S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్చండి

కమలాపురం, జూన్ 7:చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించి నాణ్యమైన విద్య అందేలా చూడాలని ఐసిడియస్ ప్రాజెక్టు అధికారి శ్రీమతమ్మ కోరారు. మంగళవారం మండల పరిధిలోని నల్లింగాయపల్లె గ్రామంలో నిర్వహించిన అంగన్‌వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి ప్రారంభించనున్నట్లు తెలిపారు. చదువుతో పాటు ఉచితంగా పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంటెమ్మ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సునీత, కార్య కర్తలు,మహిళలు పాల్గొన్నారు.

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న సిఎం చంద్రబాబు

రాయచోటి, జూన్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నెలకోసారి జిల్లాకు వస్తున్నారు.. కానీ జిల్లాకు చేసిందేమీ లేదని అనవసరంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు. మంగళవారం సుండుపల్లె మండలంలోని వాయల్పాటివాండ్లపల్లె దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కాత్యాయని మోడ్రన్ స్కూల్‌ను మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నెలకోసారి జిల్లాకు వస్తున్నారు కానీ జిల్లాకు చేసిందేమీ లేదని అనవసరంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.

దళిత గిరిజనుల సంక్షేమానికి కృషి

కడప,జూన్ 7: దళిత గిరిజన సంక్షేమం కోసం శాయశక్తుల పాటుపడతానిన ఏపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెడ్పి సమావేశ మందిరంలో దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చైర్మన్ శివాజికి సన్మాన సభ జరిగింది. ఈసభకు హాజరైన శివాజి మాట్లాడుతూ నవ్యాంధ్రలో తనను ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కులవిక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ పోరాటం చేసి మనకోసం ఎన్నో హక్కులు కల్పించి రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలు ఆచరించే విధంగా మనం కృషి చేయాలన్నారు.

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

కడప,(క్రైం)జూన్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నిర్దేశిత ప్రాంతాలను కేటాయించడమైందని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తెలిపారు. పులివెందుల ప్రాంతం నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు బిల్టప్ సమీపంలోని ఈద్గా మైదానం, పుత్తా ఎస్టేట్, మరియాపురం చర్చి ప్రాంతాల్లో నిలపాలన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు దేవునికడపలోని కదిరి ప్రసాద్ కల్యాణ మండపం, ఏపి వేర్ హౌసింగ్ గోడౌన్, మార్కెట్‌లో నిలపాలన్నారు. రాయచోటి, రాజంపేటల నుంచి వచ్చే బస్సులు పోలీసుపేరేడ్ మైదానం, సిఎస్‌ఐ చర్చి ప్రాంతాల్లో వుంచాలన్నారు.

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి

నందలూరు, జూన్ 7:రాష్ట్రంలో ఎన్నో శతాబ్దాల కాలం నాటి మరుగుగన పడిన ఆలయాల అభివృద్ధికి సిఎం ఆదేశాల మేరకు కృషి చేస్తున్నట్లు దేవాదాయ శాఖ పర్యాటక డైరెక్టర్ రత్నకుమార్ తెలిపారు. మంగళవారం శ్రీ సౌమ్యనాథ ఆలయాన్ని పర్యాటక డైరెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ సుబ్బారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పురాతనమైన, శిల్పకళ సంపద కలిగిన ఆలయాలెన్నో మరుగున పడ్డాయన్నారు. ప్రత్యేకంగా మన రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు సిఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్భ్రావృద్ధి : విప్ మేడా

సుండుపల్లె, జూలై 7: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్భ్రావృద్ధి జరుగుతుందని విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన నవనిర్మాణదీక్షలో ఏడీ రాధాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మేడా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రూ.16 వేల కోట్లు లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, అలాగే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమకు కృష్ణా జలాల నుంచి నీరు వచ్చేందుకు సీఎం చంద్రబాబు విశేషకృషి చేస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

జగన్‌ది కిరాయి హంతకుల మనస్తత్వం

కడప,(కలెక్టరేట్)జూన్ 7: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కిరాయి హంతకులతో స్నేహం చేయడం వల్లే అతనికి కూడా నేరపూరిత మనస్తత్వం వచ్చిందని జిల్లా టిడిపి అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) విమర్శించారు. మంగళవారం జిల్లా టిడిపి కార్యాలయంలో కడప నియోజకవర్గం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిచూసి ఓర్వలేకే వైఎస్ జగన్ అనుచిత వాఖ్యలు చేస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో, గ్రామంలో రోడ్లు వెలిశాయన్నారు.

ఎరువుల దుకాణంపై దాడులు

గుత్తి, జూన్ 7 : పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న మన గ్రోమోర్ ఎరువుల దుకాణంపై మండల వ్యవసాయాధికారి వెంకట్రాముడు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణానికి సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిష్టర్‌లు పరిశీలించారు. గోడౌన్‌లో రికార్డులను పొందుపర్చకుండా నిల్వ ఉంచిన రూ.1.70 కోట్ల విలువజేసే ఎరువులను సీజ్ చేయడంతోపాటు ప్రభుత్వ అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.30 లక్షల కావేరీ పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

బాలిక ఆత్మహత్య

గుమ్మఘట్ట, జూన్ 7 : మండలంలోని భిటిఫ్రాజెక్ట్ గ్రామానికి చెందిన ఆశాబీ (17) సోమవారం రాత్రి అత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి గోరీబీ తెలిపిన వివారాల మేరకు తన కూతురిని అదే గ్రామానికి చెందిన బెస్త గంగన్న కూమారుడు బెస్త రఘు వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ఇందులో భాగంగానే సోమవారం బంధువుల ఇంటికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆశాబీని చితక బాదాడాని వాపోయింది. ఈ ఘటనలో తనను కూడా కొట్టాడని గోరీబీ తెలిపింది. దీంతో విరక్తి చెంది విష గుళికులు తినింది. దీంతో అపస్మారక స్థితికి చేరుకోడంతో రాయదుర్గం ప్రభుత్వ అసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

పొలుసుల జబ్బుకు దివ్యౌషధం

మానసిక, శరీర ఒత్తిడి నేటి నవీన యుగంలో ఎక్కువ కావడంతో ‘సోరియాసిస్’ వంటి చర్మవ్యాధుల బారిన చాలామంది పడుతున్నారు. మొదట్లో చర్మవ్యాధే కదా! అని నిర్లక్ష్యం చేయటం డాక్టర్ సలహా తీసుకోకపోవటం వలన ఈ వ్యాధి మరింత జఠిలమై మానసికంగా బాధిస్తుంది. సోరియాసిస్‌ను నిర్లక్ష్యం చేయకుండా ఆరంభంలోనే హోమియో చికిత్స తీసుకొని ఉపశమనం పొందవచ్చు.
ఈ వ్యాధి ఎక్కువగా ముంజేతి వెనుక భాగం, మోకాలు ముందు భాగం, తల, వీపు, ముఖం, చేతులు, పాదాల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646

Pages