S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్విచక్ర వాహనం బోల్తా...

వజ్రకరూరు, జూన్ 7 : ద్విచక్ర వాహనం బోల్తా పడి మండల పరిధిలోని చిన్నఓతూరు గ్రామానికి చెందిన బోయ నారాయణస్వామి (42) అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల మేరకు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న నారాయణ స్వామి ఉరవకొండలో విధులు ముగించుకుని వస్తుండగా గ్రామ సమీపంలో బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎస్సై జనార్దన్‌నాయుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

గుడిబండ, జూన్ 7 : మండల పరిధిలోని మోపురుగుండు గ్రామానికి చెందిన రైతు బాదెప్ప (45) విద్యుదాఘాతంతో మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాదెప్ప తన పొలంలో బోరు బావికి సంబంధించి స్టార్టర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు గుడిబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పొంగి పొర్లుతున్న ఇంకుడు గుంతలు

అమరాపురం, జూన్ 7 : మండల పరిధిలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పారంఫాండ్లు, ఇంకుడు గుంతలు పొంగి పొర్లుతున్నాయి. కె.శివరం, పి.శివరం, బసవనపల్లి తదితర గ్రామాల్లో కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో భూగర్భజలాలు పెంపొంది మరో ఏడాది పాటు బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా సకాలంలో వర్షాలు పడటంతో ఖరీఫ్ పంటకు ఎంతో అనువుగా ఉందని అంటున్నారు.

స్ర్తిశిశు సంక్షేమ శాఖకు అధిక ప్రాధాన్యత

గుత్తి, జూన్ 7 : రాష్ట్రంలోని 13 జిల్లాలో అదనంగా 700 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారని స్ర్తిశిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ స్వర్ణలత తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గుత్తి ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ జెడి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్ర్తిశిశు సంక్షేమ శాఖకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గించి ఆరోగ్యవంతమైన బిడ్డల పెరుగుదలకు ప్రభుత్వం ప్రాథమిక దశ నుంచే అవసరమైన ప్రోత్సాహం అందిస్తోందన్నారు.

అంజన్నకు సీతారామ పతకం వితరణ

గుంతకల్లు, జూన్ 7 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ప్రేమరెడ్డి కుటుంబ సభ్యులు శ్రీసీతారామలక్ష్మణులు కల్గిన బంగారు పతకాన్ని వితరణ చేశారు. ఈమేరకు మంగళవారం 119 గ్రాముల బంగారు పతకంతో పాటు చైన్‌ను స్వామివారికి సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైన్‌తో పాటు శ్రీసీతారామ లక్ష్మణ ప్రతిమలు కల్గిన పతకాన్ని స్వామివారి అలంకారంలో వినియోగించనున్నట్లు ఎఇఓ ధనుంజయ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

పుట్టపర్తి, జూన్ 7: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను గ్రామస్థాయిలోని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తిలోని హోటల్ టూరిజం నందు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఎన్‌టి.చౌదరి ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో బిజెపి పల్లె పల్లెకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. 2020నాటికి వ్యవసాయం ద్వారా ఆదాయం రెండింతలుగా పెంపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ కిసాన్ సంచాయ్ యోజన పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

ప్రజల మద్దతే టిడిపికి శ్రీరామరక్ష

కణేకల్లు, జూన్ 7 : తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతే శ్రీరామరక్ష అని చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ చిక్కణేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది టిడిపినే అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పేదలకు పింఛన్ ఇచ్చారన్నారు. ఆ మహా నాయకుడి ఆశీస్సులతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 200 వృద్ధాప్య పింఛన్ రూ.1000, వికలాంగ పింఛన్ రూ. 1500కు పెంచారన్నారు.

చెవులు ఎందుకు దిబ్బిళ్లు వేస్తాయి?

చెవిలో మూడు భాగాలని అందరికీ తెలుసు. అవి- బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి.
మధ్యచెవిలోని గాలి ఒత్తిడి, బయటి వాతావరణంలోని గాలి ఒత్తిడి సమం కానప్పుడు చెవులు దిబ్బిళ్ళు వేసి సరిగా వినిపించవు. మామూలుగా ముక్కు వెనుక భాగాన్ని, మధ్యచెవిని కలిపే యూస్టేచియన్ ట్యూబ్ ‘ఇయర్ డ్రమ్’కి రెండు వైపులా ఒత్తిడి సమంగా వుండేట్లు చూస్తుంటుంది. మధ్య చెవిలో గాలి తగ్గినపుడు- అంటే, అక్కడి గాలిని చెవి లోపలి పొర పీల్చేసినపుడు- యూస్టేచియన్ ట్యూబ్ సాయం చేస్తుంది. అలాంటి ట్యూబ్ బ్లాక్ అయితే- వాక్యూమ్ ఏర్పడి- ఇయర్ డ్రమ్‌ని లోపలకు లాగుతుంది. ఒక్కోసారి ఇది చాలా నొప్పిని కూడా కలిగిస్తుంది.

-డా మోహన్‌రెడ్డి..

కరిబసవ రాజేంద్రస్వామిపై క్రిమినల్ కేసులు ఉపసంహరణ

ఉరవకొండ, జూన్ 7 : పట్టణంలోని కరిబసవస్వామి గవిమఠం మాజీ ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామిపై నమోదైన క్రిమినల్ కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. రాజేంద్రస్వామిపై గవిమఠంలో జరిగిన అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రాజేంద్రస్వామి ఉరవకొండ మఠానికి చెందిన భూములను బళ్లారి పట్టణంలోని గ్రామీణ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2016 జనవరి 2న ఆర్జెసి బ్రమరాంభ ఉరవకొండ గవిమఠంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం 2016 ఫిబ్రవరిలో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు.

కార్మికుల సంక్షేమానికే జీఓ 279

హిందూపురం టౌన్, జూన్ 7 : మున్సిపాలిటీల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 279 అమలు చేస్తోందని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కన్నబాబు తెలిపారు. అయితే దీని పట్ల అధికారుల్లో సరైన అవగాహన లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి స్థానిక కౌన్సిల్ హాలులో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, కమిషనర్ ఎవివి భద్రరావుతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

Pages