబాద్, జూన్ 8: విజయ దశమి (అక్టోబర్ 11) నాటికి కొత్త జిల్లాల సంపూర్ణ ఆవిర్భావ ప్రక్రియ పూర్తవుతుందని సిఎం కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాంటిచారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సిఎం రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసి ప్రకటించారు. రెండు రోజులుగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లతో జరుగుతున్న వర్క్‌షాప్‌నకు బుధవారం సిఎం హాజరై మార్గనిర్దేశం చేశారు. ఈనెల 20లోపు కొత్త జిల్లాలపై కలెక్టర్లు సమగ్ర నివేదికను సిసిఎల్‌ఎ కమిషనర్ రేమాండ్ పీటర్‌కు అందించాలని సిఎం ఆదేశించారు.

ప్రతి జిల్లాలో 20 మండలాలు

హైదరాబాద్, జూన్ 8: యాభై నుంచి 60 వేల జనాభాకో మండలం, 10 మండలాలకో రెవిన్యూ డివిజన్, రెండు డివిజన్లతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. జిల్లాలు, మండలాల పునర్విభజనపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న కలెక్టర్ల కసరత్తును సిఎం బుధవారం సమీక్షించారు. కొత్త జిల్లాలు కోరుతూ వచ్చిన ప్రతిపాదనలను సిఎం కెసిఆర్ జిల్లాలవారీ కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో రెవిన్యూ డివిజన్ పరిధిలో 10నుంచి 12 మండలాలు ఉండాలని, ఒక్కో రెవిన్యూ డివిజన్ పరిధిలోకి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 5నుంచి 6 మండలాలు ఉండాలని సిఎం సూచించారు.

Pages