S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

శ్రీ కాళహస్తి, జూన్ 7: పట్టణంలోని బంగారమ్మ దేవతకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంగళవారం ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు. జాతర సందర్భంగా శ్రీ కాళహస్తి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, బోర్డు సభ్యులు, అనుబంధ ఆలయాల ఇన్‌చార్జ్ వెంకటస్వామి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. జాతర ప్రారంభం సందర్భంగా పట్టణంలోని భక్తులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బుధవారం కూడా జాతర జరగనుంది.

పంట పొలాలపై ఏనుగుల దాడులు

వి.కోట, జూన్ 7: మండల పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల పంట పొలాలపై సోమవారం రాత్రి ఏనుగులు దాడులకు పాల్పడ్డాయి. మద్దిమాకులపల్లె సమీపంలోని పంటలపై నాలుగు ఏనుగులు దాడులకు పాల్పడి క్యాబేజీ, టమోటా, బీన్స్, మిరప పంటలను తిని తొక్కి నష్టపరిచాయి. అదేవిధంగా గోనుమాకులపల్లె సమీపంలో రెండు ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో, ధరలు ఆశాజనకంగా ఉన్నప్పుడు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వి.కోటకు వచ్చిన డిఎఫ్‌వో చక్రపాణినాయుడు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం సత్వరం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

పుత్తూరు, జూన్ 7: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం ఈ సేవను నిర్వహించడం టిటిడి ఆనవాయితీగా పాటిస్తూ ఉంది. ఈనెల 15నుంచి 23వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల, కొలువు,పంచాంగ శ్రవణం నిర్వహించిన అనంతరం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.

సిఎంపై నేడు అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు

తిరుపతి, జూన్ 7: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకుగాను ఆయనపై జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో 420 కేసు పెడతామని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ చెప్పారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంత వరకూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

తిరుమలలో కురిసిన వర్షం...

తిరుమల, జూన్ 7: తిరుమలలో మంగళవారం ఉదయం నుంచి ఓ మోస్తారుగా వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. గత రెండు నెలలుగా ఎన్నడూ లేనివిధంగా సూర్యుడు ప్రతాపం చూపుతుండడం ఎండ తాపాన్ని తట్టుకోలేక భక్తులు తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నానానికి ఓ మోస్తారుగా కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అనుకోకుండా తిరుమలలో వర్షం పడడంతో భక్తులు ఆలయం ముందు వర్షంలో తడుస్తూ చల్లటి వాతావరణాన్ని ఆశ్వాదించారు. అంతేకాకుండా సందర్శనీయ ప్రాంతాల్లో కూడా భక్తులు కిటకిట లాడారు.

లడ్డూ ట్రేలను శుభ్రపరిచేందుకు యంత్రాలు

తిరుమల, జూన్ 7: శ్రీవారి లడ్డూ ప్రసాదం ట్రేలను వేడినీటితో శుభప్రరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేయాలని టిటిడి ఇఒ డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ నూతన యంత్రాలను కొనుగోలు చేయడం వల్ల ఒక గంటలకు 500 ట్రేలను శుభ్రం చేయవచ్చని అన్నారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పిస్తున్న దర్శన స్లాట్లను ఉదయం 9 నుంచి ప్రారంభించాలని తెలిపారు. వర్షాకాలంలో శ్రీవారి ఆలయం, మాడ వీధులు, రూ. 300 క్యూలైన్ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లాకు 2015-16లో రూ.10వేల కోట్లు కేటాయింపు

కడప,జూన్ 7: జిల్లాలో 2015-16వ సంవత్సరంలో రూ.10వేల కోట్లు ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించగా అందులో 50శాతానికి పైగా సంక్షేమం కోసం వెచ్చించడమైందని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నూతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నవనిర్మాణదీక్ష 6వరోజు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ రంగం అభివృద్ధిపై చర్చ కార్యక్రమాలు ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2015-16లో రూ.6,500కోట్ల వార్షిక క్రెడిట్ ఫ్యాన్ లక్ష్యం కాగా లక్ష్యాన్ని అధికమించి 109శాతం అభివృద్ధి సాధించామన్నారు.

జిల్లా టిడిపిలో తమ్ముళ్ల ఆధిపత్యపోరు..!

కడప,జూన్ 7: జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకు కోల్డ్‌వార్ తరహాలో వేడెక్కింది. జిల్లాలో రెండుమూడు నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గాల వారీగా ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరి అసలైన సిసలైన తెలుగుతమ్ముళ్లు తమ ఆక్రోశాన్ని, తమ ఆవేదనను వెళ్లబుచ్చుకుంటున్నా అధినాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. అధిష్ఠానం పట్టించుకోకపోయినా తాము పార్టీ నుంచి మారే ప్రసక్తేలేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేకూర్చకపోయినా తమను నమ్ముకున్న అనుకూల నాయకులను, కార్యకర్తలను సముచితస్థానం కల్పించాలని వాపోతున్నారు.

టార్గెట్ జగన్!

కడప, జూన్ 7: ప్రతిపక్ష నేత విమర్శలకు ఆయన సొంతగడ్డ నుంచే సమాధానమిచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నవనిర్మాణ దీక్షల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం కడప నగరంలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ బహిరంగసభలో ముఖ్యమంత్రితోపాటు ఆయన తనయుడు లోకేష్, కేంద్ర,రాష్ట్ర ముఖ్య నాయకులు, మంత్రులు పాల్గొననున్నారు. జగన్‌ను టార్గెట్ చేసేందుకే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నవనిర్మాణ దీక్షల మహాసంకల్ప సభ ఒంగోలులో జరగాల్సి ఉంది.

పోలీసు నీడలో కడప..!

కడప,జూన్ 7: నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముగింపు దీక్షకు సిఎం చంద్రబాబు రాక సందర్భంగా భారీ స్థాయిలో పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం కడప జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తలపెట్టిన దీక్ష ముగింపు కార్యక్రమానికి భారీ ఎత్తున పోలీసులు మంగళవారం సాయంత్రానికి తరలివచ్చారు. గతంలో ఎన్నడూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ స్థాయిలో బందోబస్తు తరలిరాలేదు. 5వేల మంది పోలీసులు, 12 మంది ఐపిఎస్ అధికారులు, డిజిపితో సహా రాష్టప్రోలీసుయంత్రాంగంతోపాటు కడపకు తరలివచ్చారు. వాస్తవంగా ఈ సంకల్పదీక్ష మహాసభ తొలుత ఒంగోలులో నిర్వహించాల్సివుండగా చివరిక్షణంలో కడప జిల్లా కేంద్రానికి మార్పు చేశారు.

Pages