S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైటెన్షన్

రాజమహేంద్రవరం, జూన్ 7: ఆకస్మిక ఉద్యమ నిర్ణయాలకు పెట్టింది పేరైన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి టెన్షన్ పుట్టించారు. గత రెండు రోజులుగా జిల్లాలో చర్చనీయాంశమైన తుని ఘటన అరెస్టుల నేపథ్యంలో మంగళవారం ముద్రగడ తనమార్కు ఉద్యమంతో ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులకు చెమటలు పట్టించారు. ఒక విధంగా ముద్రగడ, పోలీసులు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకుసాగారు. ఉదయం 8.30 గంటలకు అమలాపురంలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాజమహేంద్రవరం మీదుగా కిర్లంపూడి చేరుకుని, రాత్రి 8 గంటలకు ముగిసింది. మొత్తంమీద సుమారు 12 గంటలు ముద్రగడ ఉద్యమం రాష్టవ్య్రాప్త కలకలం రేపింది.

‘అమరావతి’ నిర్మాణమే అసలు సవాలు

అపార అనుభవశాలి, రాజకీయ చాణక్యుడు, ప్రతికూల పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకునే స్థితప్రజ్ఞుడు నారా చంద్రబాబునాయుడు నవ్యాం ధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ రెండేళ్ల కాలంలో మెరుపులెన్నో మరకలూ అన్ని. ఈ రెండేళ్లలో ఆయన ఎన్ని ప్రశంసలు పొందారో, విమర్శలూ, ఆరోపణలూ అదే స్థాయిలో మూట కట్టుకున్నారు.

- మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144

తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి మృతి

తిరుపతి, జూన్ 7: తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి మంగళవారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక లీలామహల్ జంక్షన్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం ఉదయం డిస్చార్జ్ అయ్యారు. సాయంత్రం హఠాత్తుగా తీవ్ర ఇబ్బందికి గురైన ఆయన చికిత్స కోసం వెళ్లారు. ఆసయమంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రిలోనే కన్నుమూశారు. విషయం తెలుసుకుని తిరుపతి ఎస్పీతోపాటు పలువురు పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు.

తిరుపతిలో ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు సర్వర్ల సమస్య

చిత్తూరు, జూన్ 7 : ఏపి ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ పక్రియ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఒక కేంద్రంలోను, తిరుపతిలో రెండు కేంద్రాల్లో కౌనె్సలింగ్ కొనసాగుతోంది. తొలి రోజున నిర్దేశించిన ఎన్‌ఐసి సర్వర్‌లో సాంకేతిక లోపంతో ఈ పక్రియలో జాప్యం అనివార్యమైంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అయితే రెండవరోజు మాత్రం కౌనె్సలింగ్ యధావిధిగా ప్రారంభమైంది. తిరుపతిలో మాత్రం రెండో రోజూ సర్వరుల డౌన్ అందినటుల సమాచారం అందింది.

జిల్లాలో భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

చిత్తూరు, జూన్ 7 : జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధజైన్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రాజెక్టులు నిర్దిష్ట కాలంలో పూర్తి చేయడానికి రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటి, ఐఐఎస్‌ఇఆర్‌లతో పాటు మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లకు భూసేకరణ వేగవంతం చేసి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు పనులు సరిగా చేయని కాంట్రాక్ట్ పనులను అవసరమైతే రద్దు చేయాలని ఆదేశించారు.

నవ్యాంధ్ర నిర్మాణానికి అందరి సహకారం అవసరం

కల్లూరు, జూలై 7 : నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అనేక కంపెనీలు వస్తుండటంతో నిరుద్యోగ యువతీ యువకులకు జాబులొస్తున్నాయని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సృష్టం చేశారు. పులిచెర్ల మండల కేంద్రంలో మంగళవారం నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి మంత్రి బొజ్జల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లిందని, నవ్యాంధ్ర నిర్మాణానికి అందరి సహకారం అవసరమని పిలుపునిచ్చారు.

జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం

చిత్తూరు, జూన్ 7 : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో చిత్తూరు, తిరుపతి డివిజన్లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మదనపల్లి డివిజన్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో ముందస్తు కురుస్తున్న వర్షాలు రైతులకు ఉపయుక్తం కానున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో తీవ్ర ఎండ వేడిమితో తల్లిడిల్లిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ముఖ్యంగా ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వర్షం కురుస్తుండటంతో సాగుకు రైతులు సమాయత్తం అయ్యారు.

ఊపిరాడని ఉనికి

వాయుకాలుష్యం వల్ల మానవుల ఆయుర్దాయం తగ్గిపోతోందన్నది మరోసారి జరిగిన ధ్రువీకరణ. కానీ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏవన్నది మాత్రం స్పష్టం కావడంలేదు. శాస్తజ్ఞ్రుల నిర్ధారణలో స్పష్టత లేదు, ప్రభుత్వాల విధానాలలో స్పష్టతలేదు. కాలుష్యం వల్ల ప్రాణాపాయం కలుగవచ్చునన్నది సామాన్య పరిజ్ఞానం. దీన్ని కనిపెట్టడానికి పరిశోధనలు అక్కరలేదు. కానీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకొని దేశ విదేశాలలోని స్వచ్ఛంద, ప్రభుత్వేతర ప్రభుత్వ సంస్థలెన్నో నిరంతరం పరిశోధన చేసి ఈ మహా విషయాన్ని మళ్లీ మళ్లీ కనిపెడుతూనే ఉన్నాయి. వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతోంది.

ఆశాజనకంగా టమోటా ధరలు

మదనపల్లె, జూన్ 7 : మదనపల్లె మార్కెట్‌లో మంగళవారం టమోటా కిలో 60 రూపాయలు పలుకింది. నెలరోజులుగా టమోటా ధరలు ఆశాజనకంగా కనిపిస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో మళ్లీ ఆనందం కనిపిస్తోంది. పడమటి ప్రాంతాల్లోని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, అంగళ్లు, కలికిరి, గుర్రంకొండ, పీలేరు, తదితర మార్కెట్‌లలో టమోటా గరిష్టంగా 60 రూపాయలు, కనిష్టంగా 55 రూపాయలు పలుకుతోంది. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల వ్యాపారులు పోటీపడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో రబీ ముగింపు ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు కాయల సైజు తగ్గడంతో అక్కడి వ్యాపారులు మదనపల్లె టమోటాలపై మక్కువ చూపుతున్నారు.

పాపవినాశనం మార్గంలో కారు బోల్తా

తిరుమల, జూన్ 7: తిరుమల పాపవినాశనం మార్గంలో మంగళవారం సాయంత్రం కారు బోల్తాపడిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు భక్తులు తీవ్రగాయాలకు గురయ్యారు. కర్ణాటక రాష్ట్రం తుమ్‌కూరుకు చెందిన ఓ భక్త బృందం శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోని దర్శనీయ ప్రాంతమైన పాపవినాశనం వెడుతుండగా ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు భక్తులను 108లో అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

Pages